“20. ప్రోత్సాహ కార్యక్రమాలు,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు (2023).
“20. ప్రోత్సాహ కార్యక్రమాలు,”ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు
20.
ప్రోత్సాహ కార్యక్రమాలు
20.1
ఉద్దేశ్యాలు
సంఘ ప్రోత్సాహ కార్యక్రమాలు సంఘ సభ్యులను మరియు ఇతరులను “పరిశుద్ధులతో ఏక పట్టణస్థులుగా” ఒకచోట చేర్చుతాయి (ఎఫెసీయులకు 2:19). ప్రోత్సాహ కార్యక్రమాల కోసం ఉద్దేశ్యాలు క్రింది వాటిని కలిగి ఉండవచ్చు:
-
యేసు క్రీస్తునందు విశ్వాసాన్ని పెంపొందించడం.
-
వినోదాన్ని అందించడం మరియు ఐక్యతను పెంపొందించడం.
-
వ్యక్తిగత వృద్ధికి అవకాశాలను అందించడం.
-
వ్యక్తులు మరియు కుటుంబాలను బలోపేతం చేయడం.
-
రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యములో పాల్గొనేందుకు సభ్యులకు సహాయం చేయడం (1.2 చూడండి).
20.2
ప్రోత్సాహ కార్యక్రమాలను ప్రణాళిక చేయడం
ఒక ప్రోత్సాహ కార్యక్రమమును ప్రణాళిక చేయడానికి ముందు, నాయకులు సభ్యుల ఆధ్యాత్మిక మరియు తాత్కాలిక అవసరాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఆ అవసరాలను తీర్చడంలో ఎలాంటి ప్రోత్సాహ కార్యక్రమం సహాయపడుతుందో నిర్ణయించేటప్పుడు నాయకులు ఆత్మ యొక్క మార్గదర్శకత్వాన్ని కోరుకుంటారు.
20.2.1
ప్రోత్సాహ కార్యక్రమాలను ప్రణాళిక చేయడానికి బాధ్యత
స్థానిక అవసరాల ఆధారంగా, వార్డు ప్రోత్సాహ కార్యక్రమాలను క్రింది మార్గాలలో దేనిలోనైనా ప్రణాళిక చేయవచ్చు:
-
వార్డు సలహాసభ ప్రణాళికను పర్యవేక్షించవచ్చు.
-
ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రోత్సాహ కార్యక్రమాలను ప్రణాళిక చేయడంలో సహాయపడటానికి వార్డు సలహాసభ నిర్దిష్ట నిర్మాణాలను నియమించవచ్చు.
-
అవసరమైనప్పుడు మరియు తగినంతమంది సభ్యులు ఉన్న చోట, బిషప్రిక్కు వార్డు ప్రోత్సాహ కార్యక్రమాల కమిటీని ఏర్పాటు చేయవచ్చు.
వార్డు యౌవనుల ప్రోత్సాహ కార్యక్రమాలను ప్రణాళిక చేయడం గురించి సమాచారం కొరకు, 10.2.1.3 మరియు 11.2.1.3 చూడండి.
20.2.2
అందరూ పాల్గొనవలసిందిగా ఆహ్వానించుట
ప్రోత్సాహ కార్యక్రమాలను ప్రణాళిక చేసే వారు అందరినీ, ముఖ్యంగా క్రొత్త సభ్యులు, తక్కువ చురుకైన సభ్యులు, యువత, ఒంటరి వయోజనులు, వైకల్యం ఉన్నవారు మరియు ఇతర విశ్వాసాలకు చెందిన వ్యక్తులను సమీపించాలి.
ప్రోత్సాహ కార్యక్రమాలు నాయకులపై మరియు సభ్యులపై అనవసరమైన భారం వేయకూడదు.
20.2.3
ప్రమాణాలు
సంఘ ప్రోత్సాహ కార్యక్రమాలు ఉద్ధరించేవిగా ఉండాలి మరియు “పవిత్రమైనది, రమ్యమైనది, ఖ్యాతిగలది లేదా పొగడదగినది” (విశ్వాస ప్రమాణాలు 1:13) ఏమిటో నొక్కి చెప్పాలి. ప్రోత్సాహ కార్యక్రమాలు సంఘ బోధనలకు విరుద్ధమైనదేదీ కలిగియుండకూడదు.
