“7. బిషప్రిక్కు,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు (2023).
“7. బిషప్రిక్కు,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు.
7.
బిషప్రిక్కు
7.1
బిషప్పు మరియు అతని సలహాదారులు
బిషప్పు వార్డులో సంఘ కార్యమును నడిపించడానికి యాజకత్వ తాళపుచెవులను కలిగి ఉన్నారు (3.4.1 చూడండి). అతను మరియు అతని సలహాదారులు బిషప్రిక్కును ఏర్పరుస్తారు.
బిషప్పుకు ఐదు ప్రధాన బాధ్యతలు ఉన్నాయి:
-
అతను వార్డులో అధ్యక్షత్వము వహించు ప్రధాన యాజకుడు.
-
అతను అహరోను యాజకత్వము యొక్క అధ్యక్షుడు.
-
అతను ఉమ్మడి న్యాయాధిపతి.
-
అతను అవసరంలో ఉన్నవారిని చూసుకోవడంతో పాటు రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యమును సమన్వయం చేస్తాడు.
-
అతను రికార్డులు, ఆర్థిక వ్యవహారాలు మరియు సమావేశ మందిరం యొక్క ఉపయోగాలను పర్యవేక్షిస్తాడు.
వార్డులో భావి తరాలపట్ల (పిల్లలు, యువత మరియు ఒంటరి వయోజనులు) బిషప్పు ప్రధాన బాధ్యత కలిగి ఉన్నారు. ఈ బాధ్యతపై దృష్టి కేంద్రీకరించడానికి, అతను అనేక నియామకాలను అప్పగిస్తాడు (4.2.5 చూడండి).
7.1.1
అధ్యక్షత్వము వహించు ప్రధాన యాజకుడు
బిషప్పు వార్డు యొక్క ముఖ్యమైన ఆధ్యాత్మిక నాయకుడు.
7.1.1.1
వార్డు నిర్మాణాలు మరియు యాజకత్వ సమూహములు
బిషప్పుకు వార్డు ఉపశమన సమాజము మరియు యువతుల నిర్మాణాల బాధ్యత ఉంది. అతను ఆదివారపు బడి, ప్రాథమిక నిర్మాణాలు మరియు ఇతర వార్డు కార్యక్రమాల బాధ్యతను తన సలహాదారులకు అప్పగిస్తాడు.
అహరోను యాజకత్వ సమూహముల కొరకు బిషప్పు బాధ్యతలు 7.1.2 లో వివరించబడ్డాయి. పెద్దల సమూహముల కొరకు అతని బాధ్యతలు 8.3.1 లో వివరించబడ్డాయి.
7.1.1.2
విధులు మరియు దీవెనలు
వార్డులో క్రింది విధులు మరియు దీవెనల నిర్వహణను బిషప్పు నిర్దేశిస్తారు:
-
సంస్కారము
-
పిల్లలకు నామకరణం చేయడం మరియు దీవించడం
-
రికార్డులలో ఉన్న 8 ఏళ్ళ పిల్లల బాప్తిస్మము మరియు నిర్ధారణ (పరివర్తన చెందినవారి కొరకు, 31.2.3.2 చూడండి)
-
అహరోను యాజకత్వమును అనుగ్రహించడం మరియు పరిచారకుడు, బోధకుడు మరియు యాజకుల స్థానాలకు నియమించడం.
7.1.1.3
సలహాసభలు మరియు సమావేశాలు
బిషప్పు వార్డు సలహాసభలకు మరియు వార్డు యువజన సలహాసభలకు నాయకత్వం వహిస్తారు (29.2.5 మరియు 29.2.6 చూడండి).
బిషప్రిక్కు సంస్కార సమావేశాలు మరియు 29వ అధ్యాయంలో జాబితా చేయబడిన ఇతర వార్డు సమావేశాలను ప్రణాళిక చేస్తారు.
7.1.1.4
పిలుపులు మరియు విడుదలలు
పిలుపులు మరియు విడుదలల కోసం బిషప్పు యొక్క బాధ్యతలు 30వ అధ్యాయంలో వివరించబడ్డాయి.
7.1.2
అహరోను యాజకత్వ అధ్యక్షుడు
వార్డులోని అహరోను యాజకత్వ అధ్యక్షుడిగా బిషప్పు క్రింది బాధ్యతలను కలిగి ఉన్నారు. అతని సలహాదారులు అతనికి సహాయం చేస్తారు.
-
యువజనులకు బోధించడంలో తల్లిదండ్రులకు మద్దతు ఇస్తారు.
