“ప్రవక్తయైన సమూయేలు,” పాత నిబంధన కథలు (2022)
“ప్రవక్తయైన సమూయేలు,” పాత నిబంధన కథలు
1 సమూయేలు 2–3
ప్రవక్తయైన సమూయేలు
ఒక బాలుడు ప్రభువు చేత పిలవబడ్డాడు
చాలాకాలము ఇశ్రాయేలీయులను నడిపించడానికి ప్రభువు యొక్క ప్రవక్తను వారు కలిగిలేరు. బదులుగా, అనేక సంవత్సరాలుగా న్యాయాధిపతులు ఇశ్రాయేలును పరిపాలించారు. ఈ సమయములో హన్నా తన యౌవన కుమారుడైన సమూయేలును ఇశ్రాయేలు యొక్క యాజకుడు, న్యాయాధిపతియైన ఏలీతో నివసించడానికి తీసుకొనివచ్చింది. సమూయేలు దేవాలయంలో ఏలీకు సహాయపడ్డాడు.
ఏలీ యొక్క ఇద్దరు కుమారులు కూడా దేవాలయంలో సేవ చేస్తున్నారు, కానీ వారు ప్రభువు కొరకు ఉద్దేశించబడిన అర్పణలను దొంగిలించారు. కొందరు ఏలీకి ఫిర్యాదు చేసారు, కానీ ఏలీ వారిని శిక్షించలేదు.
ఒక సాయంత్రం సమూయేలు ఒక స్వరము తనను పిలవడం విన్నాడు. అది ఏలీ స్వరము అనుకొని సమూయేలు అతడి వద్దకు వెళ్ళాడు. కానీ ఏలీ అతడిని పిలవలేదు. సమూయేలును వెళ్ళి పడుకోమని ఏలీ చెప్పాడు.
ఆ స్వరము అతడిని రెండవసారి పిలవడం సమూయేలు విన్నాడు. అతడు ఏలీ వద్దకు వెళ్ళి అతడికి ఏమి కావాలని అడిగాడు. కానీ ఏలీ అతడిని పిలవలేదు. సమూయేలును వెళ్ళి పడుకోమని ఏలీ చెప్పాడు.
ఆ స్వరము అతడిని మూడవసారి పిలవడం సమూయేలు విన్నాడు. అతడు మరలా ఏలీ వద్దకు వెళ్ళి అతడి ఏమి కావాలని అడిగాడు. సమూయేలుతో మాట్లాడుచున్నది ప్రభువు అని ఈసారి ఏలీ తెలుసుకొన్నాడు. సమూయేలును వెళ్ళి పడుకోమని ఏలీ చెప్పాడు. ప్రభువు మరలా పిలిస్తే, సమూయేలు వినాలని ఏలీ చెప్పాడు.
ఆ స్వరము మరలా అతడిని పిలుచుట సమూయేలు విన్నాడు. ఈసారి, ప్రభువును మాట్లాడమని, తాను వింటానని సమూయేలు అడిగాడు. ఏలీ దుష్టులైన తన కుమారులను దేవాలయములో సేవ చేయనిచ్చుట తప్పని ప్రభువు సమూయేలుతో చెప్పాడు. ఏలీ కుటుంబము ఇకమీదట దేవాలయంలో సేవ చేయడానికి అనుమతించబడరు.
మరుసటి రోజు, ప్రభువు ఏమి చెప్పాడని ఏలీ సమూయేలును అడిగాడు. సమూయేలు అతడికి చెప్పాడు. సమూయేలు ద్వారా ప్రభువు మాట్లాడాడని ఏలీకి తెలుసు.
ఈ వార్త ఇశ్రాయేలు దేశమంతా వ్యాప్తిచెందింది. తన ప్రవక్తగా ఉండుటకు సమూయేలును ప్రభువు ఏర్పరిచాడని జనులకు తెలుసు.