“28. మరణించిన వారి కొరకు దేవాలయ విధులు,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు (2023).
“28. మరణించిన వారి కొరకు దేవాలయ విధులు,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు
28.
మరణించిన వారి కొరకు దేవాలయ విధులు
28.0
పరిచయం
దేవాలయాలలో నిర్వహించబడే విధులు కుటుంబాలు నిత్యత్వము కొరకు కలిసి ఉండడానికి మరియు దేవుని సన్నిధిలో సంపూర్ణ ఆనందాన్ని అనుభవించడానికి వీలు కల్పిస్తాయి.
పరలోక తండ్రి పిల్లలు ఆయన వద్దకు తిరిగి వెళ్ళాలంటే, వారిలో ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపపడాలి, రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క విధులను పొందడానికి అర్హులు కావాలి మరియు ప్రతీ విధికి సంబంధించిన నిబంధనలను గౌరవించాలి.
ఆయన పిల్లలలో చాలామంది తమ మర్త్య జీవితాలలో ఈ విధులను పొందరని పరలోక తండ్రికి తెలుసు. వారు విధులను పొందడానికి మరియు ఆయనతో నిబంధనలు చేయడానికి ఆయన మరొక మార్గాన్ని అందించారు. దేవాలయాలలో, ప్రాతినిధ్యం వహించు వ్యక్తి ద్వారా విధులను నిర్వహించవచ్చు. దాని అర్థం మరణించిన ఒక వ్యక్తి తరఫున జీవించి ఉన్న ఒక వ్యక్తి విధులను పొందుతాడు. ఆత్మ లోకంలో, మరణించిన వ్యక్తులు వారి కోసం నిర్వహించబడిన విధులను అంగీకరించడానికి లేదా తిరస్కరించడానికి ఎంచుకోవచ్చు (సిద్ధాంతము మరియు నిబంధనలు 138:19, 32–34, 58–59 చూడండి).
రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క విధులను పొందకుండా మరణించిన బంధువులను గుర్తించడానికి సంఘ సభ్యులు ప్రోత్సహించబడ్డారు. తరువాత సభ్యులు ఆ బంధువుల తరఫున విధులను నిర్వహిస్తారు.
సభ్యులు దేవాలయ కార్యము కోసం ఇంటి పేర్లను సిద్ధం చేయకపోతే (28.1.1 చూడండి), విధులు అవసరమైన మరణించిన వ్యక్తుల పేర్లు దేవాలయంలో అందించబడతాయి.
28.1
ప్రాతినిధ్య విధులను నిర్వహించడానికి సాధారణ మార్గదర్శకాలు
వారు మరణించే సమయంలో 8 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మరణించిన వ్యక్తుల తరఫున ప్రాతినిధ్య విధులను నిర్వహించవచ్చు. 28.3 లో పేర్కొనబడినవి మినహా, క్రింది వాటిలో దేనినైనా వర్తింపజేస్తే, మరణించిన వ్యక్తులందరికీ వారు మరణించిన తేదీ నుండి 30 రోజులు దాటిన వెంటనే ప్రాతినిధ్య విధులు నిర్వహించబడవచ్చు:
-
మరణించినవారి దగ్గరి బంధువు (విడాకులు తీసుకోని జీవిత భాగస్వామి, వయోజన పిల్లలు, తల్లిదండ్రులు లేదా తోబుట్టువులు) దేవాలయ విధుల కోసం పేరును సమర్పించినప్పుడు.
-
మరణించినవారి దగ్గరి బంధువు (విడాకులు తీసుకోని జీవిత భాగస్వామి, వయోజన పిల్లలు, తల్లిదండ్రులు లేదా తోబుట్టువులు) నుండి విధులను నిర్వహించడానికి అనుమతి పొందబడినప్పుడు.
పైన పేర్కొన్న షరతుల్లో ఏదీ వర్తించకపోతే, మరణించిన వ్యక్తి జన్మించిన 110 సంవత్సరాల తర్వాత ప్రాతినిధ్య దేవాలయ విధులు నిర్వహించబడవచ్చు.
28.1.1
దేవాలయ విధుల కోసం మరణించిన వ్యక్తుల పేర్లను సిద్ధం చేయడం
సాధ్యమైన చోట, మరణించిన కుటుంబ సభ్యులను గుర్తించే సమాచారాన్ని దేవాలయ విధులను నిర్వహించే ముందు FamilySearch.org లో నమోదు చేయాలి (25.4.2 చూడండి).
28.1.1.1
కుటుంబ సభ్యుల పేర్లను సమర్పించడం
ప్రాతినిధ్య దేవాలయ విధుల కోసం పేర్లను సమర్పించేటప్పుడు, సభ్యులు సాధారణంగా తమకు సంబంధించిన వ్యక్తుల పేర్లను మాత్రమే సమర్పించాలి.
28.1.2
మరణించిన వారి కోసం విధులలో ఎవరు పాల్గొనవచ్చు
ప్రస్తుత దేవాలయ సిఫారసు కలిగి ఉన్న సభ్యులందరూ మరణించిన వారి కోసం బాప్తిస్మములో మరియు నిర్ధారణలో పాల్గొనవచ్చు. ప్రస్తుత దేవాలయ సిఫారసు కలిగియుండి, వరము పొందిన సభ్యులు మరణించిన వారి కోసం అన్ని విధులలో పాల్గొనవచ్చు. 26.3 చూడండి.
