Scripture Stories
ఐగుప్తులో యోసేపు


“ఐగుప్తులో యోసేపు,” పాత నిబంధన కథలు (2022)

“ఐగుప్తులో యోసేపు,” పాత నిబంధన కథలు

ఆదికాండము 39–41

ఐగుప్తులో యోసేపు

బానిస ఒక నాయకుడు అవుతాడు

చిత్రం
పోతీఫరుకు అమ్మబడిన యోసేపు

పోతీఫరు అనబడే వానికి యోసేపు బానిసగా అమ్మబడ్డాడు. ఐగుప్తు పరిపాలకుడైన ఫరో వద్ద పోతీఫరు పనిచేసాడు. యోసేపుకు ప్రభువు సహాయం చేసాడని పోతీఫరు చెప్పగలడు. అతడు యోసేపును నమ్మి, అతని ఇంటిపై మరియు అతనికి ఉన్న ప్రతిదానిపై అధికారిగా నియమించాడు.

ఆదికాండము 39:1–6

చిత్రం
వద్దు అని పోతీఫరు భార్యకు చెప్తున్న యోసేపు

పోతీఫరు భార్య యోసేపును ఇష్టపడింది. యోసేపు తనతో ప్రభువు యొక్క ఆజ్ఞలు అతిక్రమించాలని ఆమె కోరింది. వద్దు అని యోసేపు ఆమెతో చెప్పాడు.

ఆదికాండము 39:7–10

చిత్రం
పోతీఫరు భార్య దగ్గరనుండి పారిపోతున్న యోసేపు

పోతీఫరు భార్య వినలేదు, కాబట్టి యోసేపు అక్కడనుండి పారిపోయాడు. యోసేపుపైన ఆమె కోపపడింది.

ఆదికాండము 39:11–12

చిత్రం
పోతీఫరుతో మాట్లాడుతున్న పోతీఫరు భార్య

యోసేపు దుస్తులలో ఒక భాగాన్ని ఆమె పోతీఫరుకు చూపించింది. యోసేపు గురించి ఆమె పోతీఫరుతో అబద్ధం చెప్పింది. యోసేపును పోతీఫరు చెరసాలలో పెట్టాడు.

ఆదికాండము 39:13–20

చిత్రం
చెరసాలలో యోసేపు

యోసేపు తన కుటుంబము నుండి వేరుచేయబడ్డాడు. అతడు బానిస అయ్యాడు మరియు ఇప్పుడతడు ఖైదీగా ఉన్నాడు. అయినప్పటికీ ప్రభువు యోసేపుకు సహాయము చేసారు. యోసేపు తన ప్రయత్నాన్ని విడిచిపెట్టలేదు. యోసేపులోని మంచిని చూసేలా ప్రభువు చెరసాల యొక్క అధిపతిని ఆశీర్వదించారు. ఆ అధిపతి అతడిని నమ్మడం ప్రారంభించాడు, కాబట్టి అతడు ఇతర ఖైదీలందరిని యోసేపు చేతికప్పగించాడు.

ఆదికాండము 39:21

చిత్రం
చెరసాలలో ఖైదీల కలలకు భావము చెప్తున్న యోసేపు

ఫరో కొరకు పనిచేసిన ఇద్దరు ఖైదీలైన పానదాయకుడిని, భక్ష్యకారుడిని యోసేపు కలుసుకున్నాడు. వారిద్దరు విచిత్రమైన కలలు కన్నారు. ప్రభువు శక్తి ద్వారా యోసేపు వారి కలలకు అర్థం ఏమిటో వివరించాడు. పానదాయకుని కల భావమేమిటంటే అతడు విడుదల చేయబడతాడు. మూడు రోజుల తరువాత మరలా ఫరో కోసం పనిచేయడానికి అతడు విడుదల చేయబడ్డాడు.

ఆదికాండము 39:22–23; 40:1–21

చిత్రం
కలత చెందుతున్న ఫరో

ఒకరోజు ఫరో తన కలల వల్ల కలత చెందాడు. అతడి కలలకు అర్థం ఏమిటో ఎవరూ చెప్పలేకపోయారు.

ఆదికాండము 41:1–8

చిత్రం
ఫరోతో మాట్లాడుతున్న పానదాయకుడు

కలలకు భావము యోసేపు చెప్పగలడని ఆ పానదాయకుడు జ్ఞాపకం చేసుకున్నాడు.

ఆదికాండము 41:9–13

చిత్రం
ఫరో కలల భావాన్ని చెప్తున్న యోసేపు

ఫరో కలలను వివరించడానికి యోసేపు చెరసాల నుండి బయటకు తేబడ్డాడు. ఈ కలల భావం ఏమిటంటే, ఐగుప్తులో ఏడు సంవత్సరాల పాటు పంట సమృద్ధిగా ఉంటుందని, తరువాత ఏడు సంవత్సరాలు కరువు వలన అతి తక్కువ పంట పండుతుందని యోసేపు చెప్పాడు. ఐగుప్తు యొక్క ఉత్తమమైన సంవత్సరాల్లో అదనపు ఆహారాన్ని నిల్వ చేయాలని యోసేపు ఫరోతో చెప్పాడు.

ఆదికాండము 41:14–36

చిత్రం
ఆహార నిల్వను ఫరోకు చూపిస్తున్న యోసేపు

తన కలల గురించి యోసేపు చెప్పినది నిజమని ఫరోకు తెలుసు. అతడు యోసేపును చెరసాల నుండి విడిపించాడు మరియు యోసేపును ఐగుప్తులో గొప్ప నాయకుడిగా చేసాడు. ఏడు సంవత్సరాలు, యోసేపు అదనపు ఆహారాన్ని నిల్వ చేయడానికి ఐగుప్తు‌కు సహాయం చేసాడు.

ఆదికాండము 41:37–53

చిత్రం
ఐగుప్తులో ప్రయాణిస్తున్న జనులు

అప్పుడు కరువు వచ్చింది. ఈ సమయంలో, ఎవరూ ఎలాంటి ఆహారాన్ని పండించలేకపోయారు. యోసేపు నిల్వ చేసిన ఆహారాన్ని కొనడానికి ప్రజలు ఐగుప్తుకు వెళ్ళారు. యోసేపు కారణంగా, వారు మరియు ఇతరులు కరువునుండి బయటపడడానికి ఐగుప్తీయులు తగినంత ఆహారం నిల్వచేసారు.

ఆదికాండము 41:54–57

ముద్రించు