“దావీదు మరియు గొల్యాతు,” పాత నిబంధన కథలు (2022)
“దావీదు మరియు గొల్యాతు,” పాత నిబంధన కథలుSt
1 సమూయేలు 17
దావీదు మరియు గొల్యాతు
భారీకాయుని సవాలును ఎదుర్కొనుట
ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను ముట్టడి చేస్తున్నారు. ప్రతీ ఉదయము గొల్యాతు అను పేరుగల భారీ ఫిలిష్తీయుడు ఇశ్రాయేలీయుడు ఎవరైనా తనతో యుద్ధము చేయమని సవాలు చేసాడు. గొల్యాతు అందరికంటే పెద్దగా, ఎత్తుగా అతి భయంకరముగా ఉన్నాడు. అతను భారీ కవచాన్ని ధరించాడు, కత్తి, ఈటె మరియు పెద్ద కవచాన్ని తీసుకున్నాడు. అతడితో యుద్ధము చేయడానికి ఎవరూ సాహసం చేయలేదు.
దావీదు గొఱ్ఱెలు కాయు బాలుడు, అతడు ప్రభువునందు విశ్వాసము కలిగియున్నాడు. అతడి అన్నలు ఇశ్రాయేలీయ సైన్యములో సైనికులు. ఒకరోజు దావీదు తన అన్నలకు ఆహారాన్ని తీసుకొనివెళ్ళాడు. సైనిక విడిది వద్దకు వచ్చినప్పుడు, గొల్యాతు యొక్క సవాలును అతడు విన్నాడు.
ఎందుకు ఇశ్రాయేలును ఎవరూ రక్షించడం లేదని దావీదు సైనికులను అడిగాడు. అతడి అన్నలకు కోపం వచ్చి అతడిని వెళ్ళిపోమని, గొఱ్ఱెలను మేపమని అతడికి చెప్పారు. కానీ ప్రభువు ఇశ్రాయేలును కాపాడతాడని దావీదుకు తెలుసు.
సౌలు రాజుకు దావీదు యొక్క విశ్వాసము తెలుసు గనుక, అతడు దావీదును చూడాలని అడిగాడు. గొల్యాతుతో పోరాడటానికి తాను భయపడటంలేదని దావీదు సౌలుతో చెప్పాడు. దావీదు ఒకసారి తన గొఱ్ఱెలను మేపుతుండగా, అతడు ఒక సింహమును, ఒక ఎలుగుబంటిని చంపానని అతడు వివరించాడు. అప్పుడు ప్రభువు అతడిని కాపాడాడు, ఇప్పుడు ప్రభువు అతడిని కాపాడతాడని దావీదుకు తెలుసు.
సౌలు దావీదుకు తన కవచమును ఇచ్చాడు. కానీ అది సరిపోలేదు గనుక, దావీదు దానిని తీసివేసాడు. ఏ కవచము ధరించకుండా పోరాడాలని అతడు నిర్ణయించుకొన్నాడు.
దావీదు ఐదు నునుపైన రాళ్ళను సేకరించి, వాటిని ఒక సంచిలో వేసాడు. అతడు తన ఒడిసెలను, గొఱ్ఱెల కాపరి కర్రను తీసుకొని, గొల్యాతును ఎదుర్కొవడానికి వెళ్ళాడు.
గొల్యాతు దావీదును చూసిప్పుడు, అతడు కేకలు వేసి, అతడిని ఎగతాళి చేసాడు. కాపరి బాలుడు తనను ఓడించలేడని అతడు అన్నాడు. తాను నమ్మిన ప్రభువు అతడిని కాపాడతాడని దావీదు తిరిగి కేక వేసాడు! ప్రభువు యొక్క గొప్పతనమును చూపుటకు గొల్యాతును తాను ఓడిస్తానని దావీదు చెప్పాడు.
దావీదు గొల్యాతువైపు పరుగెత్తాడు. అతడు త్వరగా ఒక రాయిని తన ఒడిసెలతో విసిరాడు. ఆ రాయి గొల్యాతును నుదిటిపై కొట్టింది, భారీ వ్యక్తి నేలపై పడ్డాడు. ఒక కత్తి లేక ఆయుధము లేకుండా దావీదు గొల్యాతును ఓడించడానికి ప్రభువు సహాయపడ్డాడు.
ఫిలిష్తీయులు గొల్యాతు చనిపోవడం చూసినప్పుడు, భయంతో వారు పరుగెత్తారు. ఇశ్రాయేలీయులు యుద్ధమును గెలిచారు. దావీదు ప్రభువునందు విశ్వసించాడు, మరియు ప్రభువు ఇశ్రాయేలీయులను కాపాడాడు.