చేతి పుస్తకములు మరియు పిలుపులు
29 సంఘములో సమావేశాలు


“29. సంఘములో సమావేశాలు,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు (2023).

“29. సంఘములో సమావేశాలు,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు

సంస్కార కూడికలో తల్లి మరియు కుమార్తె

29.

సంఘములో సమావేశాలు

29.0

పరిచయము

ఆరాధన, ఒకరినొకరు మెరుగుపరచుకోవడం, సువార్త బోధించడం మరియు నేర్చుకోవడం కోసం కడవరి దిన పరిశుద్ధులు కలుసుకుంటారు (ఆల్మా 6:6; మొరోనై 6:5–6 చూడండి). “ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని” రక్షకుడు వాగ్దానం చేసారు (మత్తయి 18:20). మన హృదయములు “ఐక్యతయందును, ప్రేమయందును ముడివేయబడునట్లు” వుండుటకు కలిసి సమావేశమవ్వడం ఒక మార్గం (మోషైయ 18:21).

అయితే, ఒక సమావేశాన్ని నిర్వహించడం యేసు క్రీస్తు చేసినట్లుగా సేవ చేయడాన్ని మరియు పరిచర్య చేయడాన్ని భర్తీ చేయకూడదు.

29.1

సమావేశాలను ప్రణాళిక చేయడం మరియు నిర్వహించడం

“దేవుని ఆజ్ఞలు మరియు బయల్పాటుల ప్రకారం, వారు పరిశుద్ధాత్మచేత నడిపించబడినట్లుగా” నాయకులు సమావేశాలను ప్రణాళిక చేస్తారు మరియు నిర్వహిస్తారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:45; మొరోనై 6:9; సిద్ధాంతము మరియు నిబంధనలు 46:2 కూడా చూడండి). వారు తమ సమావేశాలలో ఆత్మ యొక్క ప్రభావాన్ని ఆహ్వానించడానికి మార్గాలను అన్వేషిస్తారు.

సమావేశాల సంఖ్య మరియు నిడివి సభ్యులు లేదా వారి కుటుంబాలపై భారం కాకుండా నాయకులు నిర్ధారిస్తారు.

29.2

వార్డు సమావేశాలు

29.2.1

సంస్కార కూడిక

29.2.1.1

సంస్కార కూడికను ప్రణాళిక చేయడం

బిషప్రిక్కు సంస్కార కూడికను ప్రణాళిక చేసి నిర్వహిస్తారు. కూడిక యొక్క దృష్టి సంస్కారంపై మరియు యేసు క్రీస్తుపై విశ్వాసాన్ని పెంపొందించడంపై ఉండేలా వారు నిర్ధారిస్తారు.

సంస్కార కూడిక ఒక గంట ఉంటుంది. ఇది క్రింది వాటిని కలిగి ఉండవచ్చు:

  1. ప్రారంభ సంగీతం (మార్గదర్శకాల కోసం 19.3.2 చూడండి).

  2. పలకరించుట మరియు స్వాగతించుట.

  3. అధ్యక్షత్వం వహించే అధికారులను లేదా సందర్శించే ఇతర నాయకులను గుర్తించుట.

  4. ప్రకటనలు. వీటిని తక్కువగా ఉంచాలి.

  5. ప్రారంభ కీర్తన మరియు ప్రార్థన. 19.3.2 మరియు 29.6 చూడండి.

  6. ఈ క్రింది వంటి, వార్డు మరియు స్టేకు వ్యవహారములు:

    • అధికారులను మరియు బోధకులను ఆమోదించడం మరియు విడుదల చేయడం (30.3 మరియు 30.6 చూడండి).

    • అహరోను యాజకత్వములో ఒక స్థానానికి నియమించబడే సహోదరుల పేర్లను సమర్పించడం (18.10.3 చూడండి).

    • ఇటీవల పరివర్తన చెందిన వారితో సహా క్రొత్త వార్డు సభ్యులను గుర్తించడం.

  7. బిడ్డలకు నామకరణం చేయడం మరియు దీవించడం (18.6 చూడండి). ఇది సాధారణంగా ఉపవాసము మరియు సాక్ష్యపు సమావేశాలలో జరుగుతుంది (29.2.2 చూడండి).

  8. క్రొత్తగా పరివర్తన చెందినవారిని నిర్ధారించడం (18.8 చూడండి).

  9. సంస్కార కీర్తన మరియు సంస్కారం యొక్క నిర్వహణ. కూడికకు సంస్కారము ప్రధానము. ఈ విధి సభ్యులు తమ ఆలోచనలను రక్షకుని వైపు మరియు వారి కోసం ఆయన చేసిన త్యాగం వైపు మళ్లించడానికి ఒక అవకాశం.

