“నవంబరు 28—డిసెంబరు 4. నహూము; హబక్కూకు; జెఫన్యా: ‘ఆయన మార్గములు శాశ్వతమైనవి’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)
“నవంబరు 28—డిసెంబరు 4. నహూము; హబక్కూకు; జెఫన్యా,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022
నవంబరు 28—డిసెంబరు 4.
నహూము; హబక్కూకు; జెఫన్యా
“ఆయన మార్గములు శాశ్వతమైనవి”
మీరు జీవితకాలమంతా లేఖనాలను అధ్యయనం చేయవచ్చు మరియు ఇంకా పరిజ్ఞానములను పొందగలరు. ఇప్పుడే ప్రతీది గ్రహించాలని మీరు భావించనవసరం లేదు. ఈరోజు మీకవసరమైన సందేశాలను గుర్తించడానికి సహాయం కొరకు ప్రార్థన చేయండి.
మీ మనోభావాలను నమోదు చేయండి
పాత నిబంధనను చదువుట అనగా నాశనమును గూర్చి ప్రవచనాలను చదువుట అని తరచుగా అర్థము. ప్రభువు తీర్పులు వారిపైకి వస్తాయని చెడ్డవారిని హెచ్చరించమని ఆయన ప్రవక్తలను తరచుగా పిలిచాడు. నహూము; హబక్కూకు; జెఫన్యాల యొక్క పరిచర్యలు మంచి మాదిరులు. అనేక భయం కలిగించే వివరణలు కలిగియున్న వారి ప్రవచనాలలో ఈ ప్రవక్తలు పట్టణాల వినాశనమును ముందుగా చెప్పారు, ఆ సమయమందు, బలమైనవిగా మరియు శక్తివంతమైనవిగా కనబడిన—నీనెవె, బబులోను, మరియు యెరూషలేము కూడా. కానీ అది వేల సంవత్సరాల క్రితం జరిగింది. నేడు ఈ ప్రవచనాలు చదవటం ఎందుకు విలువైనది?
ఆ అహంకారమైన దుష్ట నగరాలు నాశనము చేయబడినప్పటికీ, గర్వము మరియు దుష్టత్వము కొనసాగుతాయి. నేటి ప్రపంచంలో, కొన్నిసార్లు మనము ప్రాచీన ప్రవక్తలచేత ఖండించిన చెడుచేత చుట్టబడ్డాము. మన స్వంత హృదయాలలో వాటి జాడలను కూడా మనం గుర్తించవచ్చు. ఈ పాత నిబంధన ప్రవచనాలు గర్వము మరియు చెడుతనము గురించి ప్రభువు ఎలా భావిస్తున్నారో బయల్పరుస్తాయి, మరియు మనం ఈ చెడును మాని, తిరస్కరించగలమని అవి మనకు బోధిస్తాయి. బహుశా ఈరోజు ప్రాచీన ప్రవచనాలను మనమింకా చదవడానికి అది ఒక కారణము. నహూము; హబక్కూకు; జెఫన్యాలు మరియు మిగిలిన వారు నాశనములను ముందుగా ప్రవచించే ప్రవక్తలు మాత్రమే కాదు—వారు ప్రభువు తన జనులను విమోచించుటను గూర్చి ప్రవచించారు. క్రీస్తు నొద్దకు రండి మరియు ఆయన కరుణను పొందమనే ఆహ్వానముల ద్వారా నాశనము యొక్క వివరణలు తక్కువ చేయబడతాయి: “యెహోవాను వెదకుడి …; వినయముగల వారై నీతిని అనుసరించుడి” (జెఫన్యా 2:3). ఇది ప్రాచీనంగా ప్రభువు యొక్క విధానము, మరియు అది నేడు ఆయన విధానము. “ఆయన మార్గములు శాశ్వతమైనవి” (హబక్కూకు 3:6).
ఈ గ్రంథాల సమీక్షల కొరకు, బైబిలు నిఘంటువులో “నహూము,” “హబక్కూకు,” మరియు “జెఫన్యా” చూడండి.
వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు
ప్రభువు శక్తిమంతుడు, మరియు కరుణగలవాడు.
