లేఖన కథలు
భూమి యొక్క సృష్టి


“భూమి యొక్క సృష్టి,” పాత నిబంధన కథలు (2022)

“భూమి యొక్క సృష్టి,” పాత నిబంధన కథలు (2022)

ఆదికాండము 1–2; మోషే 1–3; అబ్రాహాము 3–5

భూమి యొక్క సృష్టి

పరలోక తండ్రి పిల్లల కోసం ఒక సుందరమైన గృహము

విశ్వమును సృష్టిస్తున్న దేవుడు మరియు ప్రభువు

దేవుడైన మన పరలోక తండ్రి పరలోకములో రక్షణ ప్రణాళికను సమర్పించాడు. మనమందరం సంతోషంతో కేకలు వేసాము! మనము భూమి మీదకు వచ్చి ఒక భౌతిక శరీరాన్ని పొందుతాము. భూమి మీద ఉండగా, దేవుని కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తును అనుసరించడం మనం నేర్చుకుంటాము. దేవుని సూచనలను అనుసరించి ప్రభువు భూమిని సృష్టించాడు.

ఆదికాండము 1:1; యోబు 38:4–7; మోషే 1:32–33; 2:1; అబ్రాహాము 3:22–27

అంతరిక్షంలో గ్రహం

మొదటి దినమున, ప్రభువు చీకటి నుండి వెలుగును వేరు చేసాడు. ఆయన వెలుగును పగలు అని చీకటిని రాత్రి అని పిలిచాడు.

ఆదికాండము 1:3–5; మోషే 2:3–5; అబ్రాహాము 4:1–5

మేఘములు, మహాసముద్రము

రెండవ దినమున, ఆయన ఆకాశములో మేఘములను, భూమి మీద మహాసముద్రముల మధ్య నీటిని వేరు చేసాడు.

ఆదికాండము 1:6–8; మోషే 2:6–8; అబ్రాహాము 4:6–8

మహాసముద్రము ప్రక్కన అడవి

మూడవ దినమున, ప్రభువు గొప్ప మహాసముద్రములను మరియు ఆరిన నేలను ఏర్పాటు చేసాడు. ఆయన నీళ్ళకు సముద్రము అని ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు. ఆయన అందమైన పువ్వులు, పండ్ల చెట్లు మరియు మొక్కలతో నేలను అందముగా చేసాడు.

ఆదికాండము 1:9–13; మోషే 2:9–13; అబ్రాహాము 4:9–13

ఆదికాండము 1–2; మోషే 1–3; అబ్రాహాము 3–5

నాలుగవ దినమున, ఆయన పగటియందు ప్రకాశించుటకు సూర్యుడిని సృష్టించాడు. తరువాత ఆయన రాత్రియందు ప్రకాశించుటకు చంద్రుడిని, నక్షత్రాలను సృష్టించాడు.

ఆదికాండము 1:14–19; మోషే 2:14–19; అబ్రాహాము 4:14–19

సముద్ర ప్రాణులు

ఐదవ దినమున ప్రభువు సముద్రములో చేపలను, ఆకాశంలో పక్షులను సృష్టించాడు. అభివృద్ధిపొంది విస్తరించమని ఆయన ప్రాణులను, నీళ్ళను నింపుమని చేపలను దీవించాడు.

ఆదికాండము 1:20–23; మోషే 2:20–23; అబ్రాహాము 4:20–23

అడవి జంతువులు

ఆరవ దినమున, ఆయన భూమిపై కొన్ని నడిచేవి, కొన్ని ప్రాకే జంతువులను సృష్టించాడు.

ఆదికాండము 1:24–25; మోషే 2:24–25; అబ్రాహాము 4:24–25

ఏదెను తోటలో ఆదాము హవ్వలు

ఆరవ దినమున, పరలోక తండ్రి మరియు ప్రభువు భూమి మీదకు వెళ్ళారు. స్త్రీ పురుషులు దేవుని ప్రతిరూపంలో సృష్టించబడ్డారు. వారు ఒకరికొకరు సంరక్షించుకొని, పిల్లల్ని కలిగియుండమని పరలోక తండ్రి వారితో చెప్పాడు. భూమిని, జంతువులను సంరక్షించుటకు కూడా స్త్రీ పురుషులకు బాధ్యత ఇవ్వబడింది.

ఆదికాండము 1:26–27; మోషే 2:26–27; అబ్రాహాము 4:26–31; 5:7–8

జంతువులను చూస్తున్న ఆదాము హవ్వలు

వారు సృష్టించిన ప్రతి దానితో పరలోక తండ్రి సంతోషించాడు. ఏడవ దినమున, వారు తమ పని నుండి విశ్రాంతి తీసుకున్నారు. భూమి అందంగా ఉండి, ప్రాణులతో నిండియున్నది.

ఆదికాండము 2:1–3; మోషే 3:1–3; అబ్రాహాము 5:1–3