2022 పాత నిబంధన
డిసెంబరు 5–11. హగ్గయి; జెకర్యా 1–3; 7–14: “యెహోవాకు ప్రతిష్ఠతము”


“డిసెంబరు 5–11. హగ్గయి; జెకర్యా 1–3; 7–14: “యెహోవాకు ప్రతిష్ఠితము,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)

“డిసెంబరు 5–11. హగ్గయి; జెకర్యా 1–3; 7–14,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022

లై హవాయి దేవాలయము

లై హవాయి దేవాలయము

డిసెంబరు 5–11

హగ్గయి; జెకర్యా 1–3; 7–14

“యెహోవాకు ప్రతిష్ఠితము”

లేఖనాలను చదువుట బయల్పాటును ఆహ్వానించును. మీరు హగ్గయి మరియు జెకర్యా చదివినప్పుడు, పరిశుద్ధాత్మ మీకు బయల్పరచిన సందేశాలకు బహిర్గతంగా ఉండండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

దశాబ్దాల దాస్యము తరువాత, బహుశా హగ్గయి మరియు జెకర్యా ప్రవక్తలు కలిపి, ఒక ఇశ్రాయేలీయుల గుంపు, యెరూషలేముకు తిరిగి వెళ్ళడానికి అనుమతించబడ్డారు. ఈ గుంపులో కొందరు యెరూషలేము నాశనము చేయబడక ముందు ఎలా ఉండేదో గుర్తుంచుకున్నారు. వారి ఇండ్లు, వారు ఆరాధించే స్థలములు, మరియు వారి దేవాలయము ఉన్నచోట రాళ్ళను వారు చూసినప్పుడు, వారి భావాలను ఊహించండి. ప్రభువు యొక్క మందిరము “పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమ” పోలియుంటుందా అని ఆశ్చర్యపడిన వారితో, (హగ్గయి 2:3), హగ్గయి ప్రవక్త ప్రభువు యొక్క ప్రోత్సహించే మాటలను మాట్లాడాడు: “దేశములోనున్న సమస్త జనులారా, ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి.” “నేను ఈ మందిరమును మహిమతో నింపుదును, … ఈ స్థలమందు నేను సమాధానము నిలుప ననుగ్రహించెదను.” హగ్గయి 2:4–5, 7,9.)

కానీ పరిశుద్ధ ఆలయము మాత్రమే పునర్నిర్మించాల్సిన అవసరము కలిగిలేదు. అనేక విధాలుగా, దేవుని యొక్క జనులు ఆత్మీయంగా నాశనమైయున్నారు. పరిశుద్ధ జనులను పునర్నిర్మించుటకు రాళ్ళను ముక్కలుగా చేయుట, దేవాలయ గోడను కట్టించుటకు వాటిని సమలేఖన చేయుట కంటె ఎక్కువ అవసరము. నేడు, దేవాలయములు “యెహోవాకు ప్రతిష్ఠితము” అనే శాసనాన్ని కలిగియున్నవి మరియు ఆ మాటలు కేవలం ఒక భవనానికి అన్వయించవు కానీ ఒక జీవిత విధానానికి అన్వయిస్తాయి. “గుఱ్ఱముల యొక్క కళ్లెములపై” మరియు “యెరూషలేములో ప్రతీ పాత్రపై” (జెకర్యా 14:20–21) ఈ మాటలను చెక్కుట అవి ప్రతీ హృదయములో చెక్కబడినప్పుడు మాత్రమే సహాయకరమైనవి. మనము ఆయనవలె పరిశుద్ధులగునట్లు మన స్వభావాలను మారుటకు ఆయన శక్తిని అనుమతిస్తూ (లేవియకాండము 19:2 చూడండి) నిజమైన పరిశుద్ధతకు ప్రభువు యొక్క మాటలు మరియు చట్టములు మనల్ని “పట్టుకొనుట” (జెకర్యా 1:6 చూడండి) అవసరము.

హగ్గయి మరియు జెకర్యా గ్రంథాలను సమీక్షించడానికి, బైబిలు నిఘంటువులో “హగ్గయి” మరియు “జెకర్యా” చూడండి.

వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

హగ్గయి 1; 2:1–9

“మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి.”