20.2.6
ప్రోత్సాహ కార్యక్రమాలకు నిధులు
చాలా ప్రోత్సాహ కార్యక్రమాలు సరళంగా ఉండాలి మరియు తక్కువ ఖర్చు లేదా ఖర్చు లేకుండా ఉండాలి. ఖర్చులన్నీ బిషప్రిక్కు లేదా స్టేకు అధ్యక్షత్వము చేత ముందుగానే ఆమోదించబడాలి.
ప్రోత్సాహ కార్యక్రమాలలో పాల్గొనేందుకు సభ్యులు సాధారణంగా ఎలాంటి పైకము చెల్లించకూడదు. ప్రోత్సాహ కార్యక్రమాల నిధులపై విధానాలు మరియు మార్గదర్శకాల కోసం, 20.6 చూడండి.
20.4
యువజన సభ్యసమావేశము
వారికి 14 ఏళ్లు నిండిన సంవత్సరం జనవరి నుండి, యువకులు మరియు యువతులు కలిసి యువజన సభ్యసమావేశములో పాల్గొనడానికి ఆహ్వానించబడ్డారు. యువజన సభ్యసమావేశములు సాధారణంగా సంవత్సరంలో ఒకసారి వార్డు లేదా స్టేకు స్థాయిలో నిర్వహించబడతాయి. వాటిని బహుళ స్టేకు లేదా ప్రాంతీయ స్థాయిలో కూడా నిర్వహించవచ్చు. యౌవనులు ఎఫ్ ఎస్ వై సమావేశమునకు హాజరయ్యేందుకు కేటాయించిన సంవత్సరంలో, స్టేకులు మరియు వార్డులు యువజన సభ్యసమావేశమును నిర్వహించకూడదు.
బిషప్రిక్కు ఆధ్వర్యంలో వార్డు యౌవనుల సలహాసభ చేత వార్డు యువజన సభ్యసమావేశాలు ప్రణాళిక చేయబడతాయి మరియు నిర్వహించబడతాయి (29.2.6 చూడండి). బిషప్రిక్కు వార్డు యువజన సభ్యసమావేశానికి సంబంధించిన ప్రణాళికలకు స్టేకు అధ్యక్షత్వము యొక్క ఆమోదం పొందుతారు.
నాయకులు మరియు యువత యువజన సభ్యసమావేశాన్ని ప్రణాళిక చేస్తున్నప్పుడు, వారు ఈ అధ్యాయంలోని విధానాలను మరియు క్రింది మార్గదర్శకాలను గమనించాలి:
-
సంఘము యొక్క వార్షిక యౌవనుల ఇతివృత్తమును సమావేశ ఇతివృత్తముగా ఉపయోగించవచ్చు.
-
ఇతివృత్తమునకు అనుగుణంగా ఉండే ప్రోత్సాహ కార్యక్రమాలను ప్రణాళిక చేయండి.
-
ప్రసంగీకులు మరియు ప్రోత్సాహ కార్యక్రమాలకు బిషప్రిక్కు లేదా స్టేకు అధ్యక్షత్వము యొక్క ఆమోదం పొందండి.
-
అన్ని సమయాల్లో తగినంతగా పెద్దల పర్యవేక్షణ ఉండేలా చూసుకోండి (20.7.1 చూడండి).
20.5
ప్రోత్సాహ కార్యక్రమాలను ఎంచుకోవడం మరియు ప్రణాళిక చేయడం కోసం విధానాలు మరియు మార్గదర్శకాలు
20.5.1
వాణిజ్య లేదా రాజకీయ ప్రోత్సాహ కార్యక్రమాలు
ఏదైనా వాణిజ్య లేదా రాజకీయ ప్రయోజనం కోసం నిర్వహించబడే ప్రోత్సాహ కార్యక్రమాలు అనుమతించబడవు (35.5.2 చూడండి).
