చేతి పుస్తకములు మరియు పిలుపులు
6. స్టేకు నాయకత్వము


“6. స్టేకు నాయకత్వము,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు (2023).

“6. స్టేకు నాయకత్వము,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు

కుటుంబంతో మాట్లాడుతున్న నాయకుడు

6.

స్టేకు నాయకత్వము

6.1

స్టేకు యొక్క ఉద్దేశాలు

యెషయా కడవరి దిన సీయోనును స్టేకులచేత భద్రపరచబడిన గుడారం అని వర్ణించాడు (యెషయా 33:20; 54:2 చూడండి).

ప్రభువు తన ప్రజలు “ఒకచోట చేరడం” కొరకు మరియు లోకం నుండి “తప్పించుకొనుట కొరకు మరియు … ఆశ్రయం” కొరకు స్టేకులను ఏర్పాటు చేస్తారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 115:6).

6.2

స్టేకు అధ్యక్షత్వము

స్టేకులో సంఘము యొక్క కార్యమును నడిపించడానికి స్టేకు అధ్యక్షుడు యాజకత్వ తాళపుచెవులను కలిగి ఉంటారు (3.4.1 చూడండి). అతను మరియు అతని సలహాదారులు స్టేకు అధ్యక్షత్వమును ఏర్పాటు చేస్తారు. వారు స్టేకు సభ్యులు యేసు క్రీస్తు యొక్క నిజమైన అనుచరులు కావడానికి సహాయం చేస్తూ, వారి పట్ల ప్రేమతో శ్రద్ధ వహిస్తారు.

స్టేకు అధ్యక్షుడికి నాలుగు ప్రధాన బాధ్యతలు ఉన్నాయి:

  1. అతను స్టేకులో అధ్యక్షత్వము వహించు ప్రధాన యాజకుడు.

  2. అతను స్టేకులో రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యమును నడిపిస్తాడు.

  3. అతను ఉమ్మడి న్యాయాధిపతి.

  4. అతను రికార్డులు, ఆర్థిక వ్యవహారాలు మరియు ఆస్తులను పర్యవేక్షిస్తాడు.

6.3

జిల్లా అధ్యక్షుల అధికారము మరియు స్టేకు అధ్యక్షుల అధికారము మధ్య తేడాలు

ప్రతి జిల్లాలో, మెల్కీసెదెకు యాజకత్వము కలిగి ఉన్న ఒకరిని జిల్లా అధ్యక్షుడిగా పిలుస్తారు. అతను చాలామట్టుకు స్టేకు అధ్యక్షునిలా పనిచేస్తాడు కానీ క్రింది వ్యత్యాసాలతో:

  • అతను ప్రధాన యాజకుల సమూహానికి అధ్యక్షుడు కాదు. అటువంటి సమూహములు స్టేకులలో మాత్రమే ఏర్పాటు చేయబడతాయి.

  • మిషను అధ్యక్షుని అనుమతితో, జిల్లా అధ్యక్షుడు ఒక సోదరుడిని పెద్దగా నియమించడానికి మౌఖికము చేయవచ్చు. జిల్లా అధ్యక్షుడు లేదా అతని ఆధ్వర్యంలో ఎవరైనా కూడా (1) ఒక సహోదరుడిని ఆమోదము కొరకు సమర్పించవచ్చు మరియు (2) నియామకమును నిర్వహించవచ్చు (18.10.1.3, 18.10.3 మరియు18.10.4 చూడండి). అయితే, జిల్లా అధ్యక్షుడు గోత్రజనకులను, ప్రధాన యాజకులను లేదా బిషప్పు‌లను నియమించలేరు.

  • మిషను అధ్యక్షుని అనుమతితో, జిల్లా అధ్యక్షుడు శాఖాధ్యక్షులను ప్రత్యేకపరచవచ్చు (18.11 చూడండి).

  • అతను పూర్తి-కాల సువార్తికులను విడుదల చేయడు.

  • అతను దేవాలయ సిఫారసు మౌఖికాలు నిర్వహించడు లేదా దేవాలయ సిఫారసులపై సంతకం చేయడు (26.3.1 చూడండి).

  • మిషను అధ్యక్షుడు అధికారం ఇస్తే తప్ప, అతను సభ్యత్వ సలహాసభను ఏర్పాటు చేయడు.

