“పసివాడైన మోషే,” పాత నిబంధన కథలు (2022)
“పసివాడైన మోషే,” పాత నిబంధన కథలు
నిర్గమకాండము 1–2
పసివాడైన మోషే
ఇశ్రాయేలీయుల యొక్క భవిష్యత్తు నాయకుడిని కాపాడుట
యాకోబు కుటుంబము ఐగుప్తులో గొప్ప జనముగా మారారు. వారు ఇశ్రాయేలీయులని పిలవబడ్డారు. ఐగుప్తు రాజైన ఫరో ఏదో ఒక రోజు ఇశ్రాయేలీయులు చాలా ఎక్కువమంది అవుతారని, ఐగుప్తును స్వాధీనం చేసుకుంటారని భయపడ్డాడు, అందుచేత అతడు ఇశ్రాయేలీయులను తన బానిసలుగా చేసాడు.
తరువాత ఫరో క్రొత్తగా జన్మించిన మగ శిశువులందరిని చంపమని ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలీయుల కుటుంబాలు చాలా భయపడ్డాయి.
యోకెబెదు అను పేరుగల ఇశ్రాయేలీయ తల్లి తనకు అప్పుడే పుట్టిన కుమారుడిని రక్షించడానికి ఒక విధానము ఆలోచించింది. ఆమె తన బిడ్డను పెట్టెలో ఉంచి నైలు నది దగ్గర ఎత్తైన గడ్డిలో ఉంచింది. ఆ పసిబిడ్డ అక్క మిర్యాము అతడు క్షేమంగా ఉంచడానికి అతడికి కావలికాసింది.
నదిలో స్నానం చేయుచుండగా, ఫరో కుమార్తె పెట్టెను కనుగొంది. నిస్సహాయుడైన ఇశ్రాయేలీయ బిడ్డ ఏడ్వడటం ఆమె చూసింది మరియు తన స్వంత బిడ్డగా అతడిని పెంచాలనుకొంది. ఫరో కుమార్తె వద్దకు మిర్యాము వచ్చి, బిడ్డను చూడటానికి ఒక ఇశ్రాయేలీయ స్త్రీని తాను తీసుకొనిరానా అని అడిగింది.
మిర్యాము తన తల్లి యోకెబెదును ఫరో కుమార్తె వద్దకు తెచ్చింది. బిడ్డను సంరక్షించుటకు యోకెబెదుకు జీతమివ్వడానికి ఫరో కుమార్తె అంగీకరించింది.
ఇశ్రాయేలీయుడైన ఆ పసిబిడ్డ పెరిగి పెద్దవాడయ్యాడు. ఫరో కుమార్తె అతడిని తన స్వంత బిడ్డగా పెంచింది. ఆమె అతడికి మోషే అని పేరు పెట్టింది.