“యాకోబు మరియు ఏశావు,” పాత నిబంధన కథలు (2022)
“యాకోబు మరియు ఏశావు,” పాత నిబంధన కథలు
ఆదికాండము 25–27
యాకోబు మరియు ఏశావు
ఇద్దరు సహోదరులు మరియు ఒక జ్యేష్ఠత్వము
ఇస్సాకు, రిబ్కాలకు కవల పిల్లలైన యాకోబు మరియు ఏశావులు పుట్టారు. ఏశావు నిపుణుడైన వేటగాడు. యాకోబు సాధారణమైన జీవితం జీవించి, ప్రభువును అనుసరించాడు.
ఏశావు మొదట పుట్టినవాడు. సాధారణంగా మొదట పుట్టినవాడు తన తండ్రి నుండి జ్యేష్ఠత్వపు దీవెన పొందుతాడు. జ్యేష్ఠత్వము అనగా అతడు కుటుంబాన్ని నడిపిస్తాడు, కుటుంబం కొరకు శ్రద్ధ తీసుకోవడానికి సహాయపడటానికి ఎక్కువ భూమి, జంతువులను కలిగియుంటాడు. కాని ఏశావు తన కుటుంబం కంటె తన గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకొన్నాడు, అతడు తల్లిదండ్రులు మరియు ప్రభువుకు అవిధేయుడిగా ఉన్నాడు.
ఒకరోజు ఏశావు వేట నుండి తిరిగి వచ్చాడు. అతడికి చాలా ఆకలి వేసింది, తనకు ఆహారమివ్వమని యాకోబును వేడుకున్నాడు. జ్యేష్ఠత్వమును కలిగియుండుటకు ఏశావుకు యోగ్యత లేదు గనుక, దానిని యాకోబు కలిగియుండాలని ప్రభువు కోరాడు. కొంత ఆహారము కోసం తనకు జ్యేష్ఠత్వమును ఇవ్వమని ఏశావును, యాకోబు అడిగాడు. ఏశావు అంగీకరించాడు, యాకోబుకు తన జ్యేష్ఠత్వమును అమ్మివేసాడు.
ఆదికాండము 25:23, 29–34; హెబ్రీయులకు 11:20
రిబ్కా మరియు ఇస్సాకులు వారి పిల్లలకు శ్రేష్ఠమైన దానిని కోరారు. ప్రభువు కోరిన దానిని చేయకుండా ఏశావు తనకిష్టమైన విషయాలను చేస్తున్నందుకు వారు విచారించారు.
ఇస్సాకు వృద్ధుడై, గ్రుడ్డివాడయ్యాడు. అతడు చనిపోకముందు, అతను తినడానికి మరియు ఆనందించడానికి ఒక జంతువును వేటాడి, వండమని అతడు ఏశావును అడిగాడు.
జ్యేష్ఠత్వపు దీవెన ఇవ్వడానికి ఇస్సాకుకు ఇది సమయమని రిబ్కాకు తెలుసు.
రెండు పశువులను తెమ్మని రిబ్కా యాకోబును అడిగింది, ఆవిధంగా ఆమె ఏశావు రాకముందే ఆహారం వండగలదు. అప్పుడు యాకోబు దీవెన పొందవచ్చు.
యాకోబు ఏశావులా దుస్తులు ధరించి, అతడి తండ్రికి ఆహారము తెచ్చాడు. ఇస్సాకు యాకోబుకు జ్యేష్ఠత్వపు దీవెన ఇచ్చాడు. ఏశావు తిరిగి వచ్చినప్పుడు, అతడు యాకోబుపై చాలా కోపంగా ఉన్నాడు. కానీ యాకోబు ప్రభువు యొక్క ఆజ్ఞలను పాటించాడు గనుక, జ్యేష్ఠత్వము అతడికి వెళ్ళింది మరియు ఏశావు ఆజ్ఞలను పాటించలేదు.