    సంస్కారమును సిద్ధం చేయడం, దీవించడం మరియు అందించడం గురించి మరింత తెలుసుకోవడానికి, 18.9 చూడండి.

  10. సువార్త సందేశాలు మరియు సామూహిక గానం లేదా ఇతర సంగీతం.

  11. ముగింపు కీర్తన మరియు ప్రార్థన.

  12. ముగింపు సంగీతం.

29.2.1.4

ప్రసంగీకులను ఎంచుకోవడం

సంస్కార కూడికలో ప్రసంగీకులను బిషప్రిక్కు ఎంపిక చేస్తారు. చాలా తరచుగా వారు యువతతో సహా వార్డు సభ్యులను ఆహ్వానిస్తారు.

ప్రసంగీకులు యేసు క్రీస్తుకు సాక్ష్యమిస్తారు మరియు లేఖనాలను ఉపయోగించి ఆయన సువార్తను బోధిస్తారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 42:12; 52:9 చూడండి).

29.2.2

ఉపవాసము మరియు సాక్ష్యపు సమావేశము

ఉపవాసము మరియు సాక్ష్యపు సమావేశంలో, నియమించబడిన ప్రసంగీకులు లేదా ప్రత్యేక సంగీత ఎంపికలు లేవు. బదులుగా, నిర్వహించే వ్యక్తి సంక్షిప్త సాక్ష్యాన్ని పంచుకుంటాడు. ఆ తర్వాత ఆయన సమావేశంలోని సభ్యులను వారి సాక్ష్యాలు చెప్పమని ఆహ్వానిస్తాడు. సాక్ష్యమివ్వడం అంటే పరిశుద్ధాత్మచేత ప్రేరేపించబడిన విధంగా సువార్త సత్యాలను ప్రకటించడం.

29.2.3

వార్డు సభ్యసమావేశము

29.2.4

బిషప్రిక్కు సమావేశము

పరిగణనలోనికి తీసుకోవలసిన అంశాలు:

  • వార్డులో రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యమును సమన్వయం చేయడం.

  • వార్డులోని వ్యక్తులు మరియు కుటుంబాలను ముఖ్యంగా యువత మరియు పిల్లలను బలోపేతం చేయడం.

  • యాజకత్వ నియామకాలతో సహా విధులను పొందడానికి సిద్ధపడగల సభ్యులను గుర్తించడం.

  • వార్డులో స్థానాలకు పిలవడానికి సభ్యులను గుర్తించడం.

29.2.5

వార్డు సలహాసభ సమావేశం

బిషప్పు వార్డు సలహాసభ సమావేశాలను ప్రణాళిక చేస్తారు, అధ్యక్షత్వం వహిస్తారు మరియు నిర్వహిస్తారు. బిషప్పు లేకుండా సలహాసభ ప్రధాన నిర్ణయాలు తీసుకోదు.

వార్డు నిర్మాణాల నాయకులు రెండు హోదాల్లో వార్డు సలహాసభ సమావేశాలకు హాజరవుతారు:

  1. వార్డు సభ్యులందరినీ దీవించడానికి సహాయం చేసే వార్డు సలహాసభ సభ్యులుగా.

  2. వారి నిర్మాణాల ప్రతినిధులుగా.

వారు కలిసి సమావేశమైనప్పుడు, వార్డు సలహాసభ సభ్యులు మొత్తం సలహాసభ యొక్క ఏకీకృత ప్రయత్నాల నుండి ప్రయోజనం పొందే విషయాలను చర్చిస్తారు. ప్రతి సలహాసభ సభ్యుడు ఈ విషయాలపై అతని లేదా ఆమె ఆలోచనలను మరియు ప్రేరణను పంచుకోవడానికి ప్రోత్సహించబడతారు.

వార్డు సలహాసభ సమావేశాలు సాధారణంగా ఒక గంట కంటే ఎక్కువ సమయం ఉండవు. వారు ప్రార్థన మరియు మునుపటి సమావేశాల నుండి నియామకములపై సంక్షిప్త నివేదికలతో ప్రారంభిస్తారు. వ్యక్తులు మరియు కుటుంబాలను దీవించడానికి అత్యంత అవసరమైన విషయాలకు బిషప్పు ప్రాధాన్యతనిస్తారు.

  • యేసు క్రీస్తు సువార్తను జీవించడం. విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి, రక్షణ విధులను పొందడానికి మరియు వారి నిబంధనలను పాటించడానికి సభ్యులందరికీ సహాయపడడం.

  • అవసరంలో ఉన్నవారిని ఆదుకోవటం. వ్యక్తులు, కుటుంబాలు మరియు సమాజాన్ని దీవించడానికి వనరులు మరియు నైపుణ్యాలను పంచుకోవడం. వార్డు సభ్యులు స్వావలంబన సాధించడానికి సహాయం చేయడం. (22వ అధ్యాయం చూడండి.)

