లేఖన కథలు
ప్రవక్తయైన మోషే


“ప్రవక్తయైన మోషే,” పాత నిబంధన కథలు (2022)

“ప్రవక్తయైన మోషే,” పాత నిబంధన కథలు

నిర్గమకాండము 2–3

ప్రవక్తయైన మోషే

ప్రభువు యొక్క జనులను విడిపించడానికి పిలవబడ్డాడు

ఇశ్రాయేలీయుడ్ని కొడుతున్న ఐగుప్తీయుడు

ఫరో కుమార్తె యొక్క కొడుకుగా మోషే పెద్దవాడయ్యాడు. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులతో నీచంగా ఉండటం మోషే చూసాడు. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను వారి బానిసలుగా చేసారని అతడు విచారించాడు.

నిర్గమకాండము 2:10–11

ఇశ్రాయేలీయుడ్ని రక్షిస్తున్న మోషే

ఒకరోజు ఐగుప్తీయుడు ఇశ్రాయేలీయుడ్ని కొట్టడం మోషే చూసాడు. మోషే ఇశ్రాయేలీయుడ్ని రక్షించడానికి, ఐగుప్తీయుడ్ని చంపాడు.

నిర్గమకాండము 2:11–14

అరణ్యములో మోషే

ఆ సంగతిని ఫరో కనుగొన్నప్పుడు, అతడు మోషేను చంపాలనుకున్నాడు, కానీ మోషే ఐగుప్తు నుండి పారిపోయాడు.

నిర్గమకాండము 2:15

మోషే మరియు అతని కుటుంబము

మోషే మిద్యాను అని పిలవబడిన ప్రదేశానికి వచ్చాడు, అక్కడ అతడు సిప్పోరా అనే పేరుగల స్త్రీను కలుసుకున్నాడు. వారు పెండ్లి చేసుకున్నారు మరియు వారికి పిల్లలు కలిగారు.

నిర్గమకాండము 2:21–22

మండుతున్న పొదను చూస్తున్న మోషే

మిద్యానులో నివసిస్తుండగా, మోషే మండుతున్న పొదను చూసాడు కానీ మంట పొదను కాల్చలేదు. ప్రభువు అగ్నిలో కనబడి, మోషేతో మాట్లాడాడు.

నిర్గమకాండము 3:1–6

మోషేతో మాట్లాడుచున్న యేసు

ఐగుప్తులో ఇశ్రాయేలీయులు బాధపడుతున్నారని ఆయనకు తెలుసని ప్రభువు చెప్పాడు. ఐగుప్తుకు తిరిగి వెళ్ళి, ఇశ్రాయేలీయులను విడిచిపెట్టమని ఫరోతో చెప్పమని ఆయన మోషేకు ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలీయులను విడిపించడానికి ఆయన మోషేకు సహాయపడతానని, ఒక వాగ్దాన దేశమునకు వారిని నడిపిస్తానని ప్రభువు చెప్పాడు.

నిర్గమకాండము 3:7–18