“డిసెంబరు 19–25. క్రిస్మస్: ‘ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొనియున్న మన దేవుడు,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022
“డిసెంబరు 19–25. క్రిస్మస్,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022
డిసెంబరు 19–25
క్రిస్మస్
“ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొనియున్న మన దేవుడు”
ఈ క్రిస్మస్ సమయమందు, పాత నిబంధన సంవత్సరమంతా యేసు క్రీస్తును గూర్చి మీ సాక్ష్యమును ఎలా బలపరచిందో పరిగణించండి.
మీ మనోభావాలను నమోదు చేయండి
పాత నిబంధన ఆసక్తిగా ఎదురుచూసే మానసిక స్థితిని కలిగియున్నది. ఆ విధంగా, అది కాస్త క్రిస్మస్ సమయం వలె ఉన్నది. ఆదాము, హవ్వలతో ప్రారంభించి, పాత నిబంధన మూలపురుషులు, ప్రవక్తలు, కవులు, మరియు జనులు మెస్సీయా చేత క్రొత్తగా చేయబడి, విడిపించబడుటకు నిరీక్షణతో నింపబడి మంచి రోజుల కోసం ఎదురు చూసారు. వారు ఐగుప్తులో లేక బబులోనులో చెరలో ఉన్నా లేక వారి స్వంత పాపము లేక తిరుగుబాటు చేత చెరపట్టబడినప్పటికీ—ఇశ్రాయేలీయులకు ఆ నిరీక్షణ తరచుగా అవసరము. ప్రవక్తలు వారి అనుభవాలన్నిటి ద్వారా “చెరలోనున్న వారికి విడుదలను” (యెషయా 61:1) ఇచ్చుటకు ఒక మెస్సీయా, ఒక విమోచకుడు వచ్చుని వారికి జ్ఞాపకం చేసారు.
యేసు క్రీస్తు బెత్లేహేములో జన్మించినప్పుడు ఆ నిరీక్షణ నెరవేర్చబడటం ప్రారంభమైంది. ఇశ్రాయేలు యొక్క శక్తిమంతుడైన విమోచకుడు ఒక పశువులశాలలో జన్మించి పశువుల తొట్టెలో పరుండబెట్టబడెను (లూకా 2:7 చూడండి). కానీ, ఆయన ప్రాచీన ఇశ్రాయేలు యొక్క విమోచకుడు మాత్రమే కాదు. ఆయన నిన్ను విడిపించడానికి—నీ బాధను భరించడానికి, నీ విచారములను వహించడానికి, నీ అతిక్రమములను బట్టి గాయపరచబడుటకు వచ్చాడు, ఆవిధంగా ఆయన కొరడా దెబ్బలతో నీవు స్వస్థపరచబడగలవు (Iయెషయా 53:4–5 చూడండి). అందుకే క్రిస్మస్ ఇప్పటికీ ఆనందకరమైన ఎదురుచూపుతో నిండియున్నది. 2000 సంవత్సరాల క్రితం మెస్సీయా వచ్చాడు మరియు మనము ఆయనను వెదకినప్పుడు ఆయన మన జీవితాలలోనికి రావడం కొనసాగిస్తాడు.
వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు
నా విమోచకునియందు నేను ఆనందిస్తున్నాను.
యేసు క్రీస్తు లోకములోనికి తెచ్చే ఆనందము వలన క్రిస్మస్ సంతోషకరమైన సమయంగా పేరుపొందింది. యేసు దేవుని కుమారునిగా ఆరాధించని జనులు కూడా తరచుగా క్రిస్మస్ యొక్క సంతోషమును భావించగలరు. పరలోక తండ్రి తన కుమారుని పంపినందుకు మీరు అనుభవించే ఆనందమును ధ్యానించండి.
