లేఖన కథలు
ప్రవక్తయైన యిర్మీయా


“ప్రవక్తయైన యిర్మీయా,” పాత నిబంధన కథలు (2022)

“ప్రవక్తయైన యిర్మీయా,” పాత నిబంధన కథలు

యిర్మీయా 1–52

ప్రవక్తయైన యిర్మీయా

అతడు పుట్టకముందే పిలువబడ్డాడు

యిర్మీయా ఒక ప్రవక్తగా పిలువబడ్డాడు

యిర్మీయా చిన్నప్పుడు యెరూషలేములో నివసించాడు. ఒకరోజు ప్రభువు యిర్మీయా వద్దకు వచ్చి, అతడిని ప్రవక్తగా పిలిచారు. అతడు పుట్టకముందే ఒక ప్రవక్తగా ఎన్నుకోబడ్డాడని ప్రభువు యిర్మీయాతో చెప్పారు. యిర్మీయా జీవితం కష్టంగా ఉంటుందని ప్రభువుకు తెలుసు. కానీ ఎల్లప్పుడూ అతనితో ఉంటానని ఆయన యిర్మీయాకు వాగ్దానమిచ్చారు.

యిర్మీయా 1:1–10

జనులను హెచ్చరిస్తున్న యిర్మీయా

యెరూషలేములోని జనులు ప్రభువుతో చేసిన వాగ్దానాలు నిలుపుకోలేదు. వారి దుష్టత్వము కారణంగా వారు జయించబడతారని యిర్మీయా జనులను హెచ్చరించాడు. వారు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించినట్లయితే, యెరూషలేము పట్టణము నాశనము చేయబడదని ప్రభువు చెప్పారు. కానీ జనులు వినలేదు.

యిర్మీయా 6:1–19; 8–9; 17:21–27

చెరసాలలో యిర్మీయా

అనేక సంవత్సరాలు యిర్మీయా జనులకు బోధించాడు. కానీ వారు పశ్చాత్తాపపడలేదు. బదులుగా, వారు యిర్మీయాను గాయపరచి, అతడిని చెరసాలలో వేసారు.

యిర్మీయా 20:2; 26:8–9; 37:15–18; 38:6

యెరూషలేము నాశనమగుటను గమనిస్తున్న యిర్మీయా

యిర్మీయా జనులను ప్రేమించాడు. వారి పాపాల కారణంగా అతడు దుఃఖించాడు. అతడు చెప్పినట్లే యెరూషలేము నాశనం చేయబడింది మరియు జనులు బంధించబడ్డారు.

యిర్మీయా 9:1–8; 25:9–12; 52:1–10

ప్రవచనాలను వ్రాస్తున్న యిర్మీయా

యిర్మీయా ఐగుప్తుకు తీసుకొనిపోబడ్డాడు. అతని ప్రవచనాలను వ్రాయమని ప్రభువు అతనికి చెప్పారు. పరిస్థితులు కష్టంగా ఉన్నప్పటికీ యిర్మీయా ప్రభువుకు విధేయుడయ్యాడు. ప్రభువుతో వారు చేసిన వాగ్దానాలను నిలుపుకోమని అతడు తన జనులకు చెప్పడం కొనసాగించాడు.

యిర్మీయా 36:1–2, 27–32