లేఖన కథలు
ఏలీయా మరియు బయలు యాజకులు


“ఏలీయా మరియు బయలు యాజకులు,” పాత నిబంధన కథలు (2022)

“ఏలీయా మరియు బయలు యాజకులు,” పాత నిబంధన కథలు (2022)

1 రాజులు 18

ఏలీయా మరియు బయలు యాజకులు

ప్రభువు యొక్క ప్రవక్తకు విరుద్ధంగా అబద్ధపు యాజకులు

బయలు యొక్క చిన్న ప్రతిమ

ఇశ్రాయేలీయ రాజ్యము నీళ్ళు లేకపోవడంతో బాధపడుతూనే ఉంది. రాజైన అహాబు బయలు అనే పేరుగల అబద్ధపు దేవతను అనుసరించమని జనులతో చెప్పెను.

1 రాజులు 18:1–2, 17–18

అహాబుతో మాట్లాడుచున్న ఏలీయా

అహాబును కలుసుకోమని ప్రభువు ప్రవక్తయైన ఏలీయాను పంపాడు. ఏలీయా ఒక పర్వత శిఖరంపైకి జనులందరిని పిలిచాడు. ప్రభువు లేక బయలు వీరిలో ఎవరు నిజమైన దేవుడో చూడడానికి అతడు రాజును, అతడి యాజకులను ఆహ్వానించాడు.

1 రాజులు 18:19-21

బయలు యాజకులతో మాట్లాడుచున్న ఏలీయా

ఏలీయా సవాలును వివరించాడు. అతడు మరియు యాజకులు బలపీఠముపై ఒక ఎద్దును బలి ఇస్తారు, కానీ వారికివారే అగ్నిని వెలిగించరు. బదులుగా, యాజకులు అగ్ని కొరకు బయలుకు ప్రార్థన చేస్తారు. తరువాత ఏలీయా అగ్ని కొరకు ప్రభువుకు ప్రార్థన చేస్తాడు. నిజమైన దేవుడు మాత్రమే అగ్ని వెలిగించగలడని ఏలీయాకు తెలుసు.

1 రాజులు 18:22–25

జనుల గుంపుతో మాట్లాడుచున్న ఏలీయా

బయలు యాజకులు ఉదయం నుండి మధ్యాహ్నాం వరకు వారి దేవతకు ప్రార్థన చేసారు, కానీ ఏమీ జరగలేదు. వారి బయలు దేవత నిద్రపోతుందని ఏలీయా వారిని అపహాస్యము చేసాడు.

1 రాజులు 18:26–27.

బలపీఠముపై ప్రార్థన చేస్తున్న బయలు యాజకులు

యాజకులకు కోపం వచ్చింది, బలపీఠంపై గెంతారు, సాయంకాలము వరకు కేకలు వేసారు. వారి దేవత జవాబిస్తుందని వారు ఆశించారు, కానీ ఇంకా అగ్ని వెలిగింపబడలేదు.

1 రాజులు 18:28–29.

ఏలీయా మోకరించుట

తరువాత అది ఏలీయా వంతు. అతడు ప్రభువుకు ఒక బలిపీఠము కట్టాడు, బలిపీఠము చుట్టూ గొయ్యి తవ్వాడు, మరియు బలిని సిద్ధపరిచాడు.

1 రాజులు 18:30–32.

బలిపీఠమును కడుతున్న ఏలీయా మరియు జనులు

ఏలీయా జనులను నాలుగు తొట్టెల నిండా నీళ్ళు నింపి, అతడి బలిపీఠపు కట్టెలపై మూడుసార్లు కుమ్మరించమని అడిగాడు. కట్టెలు, బలిపీఠము నీళ్ళతో నానిపోయాయి. అది మొత్తం గొయ్యిని నింపింది.

1 రాజులు 18:33–37.

బలిపీఠము ప్రక్కన ప్రార్థన చేస్తున్న ఏలీయా

నిజమైన దేవుని యొక్క శక్తిని చూపమని ఏలీయా ప్రభువుకు ప్రార్థన చేసాడు. ప్రభువు యొక్క అగ్ని క్రిందకు దిగి బలిని, కట్టెలను, రాళ్ళను మరియు నీటిని కాల్చివేసింది. ఏలీయా యొక్క దేవుడు నిజమైన దేవుడని జనులకు తెలుసు. కరువు అంతము చేయమని ఏలీయా ప్రార్థన చేసాడు మరియు ప్రభువు నీళ్ళను పంపాడు.

1 రాజులు 18:38–41