లేఖన కథలు
యువకుడైన దావీదు


“యువకుడైన దావీదు,” పాత నిబంధనలు కధలు (2022)

“యువకుడైన దావీదు,” పాత నిబంధనలు కధలు

1 సమూయేలు 16

యువకుడైన దావీదు

బాలుడైన గొర్రెలకాపరి రాజు కావడానికి పిలువబడ్డాడు

ప్రయాణిస్తున్న సమూయేలు

ఒక క్రొత్త రాజును వెదకమని ప్రభువు ప్రవక్తయైన సమూయేలును పంపారు. అప్పటి రాజైన సౌలు ప్రభువును అనుసరించడం మానివేసాడు. బేత్లెహేముకు వెళ్ళి, యెష్షయి అనే పేరు గల వ్యక్తిని కలుసుకోమని ప్రభువు సమూయేలుతో చెప్పారు. యెష్షయి కుమారులలో ఒకరు క్రొత్త రాజు అవుతారు.

1 సమూయేలు 16:1–5

సమూయేలు మరియు యెష్షయి కుమారులు

యెష్షయి పెద్ద కొడుకులు పొడవుగా, బలంగా ఉండేవారు. కానీ వారి రూపమును బట్టి వారిని లక్ష్యపెట్టవద్దని ప్రభువు సమూయేలుతో చెప్పారు.

1 సమూయేలు 16:6–10

యెష్షయితో మాట్లాడుతున్న సమూయేలు

నీకు ఇంకెవరైనా కొడుకులు ఉన్నారా అని సమూయేలు యెష్షయిని అడిగాడు. నా చిన్న కొడుకు దావీదు గొర్రెలను మేపుతున్నాడని యెష్షయి చెప్పాడు. దావీదు సమూయేలు వద్దకు తీసుకురాబడ్డాడు.

1 సమూయేలు 16:11

బాలుడైన గొర్రెలకాపరి దావీదువైపు చూస్తున్న సమూయేలు మరియు యెష్షయి

దావీదు తన అన్నలకంటే చిన్నవాడు మరియు గొర్రెలకాపరి. కానీ దావీదు రూపాన్ని ప్రభువు లక్ష్యపెట్టలేదు. దావీదు హృదయం విశ్వాసంతో నిండియున్నదని ప్రభువుకు తెలుసు. దావీదు రాజు అవుతాడని ఆయన సమూయేలుతో చెప్పారు. సమూయేలు దావీదును దీవించాడు. రాజుగా కావడానికి ప్రభువు యొక్క ఆత్మ దావీదును సిద్ధం చేసింది.

1 సమూయేలు 16:12–13