20.5.2
నృత్యాలు మరియు సంగీతం
నృత్యాలు, దుస్తులు, వస్త్రధారణ, కాంతి ప్రసారం, నృత్య రీతులు, సాహిత్యం మరియు సంగీతం అన్నీ ప్రభువు యొక్క ఆత్మ ఉండగల వాతావరణానికి తోడ్పడాలి.
20.5.3
సోమవారం రాత్రులు
సోమవారం లేదా ఇతర సమయాల్లో కుటుంబ ప్రోత్సాహ కార్యక్రమాలు నిర్వహించమని సభ్యులు ప్రోత్సహించబడ్డారు. సోమవారాల్లో సాయంత్రం 6:00 గంటల తర్వాత ఎటువంటి సంఘ ప్రోత్సాహ కార్యక్రమాలు, సమావేశాలు లేదా బాప్తిస్మపు సేవలు నిర్వహించబడకూడదు.
20.5.5
రాత్రిపూట ప్రోత్సాహ కార్యక్రమాలు
యువకులు మరియు యువతుల మిశ్రమ సమూహాల కోసం రాత్రిపూట సంఘ ప్రోత్సాహ కార్యక్రమాలు తప్పనిసరిగా బిషప్పు మరియు స్టేకు అధ్యక్షునిచే ఆమోదించబడాలి. మగ మరియు ఆడ ఒంటరి సభ్యుల ప్రోత్సాహ కార్యక్రమాలకు కూడా ఇది వర్తిస్తుంది.
సంఘ సమావేశమందిరములు లేదా సమావేశమందిరం మైదానాలలో రాత్రిపూట ప్రోత్సాహ కార్యక్రమాలు ఆమోదించబడవు.
20.5.8
విశ్రాంతి దినమును పాటించుట
ఆదివారం ఎటువంటి సంఘ శిబిరాలు, క్రీడా కార్యక్రమాలు లేదా వినోద కార్యక్రమాలు ప్రణాళిక చేయబడరాదు. అలాగే యౌవనుల సమూహాలు మరియు ఇతరులు ఆదివారంనాడు శిబిరాలకు లేదా యువజన సభ్యసమావేశాలకు వెళ్ళడం లేదా వాటినుండి రావడం చేయరాదు.
20.5.10
దేవాలయ సందర్శనలు
దేవాలయ సందర్శనలు అవి కేటాయించబడిన దేవాలయ జిల్లాలో వార్డు లేదా స్టేకు స్థాయిలో నిర్వహించబడతాయి.
20.6
ప్రోత్సాహ కార్యక్రమాలకు నిధులను కేటాయించడం కొరకు విధానాలు మరియు మార్గదర్శకాలు
20.6.1
వార్డు లేదా స్టేకు ఆదాయవ్యయాల అంచనా నిధులతో చెల్లించబడిన ప్రోత్సాహ కార్యక్రమాలు
20.6.2లో జాబితా చేయబడిన సాధ్యమైన మినహాయింపులతో—అన్ని ప్రోత్సాహ కార్యక్రమాలకు చెల్లించడానికి వార్డు లేదా స్టేకు ఆదాయవ్యయాల అంచనా నిధులను ఉపయోగించాలి.
20.6.2
యౌవనుల శిబిరాల కొరకు నిధులు
దిగువ జాబితా చేయబడిన ప్రోత్సాహ కార్యక్రమాల కోసం వార్డు లేదా స్టేకు ఆదాయవ్యయాల అంచనాలో తగినంత నిధులు లేకుంటే, పాల్గొనేవారిని కొంత భాగం లేదా మొత్తం చెల్లించమని నాయకులు అడగవచ్చు:
-
పొడిగించిన ఒక వార్షిక అహరోను యాజకత్వ శిబిరము లేదా అలాంటి ప్రోత్సాహ కార్యక్రమం.
-
పొడిగించిన ఒక వార్షిక యువతుల శిబిరం లేదా అలాంటి ప్రోత్సాహ కార్యక్రమం.
