“రూతు, నయోమి,” పాత నిబంధన కథలు (2022)
“రూతు, నయోమి,” పాత నిబంధన కథలు (2022)
రూతు 1–4
రూతు, నయోమి
ప్రేమ, విధేయతతో కష్టాలనుండి బయటపడుట
నయోమి మరియు ఆమె కుటుంబము మోయబుకు వెళ్ళింది ఎందుకనగా యూదా దేశంలో తగినంత ఆహారం లేదు. తరువాత నయోమి భర్త చనిపోయాడు. నయోమి కుమారులు మోయబు స్త్రీలైన ఓర్పా మరియు రూతులను పెండ్లి చేసుకున్నారు. వారు 10 సంవత్సరాలు నయోమిని జాగ్రత్తగా చూసుకున్నారు.
తరువాత ఓర్పా, రూతుల భర్తలు చనిపోయారు. ఇప్పుడు ఆ స్త్రీలు ఒంటరివారు అయ్యారు. నయోమి ఓర్పా, రూతులకు ఆహారము ఇవ్వలేకపోయింది.
ఓర్పా తన ఇంటికి తిరిగి వెళ్ళింది. కానీ రూతు నయోమితో ఉండి, తనను జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంది. యూదా దేశములో మరలా పంటలు పండుతున్నాయని రూతు నయోమిలు విన్నారు, కనుక వారు అక్కడికి ప్రయాణించారు.
రూతు, నయోమి కోతకాలంలో యూదా చేరుకున్నారు. వారికి ఆహారం అవసరము. నయోమి బంధువు పేరు బోయజు, అతడు యూదాలో పొలాలను కలిగియున్నాడు. అతడు రూతును తన పొలములో మిగిలిన ధాన్యము ఏరుకోనిచ్చాడు. అది కష్టమైన పని.
ఆమె కష్టపడి పనిచేస్తుంది, ఆమె నయోమికి మరియు ప్రభువుకు విధేయతగా ఉన్నది కనుక బోయజు రూతును గౌరవించాడు. రూతు కోసం ఎక్కువ ధాన్యం విడువమని అతడు సేవకులకు చెప్పాడు.
రూతు ఒక కుటుంబాన్ని కలిగి ఉండాలని నయోమి కోరింది. బోయజును పెండ్లి చేసుకోమని ఆమె రూతును ప్రోత్సహించింది. ఆమె, బోయజు పెండ్లి చేసుకుంటే వారు కలిసి నయోమిని బాగా చూసుకోగలరని రూతుకు తెలుసు.
తనను పెండ్లి చేసుకోమని బోయజును అడగాలని రూతు నిర్ణయించింది. రూతు విధేయత, సుగుణముగల స్త్రీ అని బోయజుకు తెలుసు. అతడు ఒప్పుకున్నాడు.
రూతు, బోయజు వివాహం చేసుకున్నారు. త్వరలో రూతుకు ఒక మగ బిడ్డ పుట్టాడు. అతడు భవిష్యత్తు రాజైన దావీదు యొక్క తాత అయ్యాడు. అనేక సంవత్సరాల తరువాత, యేసు క్రీస్తు ఈ కుటుంబ వంశావళిలో జన్మించాడు.