రక్షకుడు జన్మించడానికి శతాబ్ధాలకు ముందు, పాత నిబంధన ప్రవక్తలు మెస్సీయా రాకడ గురించి వారు మాట్లాడినప్పుడు వారు కూడా సంతోషించారు. క్రింది లేఖన భాగాలలో కొన్నిటిని చదవండి మరియు రక్షకుని నియమితకార్యము కొరకు ఎదురుచూసిన వారికి అవి ఎందుకు ప్రశస్తమైనవో ఆలోచించండి: కీర్తన 35:9; యెషయా 25:8–9; 44:21–24; 51:11; జెఫన్యా 3:14–20; మోషే 5:5–11. ఈ లేఖన భాగాలు మీకు ఎందుకు ప్రశస్తమైనవి?
రస్సెల్ ఎమ్. నెల్సన్, “Joy and Spiritual Survival,” ఎన్‌సైన్ లేదాలియహోనా, నవం. 2016, 81–84 కూడా చూడండి.
యేసు క్రీస్తును జ్ఞాపకముంచుకోవడానికి చిహ్నములు నాకు సహాయపడతాయి.
క్రిస్మస్‌కు సంబంధించిన ఆచారాలలో అనేకము క్రీస్తుపై మన ఆసక్తిని కేంద్రీకరించడానికి మనకు సహాయపడగల చిహ్నపూర్వకమైన అర్థాలను కలిగియుండగలవు. నక్షిత్ర-ఆకారపు అలంకరణలు యేసు పుట్టిన రాత్రి ప్రకాశించిన కాంతివంతమైన నక్షిత్రాన్ని సూచిస్తాయి (మత్తయి 2:2 చూడండి). క్రిస్మస్ పాటలు పాడేవారు గొఱ్ఱెల కాపరులకు ప్రత్యక్షమైన దూతలను మనకు జ్ఞాపకం చేస్తారు (లూకా 2:13–14 చూడండి). ఈ సంవత్సరం మీరు పాత నిబంధనను అధ్యయనం చేసినప్పుడు, మీరు రక్షకుని గూర్చి అనేక చిహ్నములను మీరు గమనించియుండవచ్చు. కొన్ని ఇక్కడ జాబితా చేయబడినవి. వీటిని అధ్యయనం చేసి, ఆయన గురించి అవి బోధించే దానిని వ్రాయడానికి పరిగణించండి.
-
గొఱ్ఱెపిల్ల (ఆదికాండము 22:8; నిర్గమకాండము 12:5; 1పేతురు1:18–20).
-
ఇత్తడి సర్పము (సంఖ్యాకాండము 21:4–9; యోహాను 3:14–15).
-
శాఖ (యెషయా 11:1–2; యిర్మీయా 23:5; 33:15).
-
వెలుగు (కీర్తనలు 27:1; యెషయా 9:2; 60:19; మీకా 7:8; యోహాను 8:12).
యేసు క్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చేవి లేఖనాలలో మీరు కనుగొన్న ఇతర చిహ్నములు, లేఖన భాగాలు, మరియు వృత్తాంతములేవి?
2 నీఫై 11:4; మోషైయ 3:14–15; మోషే 6:63; “Types or Symbols of Christ,” in Guide to the Scriptures, “Jesus Christ,” scriptures.ChurchofJesusChrist.org కూడా చూడండి.
“ఆశ్చర్యకరుడు అని ఆయనకు పేరు పెట్టబడును.”
యేసు క్రీస్తు అనేక భిన్నమైన పేర్లు మరియు శీర్షికలు సూచించబడ్డాడు. క్రింది వచనాలలో మీరు కనుగొనే పేర్లు ఏవి? కీర్తనలు 23:1; 83:18; యెషయా 7:14; 9:6; 12:2; 63:16; ఆమోసు 4:13; జెకర్యా 14:16; మోషే 7:53. మీరు ఆలోచించగల మిగిలిన పేర్లు ఏవి? క్రిస్మస్ కీర్తనలలో మీరు కనుగొన్న యేసు క్రీస్తును గూర్చి శీర్షికలను వరుసగా వ్రాయడాన్ని మీరు ఆనందించవచ్చు. ప్రతి శీర్షిక ఆయన గురించి మీరు ఆలోచించే విధానమును ఎలా ప్రభావితం చేస్తుంది?
కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు
-
క్రిస్మస్ సంప్రదాయాలు యేసు క్రీస్తు వైపు ఆసక్తిని చూపగలవు.ఇశ్రాయేలీయ కుటుంబాలు పస్కాను, ఇతర విందులు వంటి సంప్రదాయాలను కలిగియున్నారు, అవి వారి ఆలోచనలు, భావావేశాలు ప్రభువుపై దృష్టిసారించడానికి వారికి సహాయపడుటకు ఉద్దేశించబడినవి (నిర్గమకాండము 12 చూడండి). క్రిస్మస్ సమయమందు మీ కుటుంబము కలిగియున్న సంప్రదాయాలు ఏవి యేసు క్రీస్తుపై కేంద్రీకరించడానికి మీకు సహాయపడ్డాయి? మీ కుటుంబ చరిత్ర నుండి మీకు తెలిసిన సంప్రదాయాలు ఏవి? ఒక కుటుంబముగా మీరు ప్రారంభించాలనుకున్న సంప్రదాయాలను చర్చించడానికి మీరు పరిగణించవచ్చు. అవసరతలో ఉన్నవారికి సేవ చేయుట కలిపి కొన్ని ఆలోచనలు వీటిని కలిగియున్నవి, (ఉపాయముల కొరకు, ComeuntoChrist.org/light-the-world చూడండి), ప్రథమ అధ్యక్షత్వము యొక్క క్రిస్మస్ భక్తి సమావేశమును మీతోపాటు చూడమని ఒక స్నేహితుని ఆహ్వానించుట, (broadcasts.ChurchofJesusChrist.org), మీ స్వంత క్రిస్మస్ పాటను వ్రాయుట, లేక క్రీస్తు యొక్క జననము సందేశాన్ని పంచుకోవడానికి ఒక సృజనాత్మక విధానమును కనుగొనుట.
-
“పసిబిడ్డయైన క్రీస్తు: క్రీస్తు పుట్టుక కథనం.”క్రీస్తు యొక్క జననమును గూర్చి భక్తిగల గౌరవాన్ని మరియు ఆనందాన్ని అనుభవించడానికి కుటుంబ సభ్యులకు మీరు ఎలా సహాయపడగలరు? “పసిబిడ్డయైన క్రీస్తు: క్రీస్తు పుట్టుక కథనం” (ChurchofJesusChrist.org) లేక కలిసి మత్తయి 1:18–25; 2:1–12; లూకా 1:26–38; 2:1–20 చదవండి. ప్రతీ కుటుంబ సభ్యుడు లేఖన వృత్తాంతమును నుండి ఒక వ్యక్తిని ఎంపిక చేసుకొని రక్షకుని గురించి ఆ వ్యక్తి ఎలా భావిస్తున్నాడో పంచుకోవచ్చు. కుటుంబ సభ్యులు ఆయన గురించి వారి స్వంత భావాలను కూడా పంచుకోవచ్చు.
-
పాత నిబంధనలో రక్షకుని కనుగొనుటక్రొత్త నిబంధనలో యేసు క్రీస్తు యొక్క జీవితమును గూర్చి అధ్యయనం చేయడానికి మీరు సిద్ధపడినప్పుడు, పాత నిబంధనలో ఈ సంవత్సరము ఆయన గురించి మీరు నేర్చుకొన్న దానిని మీ కుటుంబముతో సమీక్షించడానికి పరిగణించండి. ఈ వనరులో సంగ్రహించబడిన దానిని మరియు మీరు నేర్చుకొన్న దానిని జ్ఞాపకముంచుకోవడానికి సహాయపడటానికి ఏవైన వ్యక్తిగత అధ్యయన వివరణలను మీరు సమీక్షించవచ్చు. పాత నిబంధన కథనాలు లేక ఈ వనరులో చిత్రములను చూచుట వలన చిన్న పిల్లలు లబ్ది పొందవచ్చు. ఏ ప్రవచనాలు లేదా కథలు మనకు ప్రత్యేకమైనవి? రక్షకుని గురించి మనము ఏమి నేర్చుకున్నాము?
పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.