లేఖన కథలు
గిద్యోను యొక్క సైన్యము


“గిద్యోను యొక్క సైన్యము,” పాత నిబంధన కథలు (2022)

“గిద్యోను యొక్క సైన్యము,” పాత నిబంధన కథలు

న్యాయాధిపతులు 6–7

గిద్యోను యొక్క సైన్యము

యుద్ధములో ప్రభువును విశ్వసించుట

ఆహారమును దొంగిలించుచున్న మిద్యానీయులు

ఇశ్రాయేలు ప్రజలు చాలా సంవత్సరాలు దీవించబడ్డారు. కానీ, తరువాత వారు ప్రభువుకు అవిధేయులయ్యారు. ఆయనను జ్ఞాపకం చేసుకోవడంలో వారికి సహాయపడేందుకు ప్రభువు వారి శత్రువులైన మిద్యానీయులు వారి ఆహారం మరియు జంతువులను తీసుకొనునట్లు చేసారు. ఇశ్రాయేలీయులు ఆకలితో ఉన్నారు, కాబట్టి వారు ప్రభువును జ్ఞాపకం చేసుకున్నారు మరియు సహాయం కోసం ఆయనను ప్రార్థించారు.

న్యాయాధిపతులు 6:1–7

గిద్యోనుతో మాట్లాడుతున్న దేవదూత

గిద్యోను ఒక పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇశ్రాయేలును విడిపించడానికి అతడిని పిలువమని ప్రభువు ఒక దేవదూతను పంపించారు. ప్రభువు తనను ఎందుకు ఎంచుకున్నాడో అని గిద్యోను ఆశ్చర్యపోయాడు.

న్యాయాధిపతులు 6:11–15

ధ్వంసం చేసిన విగ్రహం ప్రక్కన గిద్యోనుపై కోపంగా ఉన్న ప్రజలు

ఇశ్రాయేలీయులు అబద్ధ దేవతలను పూజించే ప్రదేశాలను నాశనం చేయమని గిద్యోనుతో ప్రభువు చెప్పారు. గిద్యోను దానిని గైకొనినప్పుడు, ప్రజలు కోపపడ్డారు.

న్యాయాధిపతులు 6:25–27

కోపంతో ఉన్న జనుల నుండి అతడిని కాపాడుతున్న గిద్యోను తండ్రి

ఇశ్రాయేలీయులు గిద్యోనును చంపాలనుకున్నారు. అయితే, అతడికి హాని కలిగించవద్దని గిద్యోను తండ్రి వారిని ఒప్పించాడు. గిద్యోను సురక్షితంగా ఉంచబడ్డాడు.

న్యాయాధిపతులు 6:28–32

ప్రార్థిస్తున్న గిద్యోను

తాను ఇశ్రాయేలును విడిపించగలడని గిద్యోను అనుకోలేదు. మిద్యానీయుల సైన్యంలో 1,35,000 మంది కంటే ఎక్కువ సైనికులు ఉన్నారు. కానీ ప్రభువు గిద్యోనుకు జ్ఞానాన్ని మరియు శక్తిని ఇచ్చారు.

న్యాయాధిపతులు 6:13–16; 8:10

సైన్యాన్ని విడిచివెళ్తున్న సైనికులు

ఇశ్రాయేలీయులు తమ బలంతో కాకుండా ఆయన బలంతో గెలవగలరని తెలుసుకోవాలని ప్రభువు కోరారు. ఇశ్రాయేలీయలు 32,000 మంది సైనికులను మాత్రమే కలిగియున్నప్పటికీ, భయపడిన సైనికులను ఇంటికి పంపమని ప్రభువు గిద్యోనుతో చెప్పారు. 22,000 మంది ఇంటికి వెళ్ళిపోయిన తరువాత, ఇశ్రాయేలీయులకు 10,000 మంది సైనికులు మిగిలారు.

న్యాయాధిపతులు 7:2–3

నీళ్ళు త్రాగుతున్న సైనికులు

10,000 మంది సైనికులు కూడా ఎక్కువేనని ప్రభువు చెప్పారు. నీళ్ళ దగ్గరకు సైన్యాన్ని తీసుకొనివెళ్ళమని ఆయన గిద్యోనుతో చెప్పారు. నీటిని నేరుగా నోటితో త్రాగిన వారు ఇంటికి పంపించబడతారు. నీటిని త్రాగడానికి తమ చేతులను ఉపయోగించిన వారు ఉండవచ్చు. ఇప్పుడు కేవలం 300 మంది మాత్రమే మిగిలారు.

న్యాయాధిపతులు 7:4–7

మిద్యానీయుల దండు చుట్టూ బూరలు మరియు దివిటీలతో ఇశ్రాయేలు సైనికులు

చివరకు, ఇశ్రాయేలీయులు పోరాటానికి సిద్ధమయ్యారు. మిద్యానీయులను ఎలా ఓడించాలో ప్రభువు గిద్యోనుకు చూపించారు. వారిని భయపెట్టడానికి బూరలు మరియు దివిటీలను ఉపయోగించమని గిద్యోను తన సైన్యానికి చెప్పాడు. శబ్దము మరియు దీపాలు మిద్యానీయులను ఎంత గందరగోళానికి గురిచేసాయంటే, వారు ఒకరితో ఒకరు పోరాడడం ప్రారంభించారు. తర్వాత వారు కేకలు వేస్తూ పారిపోయారు.

న్యాయాధిపతులు 7:16–22

సైనికులను నడిపిస్తున్న గిద్యోను

గిద్యోను ప్రభువుపై నమ్మకముంచడం వలన, ఇశ్రాయేలీయులు కేవలం 300 మంది సైనికులతో మిద్యానీయుల యొక్క పెద్ద సైన్యాన్ని ఓడించారు. ప్రభువు ఇశ్రాయేలు జనులను విడిపించారు.

న్యాయాధిపతులు 7:23–25