-
8 నుండి 11 సంవత్సరాల వయస్సు గల ప్రాథమిక పిల్లల కోసం ఒక వార్షిక దిన శిబిరం లేదా అలాంటి ప్రోత్సాహ కార్యక్రమం.
వార్షిక శిబిరానికి ఖర్చులు లేదా ప్రయాణాలు అధికంగా ఉండకూడదు. వ్యక్తిగత నిధుల కొరత ఒక సభ్యుడు పాల్గొనకుండా చేయరాదు.
20.6.3
ఎఫ్ ఎస్ వై సమావేశాల కొరకు నిధులు
యౌవనుల బలము కొరకు (ఎఫ్ ఎస్ వై) సమావేశాలకు హాజరు కావడానికి రుసుమును చెల్లించమని యువతను అడగవచ్చు. డబ్బు లేనందువల్ల ఒక యౌవనుడు పాల్గొనకుండా ఉన్నట్లయితే, బిషప్పు ఈ రుసుములో మొత్తాన్ని లేదా కొంత భాగాన్ని చెల్లించడానికి వార్డు ఆదాయవ్యయాల అంచనా నిధులను ఉపయోగించవచ్చు. FSY.ChurchofJesusChrist.org చూడండి.
20.6.5
నిధుల సేకరణ కార్యక్రమాలు
స్టేకు మరియు వార్డు ప్రోత్సాహ కార్యక్రమాల కోసం ఖర్చులు సాధారణంగా ఆదాయవ్యయాల అంచనా నిధులతో చెల్లించబడతాయి. అయితే, స్టేకు అధ్యక్షుడు లేదా బిషప్పు ఈ క్రింది ప్రయోజనాల కోసం మాత్రమే ప్రతి సంవత్సరం ఒక నిధుల సేకరణ కార్యక్రమానికి అధికారం ఇవ్వవచ్చు:
-
20.6.2లో జాబితా చేయబడిన ప్రోత్సాహ కార్యక్రమాలకు చెల్లించడంలో సహాయం చేయడానికి.
-
వార్షిక శిబిరాల కొరకు విభాగానికి అవసరమైన పరికరాలను కొనుగోలు చేయడంలో సహాయపడడానికి.
20.7
ప్రోత్సాహ కార్యక్రమాల కొరకు భద్రతా విధానాలు మరియు మార్గదర్శకాలు
20.7.1
పెద్దల పర్యవేక్షణ
పిల్లలు మరియు యువత హాజరయ్యే అన్ని సంఘ ప్రోత్సాహ కార్యక్రమాలకు కనీసం ఇద్దరు పెద్దలు తప్పనిసరిగా హాజరు కావాలి. సమూహం యొక్క పరిమాణం, కార్యాచరణకు అవసరమైన నైపుణ్యాలు లేదా ఇతర కారకాలపై ఆధారపడి అదనంగా పెద్దలు అవసరం కావచ్చు. తల్లిదండ్రులు సహాయం చేయాలని ప్రోత్సహించబడ్డారు.
పిల్లలు మరియు యువతతో పనిచేసే వారందరూ తప్పనిసరిగా పిల్లలు మరియు యువత రక్షణా శిక్షణను పూర్తి చేయాలి. ProtectingChildren.ChurchofJesusChrist.org చూడండి.
20.7.2
యౌవనుల ప్రోత్సాహ కార్యక్రమాలలో పాల్గొనడానికి వయో పరిమితులు
వారి తల్లిదండ్రుల ఆమోదంతో, యౌవనులు వారికి 12 ఏళ్లు నిండిన సంవత్సరం జనవరిలో ప్రారంభమయ్యే రాత్రిపూట శిబిరాలకు హాజరు కావచ్చు. వారికి 14 ఏళ్లు నిండిన సంవత్సరం జనవరిలో ప్రారంభమయ్యే నృత్యాలు, యువజన సభ్యసమావేశాలు మరియు ఎఫ్ ఎస్ వై సమావేశాలకు వారు హాజరు కావచ్చు.
