“అబ్రాహాము మరియు శారా,” పాత నిబంధన కథలు (2021)
“అబ్రాహాము మరియు శారా,” పాత నిబంధన కథలు
ఆదికాండము 11–15; 17; అబ్రాహాము 1–2
అబ్రాహాము మరియు శారా
మానవ కుటుంబాన్ని దీవిస్తానను వాగ్దానము
అబ్రాహాము ఊరను పట్టణంలో నివసించాడు. అక్కడున్న దుష్ట యాజకులు వారి విగ్రహాలకు అతడిని బలివ్వాలని కోరారు. అబ్రాహాము ప్రార్థించగా, ప్రభువు అతడిని రక్షించారు.
తరువాత ఊరును వదిలి దూర దేశానికి వెళ్ళమని ప్రభువు అబ్రాహాము, అతడి భార్యయైన శారాను ఆజ్ఞాపించారు. వారి ప్రయాణంలో వారిని దీవిస్తానని ఆయన వాగ్దానమిచ్చారు.
ఆదికాండము 12:1–3; అబ్రాహాము 2:2–4
అబ్రాహాము శారాలు ప్రభువును నమ్మి, ఊరును విడిచి వెళ్ళారు. కానీ వారు పిల్లలు కనలేనందుకు విచారించారు. ప్రభువు వారిని ఓదార్చారు. వారికి ఒక బిడ్డ పుడతాడని ఆయన వాగ్దానమిచ్చారు.
ఆదికాండము 11:30–31; 15:1–6; 17:2–16; అబ్రాహాము 2:6–9
ప్రభువు గురించి మరింత తెలుసుకోవాలని అబ్రాహాము ఆయనను ప్రార్థించాడు. ప్రభువు అబ్రాహామును దర్శించి, తాను యెహోవానని చెప్పారు. యెహోవా అబ్రాహాముతో ఒక నిబంధన చేసారు. అబ్రాహాము యాజకత్వమును కలిగియుంటాడని ఆయన వాగ్దానమిచ్చారు. అబ్రాహాము కుటుంబము ద్వారా భూమి యొక్క కుటుంబాలన్నీ ఆశీర్వదించబడతాయని కూడా ఆయన వాగ్దానమిచ్చారు.
అబ్రాహాము శారాలు ప్రయాణిస్తున్నప్పుడు, ఆహారాన్ని వెదకడం వారికి అవసరమయ్యింది. వారు కనాను అని పిలువబడిన దేశంలో నివసించడానికి ప్రయత్నించారు. అక్కడ ఏ ఆహారము లేదు, కనుక వారు ఐగుప్తుకు వెళ్ళవలసి వచ్చింది. కానీ ఐగుప్తులో నివసించడం వారికి ప్రమాదకరమైనది.
ఆదికాండము 12:10–20; అబ్రాహాము 2:21–25
అబ్రాహాము, శారాలు ఐగుప్తును విడిచి కనానులో నివసించడానికి తిరిగి వెళ్ళారు. ఐగుప్తు నుండి వారు ఆహారాన్ని, జంతువులను వారితో తీసుకొనివచ్చారు. కనాను ప్రభువు వారికి వాగ్దానము చేసిన దేశములో భాగము.
ఆదికాండము 13:1–4, 12; అబ్రాహాము 2:19
అబ్రాహాము యాజకత్వమును పొందుతాడనే తన వాగ్దానమును కూడా ప్రభువు నిలుపుకున్నారు. ఒకరోజు అబ్రాహాము, శారాలు మెల్కీసెదెకు అనే నీతిగల రాజును కలిసారు. అబ్రాహాము అతనికి దశమభాగము చెల్లించాడు.
ఆదికాండము 14:18–24; ఆల్మా 13:15
అబ్రాహాము మెల్కీసెదెకు నుండి యాజకత్వము పొందాడు. అదే యాజకత్వాన్ని ప్రవక్తలైన ఆదాము, నోవహులు పొందారు.
జోసెఫ్ స్మిత్ అనువాదము, ఆదికాండము 14:36–40; అబ్రాహాము 1:2–4; సిద్ధాంతము మరియు నిబంధనలు 84:14
అబ్రాహాము శారాలు కనానులో సంతోషంగా ఉన్నారు, కానీ వారికి ఇంకా పిల్లలు లేనందుకు విచారించారు. ఒకనాడు వారి కుటుంబము వృద్ధి చెందుతుందని, భూమినంతటినీ దీవిస్తుందనే ప్రభువు వాగ్దానాన్ని వారు తప్పక నమ్మాలి.