“షద్రకు, మేషాకు, అబేద్నగో,” పాత నిబంధన కథలు (2022)
“షద్రకు, మేషాకు, అబేద్నగో,” పాత నిబంధన కథలు
దానియేలు 1; 3
షద్రకు, మేషాకు, అబేద్నగో
విశ్వాసమునకు ప్రమాదకరమైన పరీక్ష
నెబుకద్నెజరు రాజు ఒక పెద్ద బంగారు ప్రతిమను చేయించాడు, దానిని పూజించమని తన జనులను అతడు బలవంతం చేసాడు. వారు తిరస్కరిస్తే, అగ్నిగుండంలో పడవేయబడతారు.
దానియేలు యొక్క స్నేహితులైన షద్రకు, మేషాకు, అబేద్నగోలు దేవుడిని ప్రేమించారు మరియు రాజు యొక్క అబద్ధపు దేవతను పూజించరు. రాజు వారిమీద కోపపడ్డాడు.
దేవుడిని మాత్రమే పూజిస్తామని ముగ్గురు స్నేహితులు రాజుతో చెప్పారు. వారిని దేవుడు కాపాడతారని వారు నమ్మారు. కానీ ఆయన వారిని రక్షించక పోయినప్పుడు కూడా, వారు తాము నమ్మిన దాని కొరకు నిలబడతారు.
షద్రకు, మేషాకు, అబేద్నగోలపై రాజు కోపపడ్డాడు. అతడు వారిని అగ్నిగుండంలో పడద్రోయించాడు. కానీ రాజు అగ్నిగుండంలోనికి చూసినప్పుడు, అతడు ముగ్గురు మనుష్యులతో పాటు అగ్నిలో ఒక పరలోకపు వ్యక్తిని చూచి ఆశ్చర్యపడ్డాడు. వారు అగ్నిచేత గాయపరచబడలేదు.
షద్రకు, మేషాకు, అబేద్నగోలను రాజు పిలిచాడు, మరియు వారు అగ్నిగుండంలో నుండి బయటకు నడిచారు. అగ్ని వారిని గాయపరచలేదు లేక వారి దుస్తులను కాల్చలేదు.
షద్రకు, మేషాకు, అబేద్నగోలు తమ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా దేవుని ఆజ్ఞలకు విధేయులుగా ఉన్నారు. రాజు దేవుడిని నమ్మడానికి వారి మాదిరులు సహాయపడ్డాయి.