“ఐగుప్తులో తెగుళ్ళు,” పాత నిబంధన కథలు (2022)
“ఐగుప్తులో తెగుళ్ళు,” పాత నిబంధన కథలు
నిర్గమకాండము 4–5; 7–12
ఐగుప్తులో తెగుళ్ళు
ప్రభువుకు వ్యతిరేకంగా ఫరో ఎంపికలు
మోషే ప్రభువును నమ్మి, ఐగుప్తుకు తిరిగి వెళ్ళాడు. మోషే, అతడి సహోదరుడు అహరోను ఫరోవద్దకు వెళ్ళి, ఇశ్రాయేలీయులను స్వేచ్ఛగా వదిలి, ఐగుప్తు నుండి వెళ్ళనివ్వమని అతడిని అడిగారు. ఫరో కోపపడి, వారిని వెళ్ళనివ్వనని చెప్పాడు. అతడు ఇశ్రాయేలీయులను ఇంకా కఠినంగా పని చేయమని బలవంతం చేసాడు.
ఫరో ప్రభువు చెప్పినది వినలేదు, గనుక ఐగుప్తీయులు భయంకరమైన తెగుళ్ళతో శపించబడ్డారు. మొదట, ఐగుప్తులోని నీళ్ళన్నీ రక్తముగా మారాయి. ఇశ్రాయేలీయులను వెళ్ళనివ్వమని మరలా ఫరోని మోషే అడిగాడు, కానీ ఫరో కుదరదని చెప్పాడు.
తరువాత, ప్రభువు ఐగుప్తు మీదకు కప్పలను పంపాడు. అవి ప్రతీచోటా ఉండెను. కప్పలు వెళ్ళిపోతే తాను ఇశ్రాయేలీయులను వెళ్ళనిస్తానని ఫరో చెప్పాడు. ప్రభువు కప్పలను వెళ్ళిపోయేలా చేసాడు, కానీ ఫరో ఇశ్రాయేలీయులను వెళ్ళనివ్వలేదు. తరువాత ప్రభువు పేలు, ఈగలను పంపాడు.
తరువాత, ఐగుప్తీయుల వ్యవసాయ పశువులు చనిపోయాయి, కానీ ఇశ్రాయేలీయుల పశువులలో ఏవీ చనిపోలేదు. తరువాత ఐగుప్తీయులకు వారి శరీరములపై బాధాకరమైన పొక్కులు కలిగాయి.
ఐగుప్తులో వడగండ్లు, పిడుగులతో గొప్ప తుఫాను వచ్చింది. ఇది భయంకరమైన నాశనము కలిగించింది.
ఇంకను ఫరో ఇశ్రాయేలీయులను వెళ్ళనివ్వలేదు. తరువాత ప్రభువు మిడతలను పంపాడు, అవి జనులందరి ఆహారాన్ని తినివేసాయి.
తరువాత మూడురోజులు చీకటి కలిగింది. అనేక తెగుళ్ళు కలిగినప్పుడు, తెగుళ్ళు ఆగిపోతే ఇశ్రాయేలీయులను వెళ్ళనిస్తానని ఫరో వాగ్దానమిచ్చాడు, కానీ అతడు ప్రతీసారి అబద్ధమాడాడు.
తొమ్మిది వేర్వేరు తెగుళ్ళు కలిగిన తరువాత, ఫరో ఇంకా ఇశ్రాయేలీయులను వెళ్ళనివ్వలేదు. మరొక భయంకరమైన తెగులు వస్తుందని ప్రభువు మోషేతో చెప్పాడు. వారు తమ స్వాతంత్య్రం కోసం ఎదురు చూసినప్పుడు ఇశ్రాయేలీయులను ప్రభువు నడిపించి, కాపాడాడు.