యెరూషలేమును తిరిగి కట్టడానికి చేయడానికి అనేక ముఖ్యమైన విషయాలున్నాయి. సుమారుగా ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చిన 15 సంవత్సరాల తరువాత, దేవాలయ పునర్నిర్మాణానికి ఎక్కువ ప్రధాన్యత ఇవ్వబడలేదని ప్రభువుకు కోపం వచ్చింది (హగ్గయి 1:2–5; ఎజ్రా 4:24 కూడా చూడండి). హగ్గయి 1; 2:1–9 మీరు చదివినప్పుడు, ఇటువంటి ప్రశ్నలను పరిగణించండి: వారు దేవాలయమును పూర్తి చేయలేదు కనుక ఇశ్రాయేలీయులు ఎదుర్కొనే పర్యవసానములేవి? వారు ఆయన మందిర నిర్మాణమును పూర్తి చేసిన యెడల ప్రభువు వాగ్దానమిచ్చిన దీవెనలేవి? “మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుటకు,” మీ ప్రాధాన్యతలను గూర్చి ఆలోచించడానికి మరియు ప్రభువుతో వాటిని సమరేఖలోనికి మీరు ఎలా తేగలరో ఆలోచించడానికి ఈ అవకాశమును మీరు తీసుకోవచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 95; టెరెన్స్ ఎమ్. విన్సన్, “True Disciples of the Savior,” Ensign or Liahona, Nov. 2019, 9–11 కూడా

జెకర్యా 1–3; 7–8;14

ప్రభువు నన్ను పరిశుద్ధునిగా చేయగలడు.

సహోదరి కారోల్ ఎఫ్. మెఖాంకీ బోధించారు: “పరిశుద్ధాత్మను మన మార్గదర్శిగా చేసే ఎంపికలు చేయుట పరిశుద్ధత. పరిశుద్ధత అనగా మన సహజ స్వభావాలను పక్కన పెట్టి మరియు ‘ప్రభువైన క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా ఒక పరిశుద్ధుడగుట’ [మోషైయ 3:19]. … పరిశుద్ధాత్మ కొరకు మన నిరీక్షణ, క్రీస్తుయందు, ఆయన కరుణ, ఆయన కృపయందు కేంద్రీకరించబడును” (“The Beauty of Holiness,” Ensign or Liahona, May 2017, 9–10). ప్రవక్త జెకర్యా ద్వారా ఇవ్వబడిన ప్రభువు మాటలను మీరు చదివినప్పుడు, ఈ బోధనలను మీరు మనస్సులో ఉంచుకొనండి: జెకర్యా 1:1–6; 3:1–7; 7:8–10; 8:16–17. ఆయన వారిని పరిశుద్ధులుగా చేయునట్లు ప్రభువు ఇశ్రాయేలీయులను అడిగిన విషయాలను గమనించండి. ఎక్కువ పరిశుద్ధంగా మారటానికి ఆయన మీకు ఎలా సహాయపడుతున్నాడు?

జెకర్యా 2:10–11; 8:1–8; 14:9–11, 20–21 పరిశుద్ధమైన స్థితిలో ప్రభువుతో మనమందరం జీవించినప్పుడు భవిష్యత్తు దినములో జీవితం ఎలా ఉంటుందో వివరిస్తుంది. జెకర్యా కాలములో యెరూషలేమును పునర్నిర్మించే వారికి ఈ వర్ణనలు ఏ అర్ధము కలిగియుండవచ్చు? అవి మీకు ఏ అర్థమును కలిగియున్నది?

యెరూషలేములోనికి యేసు యొక్క విజయవంతమైన ప్రవేశం

“నీ రాజు నీతిపరుడును, రక్షణగల వాడును దీనుడనై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు” (జెకర్యా 9:9). విజయవంతమైన ప్రవేశము, హారీ ఆండర్సన్ చేత

జెకర్యా 9:9–11; 11:12–13; 12:10; 13:6–7; 14:1–9

యేసు క్రీస్తు వాగ్దానమివ్వబడిన మెస్సీయా.

జెకర్యా రచనలలో కొన్ని యేసు క్రీస్తు యొక్క భూలోక పరిచర్యను మరియు చివరకు ఆయన రెండవ రాకడను కూడా సూచిస్తాయి. ఇతర లేఖన గ్రంథాలనుండి సంబంధిత లేఖన భాగాలతో జెకర్యానుండి క్రింది ప్రవచనాలను పోల్చండి.