28.1.4
షెడ్యూల్ చేయడం
మరణించిన వారి కోసం విధులను నిర్వహించడానికి ముందు సభ్యులు నిర్ణీత సమయం తీసుకోవలసి ఉంటుంది. ప్రతీ దేవాలయ సంప్రదింపు సమాచారం మరియు షెడ్యూల్ అవసరాల కోసం temples.ChurchofJesusChrist.org ని చూడండి.
28.2
మరణించిన వ్యక్తుల కోసం దేవాలయ విధులను నిర్వహించడం
ప్రాతినిధ్య విధులను నిర్వహిస్తున్నప్పుడు, ఒక సభ్యుడు అదే లింగానికి చెందిన మరణించిన వ్యక్తి కొరకు మాత్రమే ప్రాతినిధ్యం వహించు వ్యక్తిగా వ్యవహరించవచ్చు.
28.2.1
మరణించిన వారి కొరకు బాప్తిస్మములు మరియు నిర్ధారణలు
ప్రస్తుత దేవాలయ సిఫారసు కలిగి ఉన్న ఏ సభ్యుడు అయినా బాప్తిస్మపు నియామకములలో సేవ చేయడానికి ఆహ్వానించబడవచ్చు. కొన్ని నియామకములు వీటిని కలిగి ఉండవచ్చు:
-
బాప్తిస్మములు మరియు నిర్ధారణల కొరకు ప్రాతినిధ్యం వహించు వ్యక్తిగా వ్యవహరించడం.
-
ప్రాతినిధ్య బాప్తిస్మములకు సాక్షిగా వ్యవహరించడం.
-
సంరక్షకులకు సహాయం చేయడం.
మెల్కీసెదెకు యాజకత్వము కలిగియున్నవారు మరియు అహరోను యాజకత్వములోని యాజకులు మరణించిన వారి కొరకు బాప్తిస్మములు ఇవ్వడానికి ఆహ్వానించబడవచ్చు. మెల్కీసెదెకు యాజకత్వము కలిగియున్నవారు మరణించిన వారి కోసం నిర్ధారణలను నిర్వహించడానికి కూడా ఆహ్వానించబడవచ్చు.
వరము పొందిన పురుషులు మాత్రమే వీటికి ఆహ్వానించబడతారు:
-
బాప్తిస్మము తొట్టి వద్ద నమోదుచేసే వ్యక్తిగా సేవ చేయడానికి.
-
నిర్ధారణలను నమోదుచేసే వ్యక్తిగా సేవ చేయడానికి.
28.2.2
వరము (ఆరంభవిధితో సహా)
మరణించినవారి కోసం ప్రాతినిధ్య వరములను నిర్వహిస్తున్నప్పుడు, వరముల యొక్క ఆరంభవిధి ప్రత్యేకంగా నిర్వహించబడుతుంది మరియు నమోదు చేయబడుతుంది (27.2 చూడండి). ప్రస్తుత దేవాలయ సిఫారసు కలిగియుండి, వరము పొందిన సభ్యులు ఎవరైనా ఈ విధులను పొందడానికి ప్రాతినిధ్యం వహించు వ్యక్తిగా వ్యవహరించవచ్చు.
28.2.3
జీవిత భాగస్వామితో ముద్రవేయబడడం మరియు పిల్లలను తల్లిదండ్రులతో ముద్రవేయడం
దేవాలయంలో, మరణించిన వ్యక్తులు జీవితంలో వివాహం చేసుకున్న జీవిత భాగస్వాములతో ముద్ర వేయబడవచ్చు. మరణించిన వ్యక్తులు జీవించి ఉన్న లేదా మరణించిన తమ పిల్లలతో కూడా ముద్ర వేయబడవచ్చు. ప్రస్తుత దేవాలయ సిఫారసు కలిగియుండి, వరము పొందిన సభ్యుడు ముద్ర విధుల కొరకు ప్రాతినిధ్యం వహించు వ్యక్తిగా వ్యవహరించవచ్చు.
28.3
ప్రత్యేక పరిస్థితులు
ఈ విభాగం 28.1 లోని కొన్ని మార్గదర్శకాలు వర్తించని పరిస్థితులను వివరిస్తుంది.
28.3.1
పుట్టకముందే మరణించిన పిల్లలు (నిర్జీవంగా పుట్టిన మరియు గర్భస్రావం అయిన పిల్లలు)
పుట్టకముందే మరణించిన పిల్లలకు దేవాలయ విధులు అవసరం లేదు లేదా నిర్వహించబడవు. మరింత సమాచారం కోసం, 38.7.3 చూడండి.
28.3.2
ఎనిమిది సంవత్సరాల వయస్సు కంటే ముందే మరణించిన పిల్లలు
చిన్న పిల్లలు యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం ద్వారా విమోచించబడ్డారు మరియు “పరలోకపు సిలెస్టియల్ రాజ్యములో రక్షింపబడ్డారు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 137:10). ఈ కారణంగా, 8 సంవత్సరాల కంటే ముందు మరణించిన పిల్లలకు బాప్తిస్మము లేదా వరము నిర్వహించబడదు. ఏదేమైనప్పటికీ, నిబంధనలో జన్మించని లేదా జీవితంలో ఆ విధిని పొందని పిల్లలకు తల్లిదండ్రులతో ముద్రలు నిర్వహించబడవచ్చు (18.1 చూడండి).