“యోసేపు యొక్క ప్రేరేపిత కలలు,” పాత నిబంధన కథలు (2022)
“యోసేపు యొక్క ప్రేరేపిత కలలు,” పాత నిబంధన కథలు
యోసేపు యొక్క ప్రేరేపిత కలలు
ఒకరినొకరు ప్రేమించడానికి ఒక కుటుంబం పడుతున్న శ్రమ
ఒక కుమారుడి కోసం రాహేలు మరియు యాకోబు చాలా సంవత్సరాలు ప్రార్థించారు. యోసేపు పుట్టినప్పుడు ప్రభువు వారి ప్రార్థనలు విన్నారు. యోసేపు యాకోబుకు ఇష్టమైన కుమారుడు మరియు అతడు యోసేపుకు ఒక ప్రత్యేకమైన నిలువుటంగీ ఇచ్చాడు. యాకోబు యొక్క పెద్ద కొడుకులు 10 మంది అసూయపడ్డారు.
యోసేపు సుమారు 17 సంవత్సరాల వయస్సున్నప్పుడు, అతడు తన అన్నలతో కలిసి పొలాల్లో ధాన్యాన్ని పోగుచేస్తున్నట్లు ఒక ప్రేరేపిత కలగన్నాడు. యోసేపు యొక్క ధాన్యపు మోపు ఎత్తుగా నిలిచింది. కానీ అతని అన్నల ధాన్యపు మోపులు యోసేపు దానికి తలవంచాయి. కల గురించి యోసేపు తన అన్నలకు చెప్పినప్పుడు, వారు అతని మీద కోపంగా ఉన్నారు.
తర్వాత యోసేపు మరొక ప్రేరేపిత కలగన్నాడు. ఈ కలలో సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు అతనికి తలవంచాయి. కల గురించి యోసేపు తన కుటుంబానికి చెప్పాడు. ఈ కల ప్రకారం యోసేపు తన కుటుంబం మీద పెత్తనం చేస్తాడని అనిపించింది. యోసేపు అన్నలకు అతని మీద కోపం ఎక్కువైంది. అతని కలలు వారికి నచ్చలేదు.
ఒకరోజు యోసేపు అన్నలు ఇంటికి దూరంగా గొర్రెలు మేపుతున్నారు. వారిని పరిశీలించమని యాకోబు యోసేపును పంపాడు.
యోసేపు అన్నలలో కొందరు అతడిని చంపాలనుకున్నారు. వారు అతని నిలువుటంగీని తీసుకొని, అతడిని గోతిలో పడేశారు.
యోసేపు గోతిలో ఉన్నప్పుడు, అతని అన్నలు ఐగుప్తుకు వెళ్తున్న ప్రయాణీకులను చూసారు. 20 వెండి నాణేల కోసం యోసేపును బానిసగా ఆ ప్రయాణీకులకు అమ్మివేయాలని అన్నలు నిర్ణయించారు.
తర్వాత యోసేపు అన్నలు అతని నిలువుటంగీ మీద మేక రక్తము పూసారు. అన్నలు వారి తండ్రి యాకోబు దగ్గరకు వెళ్ళి, అతనికి నిలువుటంగీ చూపించారు. క్రూరమృగాలు యోసేపును చంపివేసాయని వారు యాకోబుకు అబద్ధం చెప్పారు.
యోసేపు చనిపోయాడు అనుకొని యాకోబు ఏడ్చాడు.
కానీ యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు. ఇంటికి దూరంగా ఐగుప్తులో అతను బానిసగా జీవిస్తున్నాడు.