2022 పాత నిబంధన
డిసెంబరు 12–18. మలాకీ: “యెహోవా సెలవిచ్చునదేమనగా, నేను మీ యెడల ప్రేమ చూపియున్నాను”


“డిసెంబరు 12–18. మలాకీ: ‘యెహోవా సెలవిచ్చునదేమనగా, నేను మీ యెడల ప్రేమ చూపియున్నాను’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)

“డిసెంబరు 12–18. మలాకీ,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022

చిత్రం
క్రైస్టస్ విగ్రహము

డిసెంబరు 12–18

మలాకీ

“యెహోవా సెలవిచ్చునదేమనగా, నేను మీ యెడల ప్రేమ చూపియున్నాను”

మలాకీ పేరుకు అర్థము, “నా రాయబారి” (బైబిలు నిఘంటువు, “మలాకీ”). ఇశ్రాయేలుకు మలాకీ సందేశమును మీరు అధ్యయనం చేసినప్పుడు, మీ జీవితంలో మీరు కనుగొనే సందేశములు ఏవి? మన కాలములో మలాకీ మాటలను మనము ఎలా అన్వయించగలము?

మీ మనోభావాలను నమోదు చేయండి

ప్రవక్త మలాకీ ద్వారా, “నేను మీ యెడల ప్రేమ చూపియున్నాను” అని ప్రభువు తన జనులతో చెప్పాడు. కానీ తరములుగా శ్రమ, చెర అనుభవించిన ఇశ్రాయేలీయులు, ప్రభువును అడిగారు, “ఏ విషయమందు నీవు మా యెడల ప్రేమ చూపితివి?” (మలాకీ 1:2). ఇశ్రాయేలీయులు అంతా అనుభవించాక, ఆయన నిబంధన జనుల కొరకు దేవుని ప్రేమను గూర్చి ప్రాచీన ఇశ్రాయేలు చరిత్ర నిజంగా ఒక వృత్తాంతమా అని వారు ఆశ్చర్యపడియుండవచ్చు.

ఈ సంవత్సరము పాత నిబంధనలో మీరు చదివిన దానిని ప్రతిఫలించినప్పుడు, దేవుని ప్రేమకు మీరు కనుగొన్న నిదర్శనమేమిటి? అనేక మానవ బలహీనతలు మరియు తిరుగుబాటు యొక్క మాదిరులను చూచుట సులభమైనది. అయినప్పటికీ, వీటన్నిటిలో దేవుడు ప్రేమతో చేరుకోవడాన్ని ఎన్నడూ ఆపలేదు. యాకోబు కుమారులు వారి తమ్ముడైన యోసేపుకు అన్యాయం చేసినప్పుడు, కరువు నుండి వారిని కాపాడటానికి ప్రభువు ఇంకా ఒక మార్గమును సిద్ధపరిచాడు (ఆదికాండము 45:4–8 చూడండి). ఇశ్రాయేలీయులు అరణ్యములో సణిగినప్పుడు, దేవుడు వారికి మన్నాను ఆహారంగా ఇచ్చాడు (నిర్గమకాండము 16:1–4 చూడండి). ఇశ్రాయేలీయులు ఆయనను విడిచిపెట్టి, ఇతర దేవుళ్ళ వైపు తిరిగి మరియు చెదరగొట్టబడినప్పుడు కూడా, దేవుడు వారిని ఎన్నడూ పూర్తిగా విడిచిపెట్టలేదు, కానీ వారు పశ్చాత్తాపపడిన యెడల, ఆయన వారిని సమకూర్చి మరియు “గొప్ప వాత్సల్యములతో” (యెషయా 54:7 చూడండి) వారిని విడిపించును.

ఈవిధంగా చూడబడి, పాత నిబంధన దేవుని యొక్క సహనము, శాశ్వతమైన ప్రేమ యొక్క వృత్తాంతము. మరియు ఈ వృత్తాంతము నేడు కొనసాగుతున్నది. “నీతి సూర్యుడు ఉదయించును,” అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును (మలాకీ 4:2) అని మలాకీ ప్రవచించాడు. ఆయన వద్దకు వచ్చు వారందరికీ, శారీరక, ఆత్మీయ స్వస్థతను తెస్తూ, యేసు క్రీస్తు వచ్చెను. ఆయన ప్రాచీన ఇశ్రాయేలు కొరకు మరియు మనందరి కొరకు దేవుని యొక్క ప్రేమకు గొప్ప నిదర్శనంగా ఉన్నాడు.

మలాకీ గ్రంథము గురించి ఎక్కువ సమాచారము కొరకు, బైబిలు నిఘంటువులో “మలాకీ“ చూడండి.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

మలాకీ 1–4

“మీరు నాతట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదును.”

