“యాకోబు, అతని కుటుంబం,” పాత నిబంధన కథలు (2022)
“యాకోబు, అతని కుటుంబం,” పాత నిబంధన కథలు
ఆదికాండము 27–33
యాకోబు, అతని కుటుంబం
ప్రభువు తన వాగ్దానములను ఎలా నెరవేరుస్తాడు
కోపంతో ఉన్న తన అన్న ఏశావు నుండి తప్పించుకోవడానికి యాకోబు తన ఇంటిని విడిచి వెళ్ళాడు. ప్రభువును ప్రేమించి, ఆయన ఆజ్ఞలను పాటించే స్త్రీని వెదకి, వివాహము చేసుకోమని యాకోబు తండ్రి అతడిని దీవించాడు.
యాకోబు ప్రయాణించినప్పుడు, ఒక దర్శనములో ప్రభువు అతడికి కనిపించాడు. ఆయన ఎల్లప్పుడు యాకోబుతో ఉంటానని వాగ్దానమిచ్చాడు. యాకోబు తాను పొందిన సమస్తములో ప్రభువుకు దశమభాగము చెల్లిస్తానని వాగ్దానము చేసాడు.
అతడు అనేకమంది పిల్లల్ని కలిగియుంటాడని ప్రభువు యాకోబుకు వాగ్దానము చేసాడు. యాకోబు పిల్లల ద్వారా, భూమి యొక్క కుటుంబాలు రక్షకుడిని తెలుసుకోవడానికి దీవించబడతాయి. యాకోబు కుటుంబం కడవరి దినాలలో ఇశ్రాయేలు సంతతిగా పిలువబడతారు.
ఆదికాండము 28:3–4, 14; 1 నీఫై 10:14
యాకోబు హారాను అను పేరుగల దేశానికి ప్రయాణించాడు. అతడు రాహేలు అనే పేరుగల నీతిగల స్త్రీని ప్రేమించాడు.
రాహేలును పెళ్ళి చేసుకొనుటకు అనుమతిస్తే, ఆమె తండ్రియైన లాబానుకు ఏడు సంవత్సరాలు పని చేయడానికి యాకోబు అంగీకరించాడు. అందుకు లాబాను అంగీకరించాడు. యాకోబు ఏడు సంవత్సరాలు పనిచేసాడు.
కానీ లాబాను తన పెద్ద కూతురు మొదట పెళ్ళి చేసుకోవాలని కోరాడు. వివాహ సమయంలో, యాకోబు రాహేలుకు బదులుగా లేయాను వివాహం చేసుకొనేలా లాబాను అతడిని మోసగించాడు. కానీ యాకోబు, రాహేలును ప్రేమించాడు. ఆమెను కూడా పెళ్ళి చేసుకొనుటకు అనుమతిస్తే అతడు మరొక ఏడు సంవత్సరాలు పని చేస్తానని వాగ్దానము చేసాడు. అందుకు లాబాను అంగీకరించాడు, మరియు యాకోబు కుటుంబం వృద్ధి చెందసాగింది.
ఆదికాండము 29:28–35; 30:3–13, 17–24; Jacob 2:27–30
లాబాను యాకోబుకు న్యాయంగా జీతమివ్వలేదు. కానీ ప్రభువు యాకోబును అనేక పశువులతో దీవించాడు మరియు ఇంటికి తిరిగి వెళ్ళమని చెప్పాడు.
ఆదికాండము 30:31, 43; 31:1–7, 17–18
తన ఇంటికి వెళ్ళే దారిలో యాకోబు తన అన్న ఏశావు, 400 మంది పురుషులు అతడిని కలుసుకోవడానికి వస్తున్నారని తెలుసుకున్నాడు.
ఏశావు తన మీద ఇంకా కోపంగా ఉన్నాడని యాకోబు అనుకున్నాడు. యాకోబు తన కుటుంబ భద్రత కోసం భయపడ్డాడు, కనుక అతడు వారిని ఒక సురక్షిత స్థలంలో ఉంచి ప్రార్ధన చేసాడు.
యాకోబు రాత్రంతా, ఉదయం వరకు ప్రార్ధన చేసాడు. ప్రభువు యాకోబును దర్శించి, అతడిని ఆశీర్వదించాడు. యాకోబు అనేకమందికి గొప్ప నాయకునిగా ఉంటాడని ప్రభువు అతడితో చెప్పాడు. ప్రభువు యాకోబు పేరును ఇశ్రాయేలుగా మార్చాడు.
త్వరలో ఏశావు, అతడి మనుష్యులు యాకోబు, అతడి కుటుంబాన్ని కనుగొన్నారు. ఏశావు యాకోబుతో ఇక కోపంగా లేడు. అతడు యాకోబును కలుసుకొని, అతడిని హత్తుకున్నాడు. అతడిని, అతడి కుటుంబాన్ని చూడటానికి అతడు చాలా సంతోషించాడు. ఏశావును మరలా చూసినందుకు యాకోబు కూడా సంతోషించాడు.
యాకోబు జీవితకాలమంతా అతడితో ఆయన వాగ్దానాలను ప్రభువు నెరవేర్చాడు. యాకోబు తన కుటుంబంతో ఇంటికి చేరుకొని, అక్కడ స్థిరపడ్డాడు. అప్పటి నుండి, యాకోబు ఇశ్రాయేలుగా పిలవబడ్డాడు మరియు అతడి కుటుంబం ఇశ్రాయేలీయులుగా పిలవబడ్డారు. అతడు ఆజ్ఞలను పాటించి, ప్రభువును ఆరాధించుట కొనసాగించాడు.