లేఖన కథలు
ప్రవక్తయైన యెషయా


“ప్రవక్తయైన యెషయా,” పాత నిబంధన కథలు (2022)

“ప్రవక్తయైన యెషయా,” పాత నిబంధన కథలు

యెషయా 6–79; 53–54

ప్రవక్తయైన యెషయా

ప్రభువైన యేసు క్రీస్తు గురించి ప్రవచనములు

ప్రభువు చేత పిలువబడిన యెషయా

ఇశ్రాయేలీయులు అనేకమార్లు జయించబడ్డారు మరియు ప్రభువు వారిని సంరక్షించాలని కోరారు. యేసు క్రీస్తు యొక్క రాకడ గురించి జనులకు బోధించడానికి ఒక రోజు దేవాలయములో ప్రభువు యెషయా అనే పేరుగల వానిని పిలిచారు. యెషయా ఆ జనులను ప్రేమించాడు మరియు వారిని క్రీస్తు ఏవిధంగా రక్షించగలడో వారికి బోధించాడు.

యెషయా 6:1–8

క్రీస్తు జననము గురించి ప్రవచిస్తున్న యెషయా

తన జనులను పాపము నుండి రక్షించడానికి యేసు క్రీస్తు ఒకరోజు వస్తారని యెషయా నేర్చుకున్నాడు. కానీ అందరూ ఆయనను తమ రక్షకునిగా గుర్తించరు. అనేకమంది జనులు యేసు క్రీస్తును నమ్మరని తెలుసు గనుక యెషయా చాలా విచారించాడు.

యెషయా 6:9–13; 7:14; 53:1–9

క్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి వ్రాస్తున్న యెషయా

కానీ యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి కూడా యెషయా ప్రవచించాడు. యేసు క్రీస్తు తిరిగి వచ్చి, భూమి అంతటికి రాజు అవుతాడు. ఆయన మరలా వచ్చి, దయ మరియు శాంతిని శాశ్వతంగా తీసుకురావడం ద్వారా తన తండ్రి ప్రణాళికను నెరవేరుస్తాడు. యేసు క్రీస్తు వారి రక్షకుడు అని ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారని యెషయా చెప్పాడు.

యెషయా 9:6–7; 54:1–10