“యోబు,” పాత నిబంధన కథలు (2021)
“యోబు,” పాత నిబంధన కథలు
యోబు 1–3; 19; 38–42
యోబు
ప్రభువు యొక్క ప్రేమను నమ్ముట
యోబు ప్రభువును ప్రేమించి, ఆయన ఆజ్ఞలను పాటించిన ఒక మంచి వ్యక్తి. అతడు, అతడి భార్య 10 మంది పిల్లల్ని కలిగియున్నారు మరియు అతడికి అనేక పశువుల మందలు, గొప్ప ఐశ్వర్యము కలదు.
యోబు విశ్వాసము పరీక్షించబడుటకు ప్రభువు అనుమతించారు. యోబు కష్టాలను అనుభవించాడు.
ఒక రోజు యోబు పశువులలో అనేకము దొంగిలించబడ్డాయి. తరువాత అగ్ని యోబు ఆస్తిని కాల్చి, అతడి సేవకులందరినీ, మిగిలిన జంతువులన్నిటినీ హతమార్చింది. తరువాత ఒక తుఫాను యోబు కొడుకు ఇంటిని కూల్చివేసింది. యోబు పిల్లలు లోపల ఉన్నారు మరియు వారందరూ మరణించారు. యోబు, అతడి భార్యకు వారి ఆరోగ్యము తప్ప ఏదీ మిగలలేదు.
యోబు, అతడి భార్య బాధపడ్డారు. వారి పిల్లలతో పాటు సమస్తము వారు కోల్పోయారు. కానీ యోబు ఇంకా ప్రభువునందు విశ్వాసము కలిగియున్నాడు. జరిగిన దానికి అతడు ప్రభువును నిందించలేదు.
తరువాత యోబు చాలా అనారోగ్యం పాలయ్యాడు. బాధాకరమైన కురుపులు అతడి శరీరమును కప్పివేసాయి. ఈ చెడు విషయాలు ఎందుకు జరుగుతున్నాయని యోబు, అతడి భార్య ఆశ్చర్యపోయారు.
ప్రభువు యోబుతో మాట్లాడి, అతడికి భూమిని, నక్షత్రాలను, జీవముగల వాటన్నిటినీ చూపించారు. ప్రభువు యోబుకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పారు. ఆయన కుమారుడైన యేసు క్రీస్తు గురించి నేర్చుకొని, ఆయనను అనుసరించుటలో పరలోక తండ్రి యొక్క పిల్లలకు సహాయపడడానికి అన్ని విషయాలు సృష్టించబడ్డాయి.
యోబు పశ్చాత్తాపపడ్డాడు, అనుమానించినందుకు తనను క్షమించమని ప్రభువును అడిగాడు. ప్రభువును నమ్ముతానని వాగ్దానం చేసాడు. యోబు ఆయనను ప్రేమిస్తున్నాడని ప్రభువుకు తెలుసు. ఆయన యోబును స్వస్థపరిచాడు మరియు ఎక్కువమంది పిల్లలతో అతడిని దీవించాడు, అతడు ఇంతకుముందు కలిగియున్న దానికంటే రెండింతల ఐశ్వర్యాన్ని ఇచ్చాడు.