“రాహాబు మరియు వేగులవారు,” పాత నిబంధన కథలు (2022)
“రాహాబు మరియు వేగులవారు,” పాత నిబంధన కథలు
రాహాబు మరియు వేగులవారు
ఒక కుటుంబాన్ని కాపాడే ఎంపిక
ఇశ్రాయేలీయులు యెరికోను జయించే ముందు దానిలో రాహాబు అనే స్త్రీ నివసించింది. ఇశ్రాయేలీయుల కోసం ప్రభువు ఎఱ్ఱ సముద్రాన్ని విభజించాడని ఆమె విన్నది. తన నగరంపై పోరాడడానికి ఇశ్రాయేలీయులకు ప్రభువు సహాయం చేస్తాడని రాహాబుకు తెలుసు. యెరికోలోని ప్రజలు దుర్మార్గులు.
ప్రవక్తయైన యెహోషువ ఇశ్రాయేలు సైన్యాన్ని నడిపించాడు. అతడు ఇద్దరు వేగులను యెరికోలోనికి పంపించాడు. కానీ వేగులవారు కనిపించడం వలన వారిని బంధించడానికి యెరికో రాజు మనుష్యులను పంపాడు.
రాహాబు ఇంటికి వేగులవారు వచ్చారు. రాహాబు వేగులవారికి సహాయం చేయడానికి అంగీకరించింది, కాబట్టి ఆమె వారిని తన మిద్దెపై దాచిపెట్టింది.
రాజు మనుష్యులు రాహాబు ఇంటిని వెదికారు, కానీ వారు వేగులవారిని కనుగొనలేకపోయారు. వారు వెళ్ళిన తరువాత, యెరికోపై పోరాడడానికి ఆ వేగులవారి సైన్యం వచ్చినప్పుడు తన కుటుంబాన్ని కాపాడమని రాహాబు వారిని కోరింది. ఆమె కుటుంబం సురక్షితంగా ఉంటుందని వేగులవారు రాహాబుకు హామీ ఇచ్చారు. అప్పుడు వేగులవారు తప్పించుకోవడానికి రాహాబు తన కిటికీలో నుండి తాడు విసిరింది.
వేగులవారు ప్రవక్తయైన యెహోషువ యొద్దకు తిరిగి వచ్చారు మరియు రాహాబు ఇంట్లో ఎవరికీ హాని చేయవద్దని ఇశ్రాయేలు సైన్యానికి చెప్పారు. తరువాత, ఇశ్రాయేలీయులు యెరికోతో పోరాడినప్పుడు, వారు రాహాబుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. రాహాబు ధైర్యము తన కుటుంబాన్ని కాపాడింది. ఆమె కుటుంబము ప్రభువు యొక్క జనులతో చేరింది.