Scripture Stories
ప్రవక్త్రియైన దెబోరా


“ప్రవక్త్రియైన దెబోరా,” పాత నిబంధన కథలు (2022)

“ప్రవక్త్రియైన దెబోరా,” పాత నిబంధన కథలు

న్యాయాధిపతులు 4–5

ప్రవక్త్రియైన దెబోరా

ఇశ్రాయేలీయులు ప్రభువును నమ్మడానికి సహాయపడిన ఒక నాయకురాలు

చిత్రం
ప్రవక్త్రియైన దెబోరా

దెబోరా ఒక ప్రవక్త్రి, నమ్మకమైన ఇశ్రాయేలు నాయకురాలు, ఆమె ప్రభువుచేత ప్రేరేపించబడింది. ఆమె జనులు ప్రభువు ఆజ్ఞలను గైకొనడం మానివేశారు మరియు కనానీయులు వారిని పరిపాలించారు. ఇరవై సంవత్సరాల తరువాత, ఇశ్రాయేలీయులు ప్రభువు సహాయం కొరకు ప్రార్థించడం ప్రారంభించారు.

న్యాయాధిపతులు 4:1–5

చిత్రం
ప్రార్థిస్తున్న దెబోరా

ప్రభువు వారి ప్రార్థనలు విన్నారు. కనానీయులతో పోరాడడానికి ఇశ్రాయేలీయుల సైన్యాన్ని సమకూర్చమని ఆయన దెబోరాకు చెప్పారు.

న్యాయాధిపతులు 4:6

చిత్రం
సైనికులతో మాట్లాడుతున్న దెబోరా

కనానీయుల సైన్యము అనేకమంది సైనికులను, రథములను కలిగియున్నది. ఇది ఇశ్రాయేలీయుల సైన్యమును భయపడేలా చేసింది, కానీ దెబోరాను కాదు. ప్రభువు వారికి సహాయము చేస్తారని ఆమెకు తెలుసు.

న్యాయాధిపతులు 4:3, 7

చిత్రం
దెబోరాను రమ్మని అడుగుతున్న బారాకు

బారాకు ఇశ్రాయేలీయుల సైన్యానికి నాయకుడు. యుద్ధము చేయడం అతనికి ఇష్టము లేదు. కానీ దెబోరా సైన్యముతో వెళ్ళినట్లయితే, ప్రభువు వారిని కాపాడతారని అతడు అనుకున్నాడు. వెళ్ళడానికి దెబోరా అంగీకరించింది. కనానీయుల సైన్యానికి నాయకుడైన సీసెరాను ఒక స్త్రీ ఓడిస్తుందని ఆమె ప్రవచించింది.

న్యాయాధిపతులు 4:8–9

చిత్రం
పర్వతముపైన దెబోరా మరియు సైన్యము

ఇశ్రాయేలీయుల సైన్యము ఒక పర్వతముపైన సమకూడింది మరియు కనానీయులు లోయలో సమకూడారు. పర్వతముపైనుండి క్రిందకు వెళ్ళమని బారాకుతో దెబోరా చెప్పింది. ప్రభువు వారితో ఉంటారని ఆమె వాగ్దానం చేసింది.

న్యాయాధిపతులు 4:12–14

చిత్రం
తుఫానులో కొట్టుకొనిపోతున్న రథములు

ప్రభువు వర్షమును పంపగా, కనానీయుల రథములు నీటిలో కొట్టుకొనిపోయాయి. అనేకమంది కనానీయులు నదిలో మునిగిపోయారు, కానీ సీసెరా పారిపోయాడు.

న్యాయాధిపతులు 4:15, 17; 5:4–5, 19–22

చిత్రం
గుడారములోనికి సీసెరాను ఆహ్వానిస్తున్న యాయేలు

సమీప గుడారములో యాయేలు అనబడే ఒక స్త్రీ నివసించింది. సీసెరా పరుగెత్తడాన్ని చూసిన ఆమె, తన గుడారములోనికి రమ్మని అతడికి చెప్పింది. అతడు కనానీయుల సైన్యమునకు నాయకుడని యాయేలుకు తెలుసు మరియు మరింతమందికి హాని కలుగజేయకుండునట్లు ఆమె అతడిని చంపింది.

న్యాయాధిపతులు 4:15–21

చిత్రం
ప్రశాంతంగా ఉన్న పట్టణాన్ని చూస్తున్న దెబోరా

దెబోరా ప్రవచనము నెరవేరింది. ఒక వీర వనిత చేత సీసెరా ఓడించబడ్డాడు. ప్రభువు ఏవిధంగా ఇశ్రాయేలీయులను కాపాడారో వారు జ్ఞాపకముంచుకోవడంలో సహాయము చేయడానికి దెబోరా ఒక కీర్తన పాడింది. ఇశ్రాయేలీయులు ఆజ్ఞలను గైకొని, 40 సంవత్సరాలు సమాధానముతో జీవించారు.

న్యాయాధిపతులు 5:1, 24–27, 31

ముద్రించు