6.5

ఉన్నత సలహామండలి

స్టేకు అధ్యక్షత్వము ఉన్నత సలహామండలిని ఏర్పాటు చేయడానికి 12 మంది ప్రధాన యాజకులను పిలుస్తుంది (సిద్ధాంతము మరియు నిబంధనలు 102:1; 124:131).

6.5.1

స్టేకు అధ్యక్షత్వమునకు ప్రాతినిధ్యం వహించుట

స్టేకు అధ్యక్షత్వము స్టేకులోని ప్రతి వార్డుకు ఒక ప్రధాన సలహాదారుని నియమిస్తుంది.

స్టేకు అధ్యక్షత్వము స్టేకులోని ప్రతి పెద్దల సమూహమునకు కూడా ఒక ప్రధాన సలహాదారుని నియమిస్తుంది.

దేవాలయము, కుటుంబ చరిత్ర కార్యము మరియు సువార్త సేవ కోసం వారి బాధ్యతలలో క్రింది వ్యక్తులకు ఉపదేశించడానికి స్టేకు అధ్యక్షత్వము ప్రధాన సలహాదారులను నియమించవచ్చు:

  • పెద్దల సమూహ అధ్యక్షత్వములు

  • వార్డు మిషను నాయకులు

  • వార్డు దేవాలయము మరియు కుటుంబ చరిత్ర నాయకులు

6.7

స్టేకు నిర్మాణాలు

స్టేకు ఉపశమన సమాజము, యువతులు, ప్రాథమిక, ఆదివారపు బడి మరియు యువకుల నిర్మాణాలు ప్రతీ ఒక్కటి ఒక అధ్యక్షుని నేతృత్వంలో ఉంటాయి. ఈ అధ్యక్షులు స్టేకు అధ్యక్షత్వము ఆధ్వర్యంలో పనిచేస్తారు.

ఈ నాయకుల ప్రధాన బాధ్యతలు స్టేకు అధ్యక్షత్వమునకు సహాయం చేయడం మరియు వార్డు నిర్మాణాల అధ్యక్షులకు సూచనలు మరియు మద్దతు ఇవ్వడం.

6.7.1

స్టేకు ఉపశమన సమాజము, యువతులు, ప్రాథమిక, ఆదివారపు బడి అధ్యక్షత్వములు

ఈ అధ్యక్షత్వములలోని సభ్యులు క్రింది బాధ్యతలను కలిగి ఉంటారు:

  • స్టేకు సలహాసభలో సేవ చేయడం (అధ్యక్షులు మాత్రమే).

  • క్రొత్తగా పిలువబడిన వార్డు నిర్మాణాల అధ్యక్షత్వములకు దిశానిర్దేశం చేయడం.

  • మద్దతు మరియు సూచనలను కొనసాగించడం. వారి అవసరాలను తెలుసుకోవడానికి, వారు సేవలందిస్తున్న సభ్యుల అవసరాలను చర్చించడానికి మరియు స్టేకు అధ్యక్షత్వము నుండి సమాచారాన్ని అందించడానికి వార్డు నిర్మాణాల అధ్యక్షత్వములతో క్రమం తప్పకుండా సంభాషించడం.

  • స్టేకు నాయకత్వ సమావేశాల సమయంలో వార్డు నిర్మాణాల అధ్యక్షత్వాలకు సూచనలివ్వడం (29.3.4 చూడండి).

6.7.2

స్టేకు యువకుల అధ్యక్షత్వము

స్టేకు యువకుల అధ్యక్షత్వము క్రింది బాధ్యతలను కలిగి ఉంటారు:

  • అహరోను యాజకత్వ సహోదరుల కొరకు వారి బాధ్యతలలో బిషప్రిక్కులకు ఒక వనరుగా సేవ చేయడం.

  • స్టేకు యువజన నాయకత్వ కమిటీలో పని చేయడం (29.3.10 చూడండి).

  • స్టేకు అధ్యక్షత్వము యొక్క ఆధ్వర్యంలో, స్టేకు అహరోను యాజకత్వ ప్రోత్సాహ కార్యక్రమాలు మరియు శిబిరాలను ప్రణాళిక చేయడం మరియు సమన్వయం చేయడం.