Scripture Stories
ఎలీషా మరియు ప్రభువు యొక్క సైన్యము


“ఎలీషా మరియు ప్రభువు యొక్క సైన్యము,” పాత నిబంధన కథలు (2022)

“ఎలీషా మరియు ప్రభువు యొక్క సైన్యము,” పాత నిబంధన కథలు

2 రాజులు 6

ఎలీషా మరియు ప్రభువు యొక్క సైన్యము

ప్రభువు యొక్క అగ్ని రథములు

చిత్రం
పట్టణమును చుట్టుముడుతున్న సైనికులు

సిరియనులు ఇశ్రాయేలీయులను ఇష్టపడలేదు. ప్రవక్తయైన ఎలీషాను బంధించడానికి సిరియా రాజు తన సైన్యమును పంపాడు. ఎలీషా ఉన్న పట్టణమును రాత్రివేళ ఆ సైన్యము చుట్టుముట్టింది.

2 రాజులు 6:8–14

చిత్రం
సిరియా సైన్యమును చూస్తున్న ఎలీషా మరియు పనివాడు

ఎలీషా యొక్క పనివాడు నిద్రలేచి సిరియా సైన్యమును చూసాడు. వారేమి చేయాలని అతడు ఎలీషాను అడిగాడు. భయపడవద్దని ఎలీషా ఆ యువకునితో చెప్పాడు. వారి కోసం పోరాడుతున్న సైన్యము, వారికి వ్యతిరేకముగా పోరాడుతున్న సైన్యము కంటే మిక్కిలి పెద్దదని అతడు చెప్పాడు.

2 రాజులు 6:15–16

చిత్రం
అగ్ని రథములతో పరలోక సైన్యము

ఎలీషా చూసిన దానిని ఆ యువకునికి చూపమని ఎలీషా ప్రభువును అడిగాడు. వారిని రక్షించడానికి గుఱ్ఱములు మరియు అగ్నిరథములతో వచ్చిన పరలోక సైన్యాన్ని ప్రభువు అతడికి చూపించారు. దేవుని శక్తిచేత సిరియా సైన్యానికి అంధత్వము కలుగజేయబడింది. వారిక ఇశ్రాయేలీయులతో పోరాడలేదు.

2 రాజులు 6:17–23

ముద్రించు