  • అందరినీ సువార్తను స్వీకరించమని ఆహ్వానించడం. సువార్త గురించి నేర్చుకుంటున్న వారు, అలాగే క్రొత్త మరియు తిరిగి వచ్చే సభ్యుల పురోగతిని సమీక్షించడం. సభ్యులు ఇతరులతో సువార్తను పంచుకోగల మార్గాలను చర్చించడం. (23వ అధ్యాయం చూడండి.)

  • నిత్యత్వము కొరకు కుటుంబాలను ఏకం చేయడం. దేవాలయ విధులు పొందడానికి సిద్ధమవుతున్న సభ్యుల పురోగతిని సమీక్షించడం. దేవాలయ సిఫారసుకు అర్హత సాధించడానికి ఎక్కువ మంది సభ్యులకు సహాయపడే మార్గాలను ప్రణాళిక చేయడం. దేవాలయం మరియు కుటుంబ చరిత్ర కార్యములో సభ్యులు పాల్గొనగల మార్గాలను చర్చించడం. (25వ అధ్యాయం చూడండి.)

సలహాసభ సభ్యులు ఏదైనా వ్యక్తిగతమైన లేదా సున్నితమైన సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి (4.4.6 చూడండి).

4:37

29.2.6

వార్డు యువజన సలహాసభ సమావేశము

ప్రతి సమావేశానికి ముందు, బిషప్పు మరియు నిర్వహించే వ్యక్తి చర్చించవలసిన అంశాలను సమీక్షిస్తారు.

  • రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యము.

  • వార్డులో యువత అవసరాలు మరియు వాటిని పరిష్కరించే మార్గాలు.

  • తక్కువ చురుకుగా ఉన్న లేదా క్రొత్త సభ్యులైన యువతను చేరుకోవడానికి ప్రయత్నాలు.

  • అవసరమైన వారికి సేవ చేసే అవకాశాలతోపాటు ప్రోత్సాహ కార్యక్రమాలు. ప్రణాళికలో ఎక్కువ భాగం సమూహము లేదా తరగతి అధ్యక్షత్వ సమావేశాలలో జరుగుతుంది (20వ అధ్యాయం చూడండి).

  • పరిచర్య (21వ అధ్యాయం చూడండి).

  • క్రొత్త సమూహ మరియు తరగతి అధ్యక్షత్వములకు దిశానిర్దేశం చేయడం.

29.2.8

ఆదివారం సమావేశాల కార్యక్రమ వివరణ

ఆదివారం సమావేశాల కోసం వార్డులు క్రింది రెండు గంటల కార్యక్రమ వివరణలలో ఒకదాన్ని ఉపయోగిస్తాయి.

ప్రణాళిక 1

60 నిమిషాలు

సంస్కార కూడిక

10 నిమిషాలు

తరగతులు మరియు సమావేశాలకు మారడం

50 నిమిషాలు

అన్ని ఆదివారాలు: నర్సరీతో సహా ప్రాథమిక

నెలలో మొదటి మరియు మూడవ ఆదివారాలు: ఆదివారపు బడి

రెండవ మరియు నాల్గవ ఆదివారాలు: యాజకత్వ సమూహ సమావేశాలు, ఉపశమన సమాజ సమావేశాలు మరియు యువతుల సమావేశాలు.

ఐదవ ఆదివారాలు: యువత మరియు పెద్దల కోసం సమావేశాలు. బిషప్రిక్కు అంశాన్ని నిర్ణయిస్తారు మరియు బోధకులను నియమిస్తారు.

ప్రణాళిక 2

50 నిమిషాలు

అన్ని ఆదివారాలు: నర్సరీతో సహా ప్రాథమిక

నెలలో మొదటి మరియు మూడవ ఆదివారాలు: ఆదివారపు బడి

రెండవ మరియు నాల్గవ ఆదివారాలు: యాజకత్వ సమూహ సమావేశాలు, ఉపశమన సమాజ సమావేశాలు మరియు యువతుల సమావేశాలు.

ఐదవ ఆదివారాలు: యువత మరియు పెద్దల కోసం సమావేశాలు. బిషప్రిక్కు అంశాన్ని నిర్ణయిస్తారు మరియు బోధకులను నియమిస్తారు.

