“దావీదు మహారాజు,” పాత నిబంధనలు కధలు (2022)
“దావీదు మహారాజు,” పాత నిబంధనలు కధలు
1 సమూయేలు18–19; 31; 2 సమూయేలు 1; 5; 11–12
దావీదు మహారాజు
ఒక రాజు యొక్క కష్టాలు
ఇశ్రాయేలు రాజైన సౌలు గొల్యాతుపై దావీదు సాధించిన విజయంతో ఆకట్టుకోబడ్డాడు. సౌలు దావీదును తన సైన్యములపై నాయకునిగా చేసాడు.
దావీదు ప్రభువును ప్రేమించాడు మరియు సరైన దానిని చేయాలని ఎల్లప్పుడు కోరుకున్నాడు. ఇశ్రాయేలీయులు దావీదును ప్రేమించారు.
సౌలు అసూయపడి దావీదును చంపడానికి ప్రయత్నించాడు. కానీ దావీదు ప్రభువును అనుసరించాడు మరియు ప్రభువు అతడిని సౌలునుండి కాపాడాడు.
ఇశ్రాయేలీయులు అనేక యుద్ధాలలో పోరాడారు. ఒక రోజు సౌలు మరియు అతడి కుమారులు యుద్ధములో చనిపోయారు. దావీదు వారిని ప్రేమించాడు మరియు వారి మరణాల గురించి తెలుసుకొని చాలా విచారించాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులకు ఒక క్రొత్త రాజు అవసరము. ప్రభువు దావీదును రాజుగా ఏర్పరుచుకున్నాడు. జనులు సంతోషించారు.
1 సమూయేలు 31:2–6;2 సమూయేలు1:11–12; 5:1–5
ప్రభువు రాజైన దావీదును దీవించి, అతడి నడిపించాడు. ప్రభువు సహాయంతో దావీదు సైన్యము వారి శత్రువులను జయించింది.
ఒక రోజు దావీదు యుద్ధానికి వెళ్ళవలసి ఉంది, కానీ అతడు ఇంట్లోనే ఉన్నాడు. అతడు ఒక అందమైన స్త్రీని చూసాడు. ఆమె పేరు బత్షేబా, దావీదు ఆమెను వివాహము చేసుకోవాలనుకున్నాడు. దావీదు సైన్యములోని ఒక సైనికుడైన ఊరియాతో ఆమెకు ఇదివరకే వివాహము జరిగింది.
దావీదు బత్షేబాను వివాహం చేసుకోవాలనుకున్నాడు, కనుక అతడు ఆమె భర్త ఊరియాను ప్రమాదకరమైన యుద్ధములోనికి పంపాడు, తద్వారా ఊరియా చంపబడతాడు.
త్వరలో దావీదు ఊరియా యుద్ధములో చనిపోయాడని తెలుసుకున్నాడు. దావీదు తన సేవకులను పంపి బత్షేబాను తన ఇంటికి రప్పించి, ఆమెను వివాహము చేసుకున్నాడు.
కాని దావీదు చేసిన దానితో ప్రభువు సంతోషంగా లేడు. దావీదు చేసిన పాపము ఎంత తీవ్రమైనదో చెప్పడానికి ప్రభువు నాతాను అను ఒక ప్రవక్తను పంపాడు. ఊరియా మరియు బత్షేబాలకు తాను చేసిన దాని కొరకు దావీదు చాలా విచారం చెందసాగాడు. అతడు ప్రభువు నుండి క్షమాపణ కొరకు పార్థించాడు, ఉపవాసమున్నాడు.