“అబ్రాహాము మరియు ఇస్సాకు,” పాత నిబంధన కథలు (2022)
“అబ్రాహాము మరియు ఇస్సాకు,” పాత నిబంధన కథలు
ఆదికాండము 17; 21–22
అబ్రాహాము మరియు ఇస్సాకు
ఒక తండ్రి, ఒక కొడుకు, ఒక బలి
ప్రభువు వాగ్దానమిచ్చినట్లుగా అబ్రాహాము, శారాలకు ఒక మగబిడ్డ కలిగాడు. వారు అతడికి ఇస్సాకు అని పేరు పెట్టారు.
వారు ఇస్సాకును ప్రేమించారు. సరైన దానిని ఎంపిక చేయుటను మరియు ప్రభువును విశ్వసించుటను వారు అతడికి బోధించారు.
ఇస్సాకు ద్వారా వారి కుటుంబము వృద్ధి చెంది భూమినంతటినీ ఆశీర్వదిస్తుందని ప్రభువు అబ్రాహాము మరియు శారాలకు వాగ్దానమిచ్చాడు. కానీ ఒక రోజు ప్రభువు అబ్రాహాముతో ఇస్సాకును మోరీయా పర్వతముకు తీసుకొనివెళ్ళి, ఇస్సాకును ఒక బలిగా ఇవ్వమని చెప్పాడు.
పర్వతంపైకి వెళ్ళే దారిలో, బలికి గొఱ్ఱెపిల్ల ఎక్కడుందని ఇస్సాకు అడిగాడు. ప్రభువు దయచేస్తాడని అబ్రాహాము చెప్పాడు.
మోరీయా పర్వతముపై, అబ్రాహాము ఒక బలిపీఠమును కట్టాడు మరియు దానిపై కట్టెలు ఉంచాడు.
ప్రభువు ఆజ్ఞాపించినట్లుగా, అబ్రాహాము ఇస్సాకును బలిపీఠముపై పడుకోమని అడిగాడు. రక్షకుడైన యేసు క్రీస్తు తన తండ్రిని నమ్మినట్లుగా ఇస్సాకు అబ్రాహామును నమ్మాడు.
అబ్రాహాము ఇస్సాకును బలి ఇవ్వబోతుండగా ప్రభువు యొక్క దేవదూత అతడిని ఆపాడు. అబ్రాహాము ప్రభువునందు తన విశ్వాసమును చూపించాడు. తాను ఎల్లప్పుడు ప్రభువును అనుసరిస్తానని అబ్రాహాముకు తెలుసు.
అబ్రాహాము కన్నులెత్తి చూడగా పొదలో తగులుకొనియున్న పొట్టేలును చూసాడు. ప్రభువు బలి కొరకు పొట్టేలును సిద్ధపరిచాడు.
పరలోక తండ్రి ఆయన కుమారుడైన యేసు క్రీస్తును ఒక బలిగా ఎలా ఇవ్వబోతున్నాడో అబ్రాహాము, ఇస్సాకులు తెలుసుకున్నారు. అబ్రాహాము విధేయుడయ్యాడు కనుక ప్రభువైన యేసు క్రీస్తు అతడిని నమ్మాడు. అబ్రాహాము ఒక రోజు తన కుటుంబం ఆకాశంలోని నక్షత్రాల సంఖ్యను మించి వృద్ధి చెందుతుందనే ప్రభువు యొక్క వాగ్దానమును నమ్మాడు.