మలాకీ కాలములో, ఇశ్రాయేలీయులు అప్పటికే యెరూషలేములో దేవాలయమును పునర్నిర్మించారు, కానీ ఒక జనముగా వారు ఇంకా ప్రభువుతో వారి అనుబంధమును తిరిగి నిర్మించవలసియున్నది. మీరు మలాకీ చదివినప్పుడు, ఇశ్రాయేలీయులను ప్రభువు అడిగినవి లేక వారు ఆయనను అడిగిన ప్రశ్నల కొరకు వెదకుము. ప్రభువుతో మీ అనుబంధమును లెక్కించడానికి మరియు ఆయనకు దగ్గర కావడానికి అటువంటి ప్రశ్నలను మీకై మీరు అడగడానికి పరిగణించండి (కొన్ని మాదిరులు క్రింది విధంగా సూచించబడినవి).

  • నా కోసం ప్రభువు ప్రేమను నేను ఎలా అనుభూతి చెందాను? (మలాకీ 1:2 చూడండి).

  • ప్రభువుకు నా అర్పణలు ఆయనను నిజంగా గౌరవిస్తున్నాయా? (మలాకీ 1:6–11 చూడండి).

  • నేను ఏవిధాలుగా ప్రభువు “తట్టు” తిరగవలసిన అవసరమున్నది? (మలాకీ 3:7 చూడండి).

  • నేను ఏ విధంగా దేవునిని దొంగిలిస్తున్నాను? (మలాకీ 3:8–11) చూడండి.

  • కష్టకాలములందు నా స్వభావము ప్రభువు పట్ల నా భావాలను ఎలా ప్రతిఫలిస్తాయి? (మలాకీ 3:13–15 చూడండి; 2:17 కూడా చూడండి).

డి. టాడ్ క్రిస్టాఫర్సన్ “As Many as I Love, I Rebuke and Chasten,” Liahona, May 2011, 97–100 కూడా చూడండి.

మలాకీ 1:6–14

ప్రభువు “ఒక పవిత్రమైన అర్పణ,” కొరకు అడిగెను.

మలాకీ 1 లోని ప్రభువు యొక్క మాటలు ఇశ్రాయేలీయ యాజకులు దోషముగల, వ్యాధిగల జంతువులను బలిగా అర్పిస్తున్నారని సూచించును, దానిని ప్రభువు నిషేధించాడు (లేవియకాండము 22:17–25 చూడండి). ప్రభువు పట్ల యాజకుల భావనలను గూర్చి ఈ బలులు ఏమి సూచిస్తాయి? (మలాకీ 1:13 చూడండి). మన శ్రేష్ఠమైన అర్పణలను ఆయనకు ఇవ్వాలని ప్రభువు మనల్ని ఎందుకు అడుగుతున్నాడు? ప్రభువు మిమ్మల్ని చేయమని అడిగిన బలులను గూర్చి ఆలోచించుము. “పవిత్రమైన అర్పణను” ఆయనకు ఇవ్వడానికి మీరేమి చేయగలరు? మలాకీ 1:11; ఆల్మా 3:3 కూడా చూడండి.

మొరోనై 7:5–14 కూడా చూడండి.

మలాకీ 3–4

కడవరి దినాలలో మలాకీ ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి.

రక్షకుడు అమెరికాను దర్శించినప్పుడు, ఆయన మలాకీ 3–4 (3 నీఫై 24–25 చూడండి) నీఫైయులకు ఉదహరించాడు. 1823 లో, జోసెఫ్ స్మిత్‌తో ఇవే అధ్యాయాలలో భాగాలను మొరోనై దూత పంచుకున్నాడు (Jజోసెఫ్ స్మిత్—చరిత్ర 1:36–39 చూడండి; సిద్ధాంతము మరియు నిబంధనలు 2 కూడా చూడండి). లేఖనాలలో మలాకీ మాటలు ఎందుకు చాలా తరచుగా పునరావృతం చేయబడినవని మీరనుకుంటున్నారు? (సిద్ధాంతము మరియు నిబంధనలు 27:9; 110:13–16; 128:17–18 కూడా చూడండి). మీ అభిప్రాయంలో, మలాకీ 3–4 నుండి ఏ సందేశాలు మన కాలము కొరకు ప్రత్యేకంగా ముఖ్యమైనవిగా కనబడుతున్నాయి?