ఈ లేఖన భాగాలను మీరు అధ్యయనము చేసినప్పుడు రక్షకుని గురించి మీరేమి నేర్చుకున్నారు? ఈ లేఖన భాగాలను గ్రహించుట మీకు ఎందుకు ముఖ్యమైనది?

లేఖనదీపిక, “మెస్సీయా” (scriptures.ChurchofJesusChrist.org) కూడా చూడండి.

కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

హగ్గయి 1:2–7.ఈ వచనాలు “మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుటకు” మీ కుటుంబమును ప్రేరేపించవచ్చు. కుటుంబ సభ్యులు 6 వచనము లో వాక్యభాగాలను అభినటించవచ్చు. దేవుని యొక్క విషయాలకుపైగా లోకము యొక్క విషయాలకు విలువ ఇచ్చుట గురించి ఈ వచనము ఏమి బోధిస్తుంది? మీ కుటుంబ ప్రాధాన్యతలను గూర్చి మీరు కలిసి సంప్రదించవచ్చు. మీరు ఏది బాగా చేస్తున్నారు మరియు మీరు మెరుగుపరచుకోగల విషయాలను లెక్కించడానికి మీ కుటుంబానికి సహాయపడండి.

హగ్గయి 2:1-9.ఈ వచనాలను పరిచయం చేయడానికి, ప్రోవో సిటీ సెంటర్ దేవాలయము యొక్క వృత్తాంతాన్ని మీరు పంచుకోవచ్చు, అది కాల్చబడిన ప్రియమైన టాబెర్నాకిల్ నుండి పునర్నిర్మించబడింది (“Provo City Center Temple Completed,” వీడియో చూడండి, ChurchofJesusChrist.org). మీ కుటంబము హగ్గయి 2:1–9 చదివినప్పుడు, నాశనము చేయబడిన దేవాలయ పునర్నిర్మాణము యొక్క పని వలె ఉన్నది మన జీవితాలలో ఏదైనా ఉన్నదేమో ఆలోచించమని మీరు కుటుంబ సభ్యులను అడగవచ్చు. విషాదం లేదా ప్రతికూలత తరువాత ప్రభువు మనల్ని తిరిగి ఎలా నిర్మిస్తాడు?

జెకర్యా 3:1–7.ఈ వచనాలను మీరు చదివినప్పుడు, మీ కుటుంబానికి మీరు కొన్ని మురికి దుస్తులను చూపించవచ్చు. మురికి దుస్తులతో అతడు దేవదూత యెదుట నిలబడినప్పుడు యెహోషువా ఎలా భావించియుండవచ్చు? పాపము మురికి దుస్తులవలె ఎలా ఉన్నది? జెకర్యా 3:1–7 క్షమాపణ గురించి ఈ వచనాలు ఏమి బోధిస్తున్నాయి? తరువాత మీరు కలిసి దుస్తులను శుభ్రపరచి, రక్షకుని ప్రాయశ్చిత్తము యొక్క శుద్ధి చేసే శక్తిని గూర్చి మాట్లాడవచ్చు.

జెకర్యా 8:1–8.యెరూషలేము యొక్క భవిష్యత్తు గురించి అక్జెకకర్యా దర్శనము గురించి మిమ్మల్ని ఆకట్టుకొనదేమిటి? మన సమాజములో మనము చూడాలనుకొనేది అక్కడ మనము కనుగొనేదేమిటి? “[మన] మధ్య నివాసము” చేయుటకు మనము రక్షకుని ఎలా ఆహ్వానించగలము? (గారీ ఈ. స్టీవెన్‌సన్, “Sacred Homes, Sacred Temples,” ఎన్‌సైన్ లేదా లియహోనా, మే 2009, 101–3) చూడండి.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

స్వీయ-మూల్యంకనము కొరకు అవకాశాలను తీసుకొనండి. మీరు లేఖనాలను అధ్యయనము చేసినప్పుడు, పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుకు మీ స్వంత ఒడంబడికను ధ్యానించడానికి మీరు తరచుగా ప్రేరేపించబడతారు. మీరు పొందే మనోభావాలపై చర్య తీసుకొండి.

అమెరికాలోని యూటా, ప్రోవోలోని ప్రోవో టాబెర్నాకిల్ అగ్నిచేత నాశనము చేయబడి, ప్రోవో సిటీ సెంటర్ దేవాలయంగా ఎలా పునర్నిర్మించబడిందో చూపించే కాలక్రమం.