నహూము యొక్క నియమిత కార్యము ఏదనగా హింసాత్మక సామ్రాజ్యం అష్షూరు యొక్క రాజధాని—నీనెవె యొక్క నాశనమును ముందుగా చెప్పుట, అది ఇశ్రాయేలును చెదరగొట్టెను మరియు యూదాను అణచివేసింది. దేవుని ఉగ్రతను మరియు ఆయన సాటిలేని శక్తిని వర్ణించుట ద్వారా నహూము ప్రారంభించాడు, కానీ అతడు దేవుని యొక్క కరుణ మరియు మంచితనము గురించి కూడా మాట్లాడాడు. ఈ లక్షణాలలో ప్రతిదానిని—మీరు గమనించిన మిగిలిన లక్షణాలను గ్రహించడానికి మీకు సహాయపడునట్లు 1 అధ్యాయములో వచనాలను గుర్తించడానికి మీరు పరిగణించవచ్చు. ప్రభువు గురించి ఈ విషయాలలో ప్రతిదానిని తెలుసుకొనుట ఎందుకు ముఖ్యమైనదని మీరు అనుకుంటున్నారు?
“యెహోవా ఉత్తముడు” (నహూము 1:7) అనే లేఖన బోధన ఆయన “తన శత్రువులకు ప్రతీకారము చేయును” ( నహూము 1:2) అనే లేఖన బోధనతో సమన్వయించబడుట కష్టమైనదిగా కొందరు కనుగొంటారు. మోర్మన్ గ్రంథములో, ఆల్మా కుమారుడైన కొరియాంటన్ “పాపి యొక్క శిక్షయందు దేవుని యొక్క న్యాయమును గూర్చి” (ఆల్మా 42:1) అదే ప్రశ్నలను కలిగియున్నాడు. దేవుని కరుణ మరియు ఆయన న్యాయమునకు అది ఎలా అన్వయిస్తుందో ఎక్కువగా నేర్చుకోవడానికి, ఆల్మా 42 లో కొరియాంటన్‌కు ఆల్మా జవాబును చదవండి.
ప్రభువు యొక్క చిత్తమును మరియు ఆయన సమయాన్ని నేను నమ్మగలను.
కొన్నిసార్లు ప్రభువు యొక్క విధానములను గూర్చి ప్రవక్తలు కూడా ప్రశ్నలు కలిగియున్నారు. యూదాలో చెడుతనము వ్యాపించిన సమయమందు జీవించిన, హబక్కూకు, ప్రభువుకు ప్రశ్నలతో తన గ్రంథాన్ని ప్రారంభించాడు (హబక్కూకు 1:1–4 చూడండి). హబక్కూకు యొక్క సందేహాలను మీరు ఎలా సంక్షిప్తపరచగలరు? మీరు ఎప్పుడైనా ఇలాంటి భావాలను కలిగియున్నారా?
యూదాను శిక్షించడానికి ఆయన కల్దీయులను (బబులోనియులు) పంపెదనని చెప్పుచూ హబక్కూకు ప్రశ్నలకు ప్రభువు జవాబిచ్చాడు (హబక్కూకు 1:5–11 చూడండి). కానీ హబక్కూకు ఇంకా ఇబ్బందిపడ్డాడు, ఏలయనగా ప్రభువు “చెడ్డ [బబులోను] తమకంటె నీతిపరులను [యూదా] నాశనము చేయగా జోక్యం చేసుకోకపోవడం అన్యాయమైనదిగా కనబడింది (12–17 వచనాలు చూడండి). హబక్కూకు 2:1–4 లో మీరు కనుగొన్నది ఏది జవాబివ్వబడని ప్రశ్నలను మీరు కలిగియున్నప్పుడు ప్రభువునందు నమ్మకముంచడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది.
హబక్కూకు 3 అధ్యాయము దేవునికి స్తుతి చెల్లించే ప్రార్థన మరియు ఆయనయందు విశ్వాసము యొక్క వ్యక్తీకరణను కలిగియున్నది. 17–19 వచనాలలో లో హబక్కూకు మాటలను గూర్చి మిమ్మల్ని ఆశ్చర్యపరచేది ఏమిటి? హబక్కూకు 1:1–4 నుండి ఈ వచనాలు వ్యక్తీకరించబడిన విధానము భిన్నంగా ఎలా ఉన్నది? జీవితము అన్యాయంగా కనిపించినప్పుడు కూడా, దేవునియందు గొప్ప విశ్వాసమును మీరు ఎలా వృద్ధి చేయగలరో ధ్యానించండి.
