లేఖన కథలు
ప్రవక్తయైన ఏలీయా


“ప్రవక్తయైన ఏలీయా,” పాత నిబంధన కథలు (2022)

“ప్రవక్తయైన ఏలీయా,” పాత నిబంధన కథలు

1 రాజులు 16–18

ప్రవక్తయైన ఏలీయా

ఒక తల్లి యొక్క విశ్వాసము మరియు ప్రభువు యొక్క ఆశ్చర్యకార్యములు

అహాబు రాజు మరియు యెజెబెలు రాణితో మాట్లాడుచున్న ప్రవక్తయైన ఏలీయా

ఇశ్రాయేలు రాజ్యంలో వర్షం కురవలేదు మరియు నీళ్ళు అయిపోతున్నాయి. అహాబు రాజు, యెజెబెలు రాణి ప్రభువు యొక్క ప్రవక్తలను ఇష్టపడలేదు. వారు ప్రవక్తలలో కొందరిని హతమార్చారు కూడా. రాజు, రాణి వర్షం కోసం విగ్రహాలకు ప్రార్థన చేసారు. కాని కొన్ని సంవత్సరాలు ప్రభువు వర్షం కురిపించడని ప్రవక్తయైన ఏలీయా వారికి చెప్పాడు.

1 రాజులు 16:29–33; 17:1; 18:13

సైనికులనుండి దాగుకొనుచున్న ఏలీయా

రాజు, రాణి ఏలీయాపై కోపపడ్డారు. ఏలీయా ప్రాణము అపాయములో ఉంది గనుక, దాగుకొనమని ప్రభువు అతడిని హెచ్ఛరించాడు.

1 రాజులు17:2–3

వాగులో మోకరించిన ఏలీయా

ప్రభువు ఏలీయాను వాగు దగ్గరకు నడిపించి, అతడికి ఆహారం తేవడానికి పక్షులను పంపాడు. కానీ అక్కడ వర్షం కురవలేదు గనుక, ఆ వాగు ఎండిపోయింది మరియు ఏలీయాకు నీళ్ళు లేవు.

1 రాజులు 17:4–7

స్త్రీతో మాట్లాడుచున్న ఏలీయా

దూర పట్టణములోని స్త్రీ వద్దకు ఏలీయాను ప్రభువు నడిపించాడు. నీరు, ఆహారమివ్వమని ఏలీయా ఆమెను అడిగాడు. కానీ ఆమెకు, ఆమె కుమారునికి ఒక రోజుకు సరిపడే ఆహారమును మాత్రమే ఆమె కలిగి ఉంది.

1 రాజులు 17:8–12

ఒక స్త్రీతో మాట్లాడుచున్న ఏలీయా

అది ఆమెకున్న చివరి ఆహారమని ఏలీయాకు తెలుసు. ఆమె అతడికి ఆహారమిస్తే, వర్షం తిరిగి వచ్చేవరకు ఆమె కుటుంబానికి తగినంత ఆహారమును ప్రభువు ఇస్తాడని అతడు వాగ్దానమిచ్చాడు.

1 రాజులు 17:13–14.

భోంచేస్తున్న ఏలీయా, స్త్రీ మరియు బిడ్డ

ఏలీయా కొరకు ఆ స్త్రీ రొట్టెను తయారు చేసింది. తరువాత ఆమె నూనె, పిండి రెండింతలయ్యింది! ఏలీయాకు, ఆమె కుటుంబానికి అనేక రోజులుగా సరిపడేంత ఆహారమున్నది.

1 రాజులు 17:15–16

చనిపోయిన బిడ్డ కోసం ఏడుస్తున్న స్త్రీ

ఒక రోజు ఆ స్త్రీ యొక్క కుమారుడు అనారోగ్యంతో చనిపోయాడు. ప్రభువు ఎందుకు దీనిని ఆమెకు జరగనిచ్చాడని ఆమె ఏలీయాను అడిగింది.

1 రాజులు 17:17–20.

బిడ్డను హత్తుకొనుచున్న స్త్రీ

ఏలీయాకు యాజకత్వమున్నది. అతడు ఆమె కుమారుడ్ని దీవించి, అతడిని తిరిగి బ్రతికించమని ప్రభువును అడిగాడు. ఆ బిడ్డ మరలా ఊపిరి తీసుకున్నాడు మరియు ఏలీయా ప్రభువు యొక్క ప్రవక్త అని ఆ స్త్రీకి తెలుసు.

1 రాజులు 17:21–24.