“నోవహు, అతని కుటుంబము,” పాత నిబంధన కథలు (2022)
“నోవహు, అతని కుటుంబము,” పాత నిబంధన కథలు
ఆదికాండము 6–9; మోషే 8
నోవహు, అతని కుటుంబము
ఒక ఓడ, వరద మరియు ప్రభువు యొక్క వాగ్దానములు
నోవహు, అతడి కుటుంబము ప్రభువుకు విధేయులయ్యారు. మిగిలిన జనులందరు చాలా దుష్టులు. జనులు పశ్చాత్తాపపడకపోతే, వరద భూమిని ముంచివేస్తుందని ప్రభువు నోవహుతో చెప్పాడు.
ఆదికాండము 6:5–13; మోషే 8:13–17
ప్రభువు వారిని ప్రేమిస్తున్నాడని, వారు పశ్చాత్తాపపడాలని, యేసు క్రీస్తునందు విశ్వాసము కలిగియుండాలని జనులకు నోవహు బోధించాడు. వారు వినలేదు.
జనులు పశ్చాత్తాపపడటం లేదని నోవహు విచారించాడు. ప్రభువు నోవహును ఓడ అని పిలువబడే పెద్ద ఓడను నిర్మించమని చెప్పాడు. నోవహు కుటుంబాన్ని వరద సమయంలో ఓడ క్షేమంగా ఉంచుతుంది.
నోవహు కుటుంబం ఓడలోనికి ఆహారము తెచ్చింది. ప్రభువు జంతువులలో ప్రతీరకములో కనీసం రెండిటిని నోవహు వద్దకు పంపాడు. జంతువులు ఓడలోనికి వెళ్ళాయి మరియు ఏడు రోజుల తరువాత వర్షం ప్రారంభమైంది.
ప్రభువు హెచ్చరించినట్లుగా 40 దినములు, 40 రాత్రులుగా వర్షం కురిసింది. వరద భూమిని కప్పివేసింది.
నోవహు కుటుంబం మరియు ఓడలోని జంతువులన్నీ నీటిపై సురక్షితంగా తేలుతున్నాయి.
వరద ముగిసినప్పుడు, పొడి నేలపైన ఓడ ఆగింది. నోవహు, అతని కుటుంబం ప్రభువును ఆరాధించడానికి ఒక బలిపీఠమును కట్టారు మరియు వారిని కాపాడినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. భూమిపై మరలా ఎన్నడూ వరద రాదని ప్రభువు వాగ్దానమిచ్చాడు. తన వాగ్దానము యొక్క జ్ఞాపకార్థముగా ఆయన ఇంద్రధనస్సును పంపాడు.