లేఖన కథలు
మోషే మరియు ఇత్తడి సర్పము


“మోషే మరియు ఇత్తడి సర్పము,” పాత నిబంధన కథలు (2022)

“మోషే మరియు ఇత్తడి సర్పము,” పాత నిబంధన కథలు

సంఖ్యాకాండము 21

మోషే మరియు ఇత్తడి సర్పము

ప్రభువునందు విశ్వాసం కలిగియుండుటను నేర్చుకొనుట

జనులపై దాడిచేస్తున్న సర్పములు

ఇశ్రాయేలీయులు అరణ్యములో ప్రయాణం చేస్తున్నప్పుడు, తరచు వారు ప్రభువును మరిచి, ఫిర్యాదు చేశారు. వినయముగా ఉండి, ఆయనను జ్ఞాపకం చేసుకోవడంలో వారికి సహాయపడేందుకు ప్రభువు సర్పములను పంపారు. సర్పములు జనులను కాటువేశాయి మరియు వారిలో చాలామంది మరణించారు.

సంఖ్యాకాండము 21:1–6

మోషేను వేడుకుంటున్న జనులు

వెంటనే జనులు పశ్చాత్తాపపడ్డారు. సర్పాలు వెళ్ళిపోయేలా చేయడానికి ప్రభువును ప్రార్థించమని వారు మోషేను కోరారు. ప్రభువు సర్పాలను తీసివేయలేదు. కానీ జనులు కాటువేయబడినట్లైతే, వారు రక్షించబడే మార్గాన్ని ఆయన ఏర్పాటు చేసారు.

సంఖ్యాకాండము 21:7

ఇత్తడి సర్పమును పట్టుకొనియున్న మోషే

ఇత్తడితో ఒక సర్పాన్ని తయారు చేసి, దానిని ఒక స్తంభానికి అతికించమని ప్రభువు మోషేతో చెప్పారు. జనులు కాటువేయబడి ఇత్తడి సర్పము వైపు చూసినప్పుడు, ప్రభువు వారిని రక్షించారు. ఇశ్రాయేలీయులు వినయముగా కావడానికి మరియు ఆయనపై నమ్మకముంచడానికి ప్రభువు సహాయం చేసారు.

సంఖ్యాకాండము 21:8–9; 1 నీఫై 17:41; హీలమన్ 8:14–15