లేఖన కథలు
ప్రవక్తయైన మలాకీ


“ప్రవక్తయైన మలాకీ,” పాత నిబంధన కథలు (2022)

“ప్రవక్తయైన మలాకీ,” పాత నిబంధన కథలు

మలాకీ 13

ప్రవక్తయైన మలాకీ

దశమభాగ చట్టమును జీవించుట

చెడు దశమభాగమును ఇస్తున్న జనులు

వారి పంటలు మరియు పశువులలో పదోవంతును ప్రభువుకు ఇవ్వడం ద్వారా యూదులు దశమభాగం చెల్లించారు. వారు దశమభాగం చెల్లించినప్పుడు ప్రభువు వారిని దీవించారు. కానీ కొంతమంది యూదులు తమ దశమభాగంగా చెడిపోయిన రొట్టె లేదా గ్రుడ్డి లేదా రోగముతోనున్న పశువులను ఇవ్వడం మొదలుపెట్టారు. మంచి వాటిని వారి కోసం ఉంచుకున్నారు.

ఆదికాండము 14:20; 28:22; ద్వితీయోపదేశకాండము 12:6, 11, 17; మలాకీ 1:7–8, 12–13

జనులకు బోధిస్తున్న మలాకీ

ప్రభువు సంతోషంగా లేరు. దశమభాగమును చెల్లించడంలో వారు నిజాయితీగా లేనప్పుడు, వారు ప్రభువు వద్ద దొంగతనం చేస్తున్నారని ప్రవక్తయైన మలాకీ యూదులకు చెప్పాడు. పశ్చాత్తాపపడమని మలాకీ వారితో చెప్పాడు.

మలాకీ 3:8–9

నిజాయితీగా దశమభాగమును ఇస్తున్న జనులను గమనిస్తున్న మలాకీ

ప్రభువు యూదులకు ఒక వాగ్దానమిచ్చారు. వారు నిజాయితీగా దశమభాగమును ఇచ్చినట్లయితే, పరలోకం నుండి ప్రభువు గొప్ప దీవెనలను క్రుమ్మరిస్తారు.

మలాకీ 3: 10–12