10 నిమిషాలు

సంస్కార కూడికకు మారడం

60 నిమిషాలు

సంస్కార కూడిక

29.3

స్టేకు సమావేశాలు

29.3.1

స్టేకు సభ్యసమావేశం

29.3.2

స్టేకు ప్రధాన యాజకత్వ సమావేశము

29.3.3

స్టేకు యాజకత్వపు నాయకత్వ సమావేశము

29.3.4

స్టేకు నాయకత్వ సమావేశాలు

29.3.5

స్టేకు ప్రధాన యాజకుల సమూహ సమావేశము

29.3.6

స్టేకు అధ్యక్షత్వ సమావేశము

29.3.7

ఉన్నత సలహామండలి సమావేశము

29.3.8

స్టేకు సలహాసభ సమావేశము

29.3.9

స్టేకు పెద్దల నాయకత్వ సమితి సమావేశము

29.3.10

స్టేకు యువజన నాయకత్వ సమితి సమావేశము

29.3.11

స్టేకు బిషప్పుల సలహాసభ సమావేశము

29.5

మరణించిన వారికి అంత్యక్రియలు మరియు ఇతర సేవలు

29.5.1

ప్రధాన సూత్రాలు

మరణించినవారి కోసం సంఘ సేవల యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం రక్షణ ప్రణాళిక గురించి, ముఖ్యంగా రక్షకుని ప్రాయశ్చిత్తం మరియు పునరుత్థానం గురించి సాక్ష్యమివ్వడం. ఈ సేవలు గౌరవప్రదమైన, ఆధ్యాత్మిక అనుభవాలుగా ఉండాలి.

సంఘ నాయకులు మరణించినవారి కోసం సంఘ సేవల్లో ఇతర మతాలు లేదా సమూహాల ఆచారాలను చేర్చకూడదు.

29.5.2

కుటుంబానికి సహాయాన్ని అందివ్వడం

యేసు క్రీస్తు శిష్యులుగా, సంఘ నాయకులు మరియు సభ్యులు “దుఃఖించు వారితో దుఃఖపడతారు … మరియు ఆదరణ యొక్క అవసరములో ఉన్నవారిని ఆదరిస్తారు” (మోషైయ 18:9). ఒక సభ్యుడు మరణించినప్పుడు, బిషప్పు ఓదార్పునిచ్చేందుకు కుటుంబాన్ని సందర్శిస్తారు.

బిషప్పు పెద్దల సమూహము మరియు ఉపశమన సమాజముతో సహా వార్డు సభ్యుల నుండి సహాయాన్ని అందిస్తారు.

29.5.4

అంత్యక్రియల సేవలు (ఆచారం ఉన్నచోట)

సంఘ భవనంలో లేదా మరెక్కడైనా బిషప్పు నిర్వహించే అంత్యక్రియలు ఒక సంఘ సమావేశము మరియు మతపరమైన సేవ అయ్యున్నది. ఇది ఆధ్యాత్మిక సందర్భం కావాలి.

అంత్యక్రియలను సకాలంలో ప్రారంభించాలి. సాధారణంగా, హాజరైన వారిపట్ల మర్యాదతో అవి 1.5 గంటల కంటే ఎక్కువ ఉండకూడదు.

అంత్యక్రియలు సాధారణంగా ఆదివారం నిర్వహించబడవు.

29.6

సంఘ సమావేశాలలో ప్రార్థనలు

సంఘ సమావేశాలలో ప్రార్థనలు క్లుప్తంగా, సరళంగా ఉండాలి మరియు ఆత్మచే నిర్దేశించబడాలి. బాప్తిస్మము పొందిన సంఘ సభ్యుడు ఎవరైనా ప్రారంభ లేదా ముగింపు ప్రార్థన చేయవచ్చు. బాప్తిస్మము పొందని పిల్లలు ప్రాథమికలో ప్రార్థన చేయవచ్చు.

29.7

సమావేశాలను ప్రసారం చేయడం మరియు వర్చువల్ సమావేశాలను నిర్వహించడం

మినహాయింపుగా, సమావేశ మందిరంలో జరిగే సంస్కార కూడికలు, అంత్యక్రియలు మరియు వివాహాల ప్రత్యక్ష ప్రసారానికి బిషప్పు అధికారం ఇవ్వవచ్చు.

సంస్కార కూడికల యొక్క ప్రత్యక్ష ప్రసారం సంస్కారము యొక్క నిర్వహణను కలిగి ఉండకూడదు.

కొన్ని సమావేశాలకు, వ్యక్తిగతంగా హాజరుకాలేని సభ్యులు వర్చువల్‌గా పాల్గొనడానికి బిషప్పు లేదా స్టేకు అధ్యక్షుడు అధికారం ఇవ్వవచ్చు. ఈ సమావేశాలు వీటిని కలిగి ఉండవచ్చు:

  • అధ్యక్షత్వము లేదా సలహాసభ సమావేశాలు వంటి నాయకత్వ సమావేశాలు.

  • సమూహము, ఉపశమన సమాజము మరియు యువతుల సమావేశాలు.

  • ఆదివారపు బడి తరగతులు.

  • ప్రాథమిక తరగతులు మరియు పాడే సమయం.