“రాజైన యోషీయా,” పాత నిబంధనలు కథలు (2022)
“రాజైన యోషీయా,” పాత నిబంధనలు కథలు
2 రాజులు 22; 2 దినవృత్తాంతములు 34–35
రాజైన యోషీయా
ప్రభువు ఆజ్ఞలను పాటించాలనే తపన
యోషీయా యూదా రాజుగా చేయబడినప్పుడు అతడికి ఎనిమిదేండ్లు. ప్రభువును ప్రేమించిన మంచి రాజు అతడు. తన జనులైన ఇశ్రాయేలీయులకు సహాయం చేయాలని, ప్రభువుకు విధేయత చూపించాలని మరియు విగ్రహాలను ఆరాధించడం మానివేయాలని అతడు అనుకున్నాడు. పెద్దవాడైన తరువాత, అతడు మరియు అతని ప్రజలు దేవాలయాన్ని మరమ్మత్తు చేసి, దానిని మళ్ళీ అందంగా మార్చడం ప్రారంభించారు.
2 రాజులు 22:1–2; 2 దినవృత్తాంతములు 34:3–7
ప్రజలు దేవాలయములో పని చేస్తున్నప్పుడు, ప్రధాన యాజకుడైన హిల్కీయా ధర్మశాస్త్ర గ్రంథాన్ని కనుగొన్నాడు, అది లేఖనాలను కలిగియున్న ఒక గ్రంథపుచుట్ట.
ఒక సేవకుడు ఆ గ్రంథాన్ని యోషీయాకు చదివి వినిపించాడు. యోషీయా ఆ మాటలు విన్నాడు మరియు అతని జనులు ప్రభువుకు విధేయత చూపనందుకు విచారించాడు. అతడు విచారంగా ఉన్నాడని చూపించడానికి తన బట్టలు చింపుకొన్నాడు.
వారేమి చేయాలో ప్రభువును అడుగమని అతడు హిల్కీయాకు చెప్పాడు. హిల్కీయా మరియు రాజు యొక్క సేవకులు హుల్దాను దర్శించారు. ఆమె ఒక ప్రవక్త్రి, దేవునిచేత ప్రేరేపించబడిన నమ్మకమైన నాయకురాలు. ప్రజలు విధేయులగుటకు అతడు సహాయపడుతున్నందుకు ప్రభువు యోషీయాతో సంతోషంగా ఉన్నారని ఆమె చెప్పింది. రాజైన యోషీయా ప్రశాంతంగా జీవిస్తాడని ప్రభువు వాగ్దానము చేసారు.
తన జనులు ప్రభువుతో చేసిన వాగ్దానములను నెరవేర్చాలని రాజైన యోషీయా కోరాడు. చాలాకాలం క్రితం ఇశ్రాయేలీయులను ఐగుప్తులో ప్రభువు ఎలా విడిపించారో గుర్తుచేసుకోవడానికి వారు పస్కాపండుగను జరుపుకోవాలని ఆయన వారిని కోరాడు.