లేఖన కథలు
ఆదాము హవ్వల కుటుంబము


“ఆదాము హవ్వల కుటుంబము,” పాత నిబంధన కథలు (2022)

“ఆదాము హవ్వల కుటుంబము,” పాత నిబంధన కథలు

ఆదికాండము 4; మోషే 5–6

ఆదాము హవ్వల కుటుంబము

ప్రభువును అనుసరించుటకు ఎంచుకొనుట

ఆదాము హవ్వల కుటుంబము

ఆదాము, హవ్వలు ఏదోను తోటను విడిచిపెట్టిన తరువాత, భూమిపైన వారి కోసం పరలోక తండ్రి చేసిన ప్రణాళిక గురించి నేర్చుకోవడం కొనసాగించారు. వారికి చాలామంది పిల్లలు ఉన్నారు మరియు ప్రభువు గురించి తమకు తెలిసిన అన్ని విషయాలను వారికి నేర్పించారు. ఆదాము, హవ్వల పిల్లలలో కొందరు ప్రభువుకు విధేయత చూపారు. కానీ వారిలో కొందరు విధేయత చూపకూడదని ఎంచుకున్నారు.

మోషే 5:1–12; 6:15

పిల్లలతో ఆదాము హవ్వలు, లేఖనములు వ్రాయుచున్న ఆదాము

ఆదాము, హవ్వలు ఒక జ్ఞాపకార్థ గ్రంథాన్ని వ్రాసారు. దానిలో వారి కుటుంబ చరిత్రను వ్రాసారు. ప్రభువు వారికి ఏవిధంగా సహాయపడ్డారో వ్రాసారు.

మోషే 6:5–6

కయీను మరియు హేబేలు

కయీను, హేబేలు అనువారు ఆదాము హవ్వల కుమారులలో ఇద్దరు. హేబేలు ప్రభువును ప్రేమించి, ఆయనను అనుసరించడానికి ఎంచుకున్నాడు. కయీను ప్రభువుకు విధేయత చూపలేదు. తిరుగుబాటు చేయడానికి అతడు ఎంచుకున్నాడు.

ఆదికాండము 4:1–16

నగరాన్ని చూస్తున్న మనిషి

ఆదాము హవ్వల కుటుంబము అభివృద్ధి చెందసాగింది. ఇంకా అనేకమంది జన్మించారు. ఎంపికలు చేయడానికి వారందరు స్వేచ్ఛ కలిగియున్నారు. కాలక్రమేణా, కొంతమంది ప్రభువు ఆజ్ఞలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. పశ్చాత్తాపపడమని జనులకు బోధించడానికి ప్రభువు ప్రవక్తలను పంపారు.

ఆదికాండము 4:25–26; మోషే 5:13; 6:23