“ఎస్తేరు రాణి,” పాత నిబంధన కథలు (2022)
“ఎస్తేరు రాణి,” పాత నిబంధన కథలు
ఎస్తేరు 2–5; 7–9
ఎస్తేరు రాణి
అపాయకరమైన సమయంలో ధైర్యము
కొందరు ఇశ్రాయేలీయులు యూదులని పిలవబడ్డారు. ఎస్తేరు రాణి ఒక యూదురాలు, పర్షియాలో నివసించింది. ఆమె తల్లిదండ్రులు మరణించారు కనుక ఆమె బంధువైన మొర్దెకై ఆమెను సంరక్షించాడు. ఆమె దేశములోని మిగిలిన యువతులతో రాజు కోటలోనికి ఆహ్వానించబడింది. రాజు ఒక క్రొత్త రాణిని కోరాడు మరియు ఎస్తేరును ఎన్నుకున్నాడు.
రాజుకు హామాను అనే పేరుగల సేవకుడున్నాడు అతడు గొప్ప అధికారాన్ని పొందాడు. రాజు దేశాన్ని పరిపాలించడానికి హామాను సహాయం చేసాడు. ప్రతిఒక్కరు హామానుకు వంగి నమస్కరించేలా రాజు చేసాడు.
కాని మొర్దెకై హామానుకు వంగి నమస్కరించలేదు. మొర్దెకై ప్రభువుకు మాత్రమే వంగి నమస్కరిస్తాడు. ఇది హామానుకు కోపం కలిగించింది. అతడు మొర్దెకైను, యూదులందరిని శిక్షించాలని కోరాడు.
నిర్గమకాండము 20:5; ఎస్తేరు 3:5–6, 8
యూదులు రాజు చట్టములు పాటించడం లేదని హామాను రాజుతో చెప్పాడు. అందువలన రాజు హామానును ఒక క్రొత్త చట్టము చేయనిచ్చాడు: ఒక నియమించబడిన రోజు, యూదులందరు చంపబడతారు.
మొర్దెకై ఎస్తేరును రాజుతో మాట్లాడమని అడిగాడు. రాజు హామాను చట్టములను మార్చి, యూదులను రక్షించగలడు. కాని ఎస్తేరు భయపడింది. కొన్నిసార్లు ఆహ్వానము లేకుండా తనతో మాట్లాడటానికి వచ్చిన వారిని రాజు చంపాడు.
చంపబడబోయే యూదులను గూర్చి ఆలోచించమని మొర్దెకై ఎస్తేరును అడిగాడు. యూదులను రక్షించడానికే ప్రభువు ఎస్తేరును రాజు కోటలో ఉంచియుండవచ్చని మొర్దెకై చెప్పాడు.
తాను రాజుతో తప్పక మాట్లాడాలని, అందుకు ఆమె చంపబడగలదని ఎస్తేరుకు తెలుసు. యూదులు, తన సేవకులందరినీ తనతో కలిసి ఉపవాసం చేయమని ఎస్తేరు అడిగింది.
మూడు రోజులు ఉపవాసం చేసిన తరువాత, ఎస్తేరు తనను తాను సిద్ధపరచుకొని రాజును చూడటానికి వెళ్ళింది.
ఆమె రాజును సమీపించినప్పుడు, అతడు తన బంగారుదండమును పైకెత్తెను. ఆమెను చూడటానికి రాజు సంతోషిస్తున్నాడని, ఆమెను చంపడని దీని అర్థము. ఆమెకు ఏమి కావాలని అతడు అడిగాడు. తన ప్రజలు అపాయంలో ఉన్నారని ఎస్తేరు రాజుకు చెప్పింది. హామాను చట్టము వలన రాజ్యములోని యూదులందరు చంపబడతారు.
రాజు హామానుపై కోపపడి, అతడిని చంపించాడు. రాజు ఒక క్రొత్త చట్టమును చేసాడు, అది యూదులను కాపాడుతుంది. ఇప్పుడు ఎవరైనా వారిని గాయపరచడానికి ప్రయత్నిస్తే వారికై వారు కాపాడుకొనుటకు వారు అనుమతించబడ్డారు.
ప్రభువునందు ఎస్తేరుకు ఉన్న విశ్వాసము, రాజుతో మాట్లాడుటకు ఆమె ధైర్యము తన ప్రజలను కాపాడింది. మరణము, విచారమునకు బదులుగా అక్కడ విందు జరిగింది. యూదులు వేడుకు చేసుకున్నారు.