హెబ్రీయులకు 10:32–39; 11; సిద్ధాంతము మరియు నిబంధనలు 121:1–6 కూడా చూడండి; రాబర్ట్ డి. హేల్స్, “Waiting upon the Lord: Thy Will Be Done,” Liahona, Nov. 2011, 71–74.
“సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి”
వారి చెడుతనము వలన యూదా జనులు బబులోనియుల చేత పూర్తిగా నాశనం చేయబడతారని జెఫన్యా ప్రవచించాడు. “ఏమియు విడువకుండ భూమిమీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసెదను” (జెఫన్యా 1:2). అయినప్పటికీ “మిగిలినవారు” (జెఫన్యా 3:13 ) కాపాడబడతారని కూడా జెఫన్యా చెప్పాడు. ఈ ప్రవచనాలను మీరు చదివినప్పుడు, యూదా మరియు ఇతర గుంపులను నాశనమునకు నడిపించిన స్వభావాలు మరియు ప్రవర్తనల రకాలను గమనించండి—ప్రత్యేకంగా జెఫన్యా 1:4–6,12; 2:8, 10,15; 3:1–4 చూడండి. తరువాత దేవుడు కాపాడే జనుల స్వభావాల కోసం వెదకండి—జెఫన్యా 2:1–3; 3:12–13, 18–19 చూడండి. ఈ వచనాలలో ప్రభువు మీ కొరకు కలిగియున్న సందేశమేదని మీరు భావిస్తున్నారు?
ప్రభువు “మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టిన” 15 వచనము తరువాత నీతిపరుల యొక్క సంతోషమును జెఫన్యా 3:14–20 వివరించును. ఈ వచనాలలో వాగ్దానము చేయబడిన ఏ దీవెనలు మీకు ప్రత్యేకంగా గమనింపదగినవి? ఈ దీవెనలను గూర్చి మీరు తెలుసుకొనుట మీకు ఎందుకు ముఖ్యమైనది? 3 నీఫై 17 లో వివరించబడిన అనుభవాలకు ఈ వచనాలను మీరు పోల్చవచ్చు మరియు మీరు కలిపి—ఆయన జనులను గూర్చి యేసు క్రీస్తు ఎలా భావిస్తున్నాడో ధ్యానించండి.
కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు
-
నహూము 1:7ఏవిధంగా ప్రభువు మనకు “ఒక ఆశ్రయదుర్గముగా” ఉన్నాడు? మీ కుటుంబము మీ గృహములో ఒక సాధారణమైన ఆశ్రయదుర్గము లేక కోటను కట్టగలరు మరియు దానిలోపల ఉండగా నహూము 1:7 చర్చించండి. మన దినము “శ్రమ దినముగా” ఏది చేస్తుంది? యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త మనల్ని ఎలా పటిష్టపరుస్తుంది? మనము “ఆయనయందు నమ్మకముంచామని” ఎలా చూపగలము?
-
హబక్కూకు 2:14.ఈ వచనములో ప్రవచనము నెరవేర్చడానికి మనము ఎలా సహాయపడగలము?
-
హబక్కూకు 3:17–19.ఈ వచనాలలో హబక్కూకు యొక్క మాదిరి నుండి మనము ఏమి నేర్చుకోగలము?
-
జెఫన్యా 2:3ఒక పేజీలో అనేక ఇతర మాటలతో “నీతి” మరియు “సాత్వికము” మాటలను కనుగొనే ఆటను కుటుంబ సభ్యులతో మీరు ఆడవచ్చు. తరువాత ఒకరినొకరిలో వారు చూసిన నీతి మరియు సాత్వికము యొక్క మాదిరులను గూర్చి వారు మాట్లాడవచ్చు. నీతి మరియు సాత్వికమును వెదకుట అనగా అర్థమేమిటి?
-
జెఫన్యా 3:14–20జెఫన్యా 3:14–20 లో మీరు కనుగొన్నది ఏది మీరు “ఉత్సాహధ్వని చేసి, … పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయునట్లు” చేస్తుంది? బహుశా మీ కుటుంబము ఈ వచనాలను చదివినప్పుడు, మనస్సులోనికి వచ్చే కీర్తనలను లేక పాటలను మీరు పాడవచ్చు.
పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.