“హన్నా,” పాత నిబంధన కథలు (2022)
“హన్నా,” పాత నిబంధన కథలు
హన్నా
విశ్వాసురాలైన ఒక స్త్రీకి ప్రభువు యొక్క జవాబు
ప్రతి సంవత్సరం, హన్నా మరియు ఆమె భర్త ప్రభువు మందిరమైన దేవాలయానికి వెళ్ళేవారు. హన్నాకు పిల్లలు లేరు, కాబట్టి ఆమె చాలా విచారించింది. మగ బిడ్డ కోసం ఆమె ఉపవాస ప్రార్థన చేసింది. తనకు కుమారుడు పుట్టినట్లైతే, తన కుమారుడు ఆయనకు సేవ చేయడానికి పెరుగుతాడని హన్నా ప్రభువుకు వాగ్దానం చేసింది.
హన్నా దుఃఖించడాన్ని ఏలీ అనే యాజకుడు చూసాడు. ప్రభువు ఆమె ప్రార్థనలకు సమాధానమిస్తారని అతడు ఆమెతో చెప్పాడు. హన్నా ప్రభువును నమ్మి, నిరీక్షణ కలిగియుంది.
ఆ సంవత్సరము హన్నాకు ఒక మగ బిడ్డ పుట్టాడు. అతడికి ఆమె సమూయేలు అని పేరు పెట్టింది.
ప్రభువుకు చేసిన వాగ్దానాన్ని హన్నా నెరవేర్చింది. సమూయేలుకు తగినంత వయస్సు వచ్చినప్పుడు, ఆమె అతడిని ప్రభువు మందిరములో సేవ చేయడానికి తీసుకువెళ్ళింది. అతడు యాజకుడైన ఏలీతో కలిసి సేవ చేసాడు. హన్నా సమూయేలును కలుసుకోవడం కొనసాగించింది. అతడి కోసం తయారుచేసిన వస్త్రాలను ఆమె తీసుకొనివచ్చింది. ప్రభువు హన్నాను ఇంకా ఐదుగురు పిల్లలతో దీవించారు.