“5. ప్రధాన మరియు ప్రాంతీయ నాయకత్వము,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు (2023).
“5. ప్రధాన మరియు ప్రాంతీయ నాయకత్వము,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు.
5.
ప్రధాన మరియు ప్రాంతీయ నాయకత్వము
5.0
పరిచయము
యేసు క్రీస్తు ఆయన సంఘము యొక్క “ముఖ్యమైన మూలరాయి” (ఎఫెసీయులకు 2:20). ఆయన అన్ని యాజకత్వ తాళపుచెవులను కలిగి ఉన్నారు. రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యములో ఆయనకు సహాయం చేయడానికి ఆయన అపొస్తలులను మరియు ప్రవక్తలను పిలుస్తారు. ప్రస్తుతం భూమిపై ఉన్న దేవుని రాజ్యానికి సంబంధించిన అన్ని తాళపుచెవులను ఆయన ఎంపిక చేసుకున్న ఈ సేవకులకు అందజేస్తారు. (సిద్ధాంతము మరియు నిబంధనలు 27:12–13 చూడండి; ఈ చేతిపుస్తకములో 3.4.1 కూడా చూడండి.)
ప్రవక్తలు మరియు అపొస్తలుల ద్వారా, ప్రపంచమంతటా ఆయన కార్యములో సహాయం చేయడానికి ప్రభువు పురుషులను డెబ్బది యొక్క స్థానమునకు పిలుస్తారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 107:38 చూడండి). అదనంగా, పనిలో సహాయం చేయడానికి అధ్యక్షత్వము వహించు బిషప్రిక్కు, ప్రధాన అధిపతులు, ఇతర పురుషులు మరియు మహిళా నాయకులకు ముఖ్యమైన బాధ్యతలు ఇవ్వబడ్డాయి.
అదనపు సమాచారం కొరకు, General Handbook: Serving in The Church of Jesus Christ of Latter-day Saints [ప్రధాన చేతిపుస్తకము: యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘములో సేవ చేయుట] లోని 5వ అధ్యాయము చూడండి (ChurchofJesusChrist.org).