మొరోనై జోసెఫ్ స్మిత్‌కు మలాకీ 4:5–6 ఉదహరించినప్పుడు, బైబిలులో “అది చదవబడిన దానికంటె కొద్ది వైవిద్యముతో” (జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:36) అతడు చెప్పాడు. మొరోనై యొక్క వైవిద్యము ఈ ప్రవచనము గురించి మన అవగాహనకు ఏమి చేరుస్తుంది? ఏలీయా రాకడ గురించి నేర్చుకోవడానికి మరియు ఈరోజు ఈ ప్రవచనము ఎలా నెరవేర్చబడిందో నేర్చుకోవడానికి, సిద్ధాంతము మరియు నిబంధనలు 110:13–16 ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ యొక్క సందేశము “The Hearts of the Children Shall Turn” (Liahona, Nov. 2011, 24–27) చూడండి. ఏలీయా వచ్చినందుకు మీరు ఎందుకు కృతజ్ఞత కలిగియున్నారు?

చిత్రం
కర్ట్‌లాండ్ దేవాలయములో జోసెఫ్ స్మిత్‌ మరియు ఆలీవర్ కౌడరీలకు ఏలీయా ప్రత్యక్షమగుట

కర్ట్‌లాండ్ దేవాలయములో జోసెఫ్ స్మిత్‌ మరియు ఆలీవర్ కౌడరీలకు ఏలీయా ప్రత్యక్షమగుట యొక్క దృష్టాంతము రాబర్ట్ టి. బారెట్ చేత

మలాకీ 3:8–12

దశమభాగము చెల్లించుట పరలోకపు కిటికీలను తెరచును

మలాకీ 3:8–12 మీరు చదివినప్పుడు, దశమభాగము చెల్లించుటలో మీ స్వంత అనుభవాలను గూర్చి ఆలోచించండి. 10 వచనము “పరలోకపు కిటికీలను తెరచును” అనే వాక్యభాగము మీకు ఏ అర్థమును కలిగియున్నది?

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మలాకీ 1:2.మలాకీ 1:2 లో ఉన్న—“ఏ విషయమందు [ప్రభువు] మా యెడల ప్రేమ చూపితివి?” ప్రశ్నకు మీ కుటుంబము ఎలా జవాబిస్తుంది? మన కొరకు ప్రభువు ప్రేమ యొక్క కొన్ని నిదర్శనలు ఏవి?

మలాకీ 3–12.మీరు మలాకీ 3:8–12 చదివినప్పుడు, దశమభాగము గురించి వారి ఆలోచనలు లేక భావాలను పంచుకోమని కుటుంబ సభ్యులను ఆహ్వానించండి. దశమభాగము చెల్లించుట వలన మీరు చూసిన భౌతిక మరియు ఆత్మీయ దీవెనలు ఏవి? (డేవిడ్ ఎ. బెడ్నార్, “The Windows of Heaven,” Liahona, Nov. 2013, 17–20) చూడండి. కుటుంబ సభ్యులు ఈ దీవెనలు సూచించే చిత్రములను గీసి ఒక కిటికీపై చిత్రములను వ్రేలాడదీయుట ఆనందించవచ్చు.

మలాకీ 3: 13–18.ప్రభువుకు చెందియుండుట ఆయన “సంపాద్యములలో” ఒకరిగా ఉండుట అనగా అర్థమేమిటి?

మలాకీ 4:5–6.ఈ వచనములు చదివిన తరువాత, మలాకీ ప్రవచనము గురించి క్రింది ప్రశ్నలకు జవాబులను మీ కుటుంబము గుర్తించవచ్చు: ఎవరు? ఏమిటి? ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు? ( సిద్ధాంతము మరియు నిబంధనలు 2 కూడా చూడండి).

మన తండ్రుల వైపు మన హృదయాలను ఎలా త్రిప్పగలము? మనము చేసినప్పుడు ఏవిధంగా దీవించబడతాము? ఈ వీడియోను చూస్తుండగా “The Promised Blessings of Family History” (ChurchofJesusChrist.org) ఈ ప్రశ్నలను మీరు ధ్యానించవచ్చు. ఈ దీవెనలు పొందడానికి ఒక కుటుంబముగా మనము ఏమి చేయగలము?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనము మెరుగుపరచుట

మీరు చదువుతున్నప్పుడు ప్రశ్నలు అడగండి. మీరు లేఖనాలను అధ్యయనం చేస్తున్నప్పుడు, ప్రశ్నలు మీ మనసులోకి రావచ్చు. ఈ ప్రశ్నలను ధ్యానించండి, మరియు సమాధానాల కోసం చూడండి.

చిత్రం
స్త్రీ తన వెనుక అనేకమంది పూర్వీకులతో తెలుపు చేతిరుమాలును ఊపుట

Mourning’s Hosanna (విచారము యొక్క హోసన్నా) రోజ్ డాటక్ డాల్ చేత విచారము అనే పేరుగల స్త్రీ తన పూర్వీకుల చేత చుట్టముట్టబడి ఆత్మ లోకంలో నిలబడియున్నది. ఆత్మీయ చెర నుండి వారి విడుదలను ఆమె జరుపుకుంటున్నది.

ముద్రించు