-
అహరోను యాజకత్వ సమూహములను మరియు యువతుల తరగతులను పర్యవేక్షిస్తారు. బిషప్పు యాజకుల సమూహమునకు అధ్యక్షుడు (సిద్ధాంతము మరియు నిబంధనలు 107:87–88 చూడండి). అతని మొదటి సలహాదారుడు బోధకుల సమూహమునకు బాధ్యత వహిస్తారు. అతని రెండవ సలహాదారుడు పరిచారకుల సమూహమునకు బాధ్యత వహిస్తారు.
-
వార్డు యువతుల అధ్యక్షురాలితో ఆలోచన చేస్తారు
-
ప్రతీ యువతి యువకునితో క్రమం తప్పకుండా కలుస్తారు.
7.1.3
ఉమ్మడి న్యాయాధిపతి
వార్డులో బిషప్పు ఉమ్మడి న్యాయాధిపతి (సిద్ధాంతము మరియు నిబంధనలు 107:71–74 చూడండి). ఆయన ఈ క్రింది బాధ్యతలను కలిగి ఉన్నారు:
-
యువజనులు మరియు పెద్దలు దేవాలయ సిఫారసుకు అర్హత పొందేందుకు మరియు యోగ్యత కలిగియుండేందుకు సహాయం చేస్తారు.
-
31.2 లో వివరించిన విధంగా మౌఖికాలను నిర్వహిస్తారు.
-
ఆధ్యాత్మిక మార్గనిర్దేశాన్ని కోరుకునే వారిని, బరువైన వ్యక్తిగత సమస్యలు ఉన్నవారిని లేదా తీవ్రమైన పాపాలు చేసిన వార్డు సభ్యులను కలుస్తారు, యేసు క్రీస్తు యొక్క స్వస్థత శక్తిని పొందడంలో వారికి సహాయపడతారు.
-
స్టేకు అధ్యక్షుని ఆధ్వర్యంలో, అవసరమైన మేరకు సభ్యత్వ సలహాసభలను నిర్వహిస్తారు. మార్గదర్శకాల కోసం, 32వ అధ్యాయం చూడండి.
7.1.4
రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యమును సమన్వయం చేయడం
వార్డులో రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యమును బిషప్పు సమన్వయం చేస్తారు (1వ అధ్యాయం చూడండి). అతని సలహాదారులు మరియు ఇతర వార్డు నాయకులు అతనికి సహాయం చేస్తారు.
7.1.4.1
తాత్కాలిక అవసరాలు ఉన్నవారి కోసం శ్రద్ధ వహించడానికి ప్రయత్నాలు చేయడం
అవసరంలో ఉన్న వారిని బిషప్పు ఎలా చూసుకుంటారు అనే దాని గురించి మరింత సమాచారం కోసం, 22.6.1 చూడండి.
7.1.5
రికార్డులు, ఆర్థిక వ్యవహారాలు మరియు సమావేశ మందిరం
రికార్డుల సమాచారం కోసం, 33వ అధ్యాయం చూడండి. దశమభాగంతో సహా ఆర్థిక వ్యవహారాల సమాచారం కోసం, 34వ అధ్యాయం చూడండి. సమావేశ మందిరాల సమాచారం కోసం, 35వ అధ్యాయం చూడండి.
7.3
వార్డు కార్యనిర్వాహక కార్యదర్శి మరియు వార్డు సహాయక కార్యనిర్వాహక కార్యదర్శులు
వార్డు కార్యనిర్వాహక కార్యదర్శిగా సేవచేయడానికి మెల్కీసెదెకు యాజకత్వము కలిగియున్న ఒకరిని బిషప్రిక్కు సిఫార్సు చేస్తారు.
అతను ఈ క్రింది బాధ్యతలను కలిగి ఉన్నాడు:
-
బిషప్రిక్కుతో సమావేశమై, నియమించబడిన విధంగా చర్చనీయాంశముల జాబితాలను సిద్ధం చేస్తారు.
-
వార్డు సలహాసభ సభ్యునిగా పని చేస్తారు మరియు వార్డు సలహాసభ సమావేశాలకు హాజరవుతారు.
-
బిషప్రిక్కు కొరకు సమావేశాలను ఏర్పాటు చేస్తారు.
7.4
వార్డు గుమాస్తా మరియు వార్డు సహాయక గుమాస్తాలు
వార్డు గుమాస్తా మరియు వార్డు సహాయక గుమాస్తాల యొక్క బాధ్యతలు 33.4.2 లో వివరించబడ్డాయి.