లేఖన కథలు
హాగరు


“హాగరు,” పాత నిబంధన కథలు (2022)

“హాగరు,” పాత నిబంధన కథలు

ఆదికాండము 16

హాగరు

తన కుమార్తె కొరకు ప్రభువు యొక్క ప్రణాళిక

గర్భవతియైన హాగరు

హాగరు శారా యొక్క దాసి. శారా వృద్ధురాలు మరియు ఆమెకు పిల్లలు లేరు. ఆమె తన భర్తయైన అబ్రాహాముతో హాగరును వివాహమాడమని, తద్వారా వారికి పిల్లలు పుడతారని చెప్పింది. అబ్రాహాము, హాగరులు వివాహము చేసుకొన్నారు మరియు త్వరలోనే హాగరుకు ఒక బిడ్డ పుట్టబోతోంది.

ఆదికాండము 16:1–3

వెళ్ళిపోతున్న హాగరు

హాగరు మరియు శారా ఒకరిపట్ల ఒకరు నిర్దయగా వ్యవహరించడం మొదలుపెట్టారు. హాగరు ఎడారిలోనికి పారిపోవడానికి ఎంచుకుంది.

ఆదికాండము 16:4–6

నీటిబుగ్గ వద్ద విశ్రమించిన హాగరు

ప్రయాణించడం వలన హాగరు చాలా అలసిపోయి, దప్పికగొన్నది. చివరకు ఆమె నీరున్న చోటుకు వచ్చి, అక్కడ విశ్రమించింది.

ఆదికాండము 16:7

హాగరుతో మాట్లాడుతున్న దేవదూత

హాగరు కష్టాల గురించి ప్రభువుకు తెలుసు మరియు ఆమెకు సహాయము చేయడానికి ఆయన ఒక ప్రణాళికను కలిగియున్నారు. అబ్రాహాము, శారాల యొద్దకు ఆమె తిరిగి వెళ్ళాలని చెప్పడానికి ఆయన ఒక దూతను పంపారు. హాగరు కుటుంబము అభివృద్ధి చెందుతుందని ఆయన వాగ్దానము చేసారు. ఆమె కనబోయేది మగబిడ్డ అని, అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టాలని ఆయన చెప్పారు.

ఆదికాండము 16:7–14

అబ్రాహాము శారాలతో హాగరు మరియు ఇష్మాయేలు

హాగరు ప్రభువునందు నమ్మకముంచి, ఆ దేవదూతకు విధేయురాలయ్యింది. ఆమె అబ్రాహాము, శారాల యొద్దకు తిరిగి వెళ్ళింది. హాగరు మగబిడ్డను కనింది, అతని పేరు ఇష్మాయేలు. ప్రభువు ఆమెను కనిపెట్టుచున్నారని హాగరుకు తెలుసు.

ఆదికాండము 16:11, 15