20.7.4
తల్లిదండ్రుల అనుమతి
పిల్లలు మరియు యౌవనులు వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల అనుమతి లేకుండా సంఘ ప్రోత్సాహ కార్యక్రమాలలో పాల్గొనకూడదు. రాత్రిపూట బస చేయడం, సుదీర్ఘ ప్రయాణం లేదా సాధారణం కంటే ఎక్కువ ప్రమాదంతో కూడిన సంఘ ప్రోత్సాహ కార్యక్రమాలకు వ్రాతపూర్వక అనుమతి అవసరం.
తల్లిదండ్రులు మరియు సంరక్షకులు అనుమతి మరియు వైద్య విడుదల ఫారంపై సంతకం చేయడం ద్వారా ఈ అనుమతిని ఇస్తారు.
20.7.5
హింస యొక్క నివేదికలు
సంఘ ప్రోత్సాహ కార్యక్రమాల సమయంలో జరిగే ఏదైనా హింస పౌర అధికారులకు నివేదించబడాలి. వెంటనే బిషప్పుని సంప్రదించాలి. సభ్యులకు సూచనలు 38.6.2.7 లో ఉన్నాయి. బిషప్పుల కోసం సూచనలు 38.6.2.1 లో ఉన్నాయి.
20.7.6
ముందస్తు భద్రతా చర్యలు, ప్రమాద ప్రతిస్పందన మరియు ప్రమాద నివేదిక
20.7.6.1
ముందస్తు భద్రతా చర్యలు
నాయకులు మరియు పాల్గొనేవారు గాయం లేదా అనారోగ్యం యొక్క కనీస ప్రమాదాన్ని నిర్ధారించడానికి ప్రోత్సాహ కార్యక్రమాలను జాగ్రత్తగా అంచనా వేస్తారు. ప్రోత్సాహ కార్యక్రమాలు అతి తక్కువ ఆస్తి నష్టాన్ని కలిగి ఉండాలి. ప్రోత్సాహ కార్యక్రమాల సమయంలో, నాయకులు భద్రతను నిర్ధారించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు.
20.7.6.2
ప్రమాద ప్రతిస్పందన
సంఘ ఆస్తుల వద్ద లేదా సంఘ ప్రోత్సాహ కార్యక్రమాల సమయంలో ప్రమాదం లేదా గాయం సంభవించినట్లయితే, వర్తించే విధంగా నాయకులు క్రింది మార్గదర్శకాలను పాటిస్తారు:
-
ప్రథమ చికిత్స అందించండి. ఒక వ్యక్తికి అదనపు వైద్య సంరక్షణ అవసరమైతే, అత్యవసర వైద్య సేవలను సంప్రదించండి. తల్లిదండ్రులు, సంరక్షకులు లేదా ఇతర బంధువులు మరియు బిషప్పు లేదా స్టేకు అధ్యక్షుడిని కూడా సంప్రదించండి.
-
ఎవరైనా తప్పిపోయినా లేదా మరణించినా, వెంటనే స్థానికంగా చట్టాన్ని అమలు చేసేవారికి తెలియజేయండి.
-
భావోద్వేగ మద్దతును అందించండి.
-
చట్టపరమైన చర్యలను ప్రోత్సహించవద్దు లేదా నిరుత్సాహపరచవద్దు. సంఘము తరఫున ఒప్పందాలు చేయవద్దు.
-
సాక్షుల పేర్లు, వారి సంప్రదింపుల సమాచారం, జరిగిన దాని వివరాలు మరియు ఛాయాచిత్రాలను సేకరించి ఉంచండి.
-
ప్రమాదాన్ని నివేదించండి (20.7.6.3 చూడండి).
20.7.6.3
ప్రమాద నివేదిక
క్రింది పరిస్థితులను incidents.ChurchofJesusChrist.org వద్ద ఆన్‌లైన్‌లో నివేదించాలి.
-
సంఘ ఆస్తుల వద్ద లేదా సంఘ ప్రోత్సాహ కార్యక్రమాల సమయంలో ప్రమాదం లేదా గాయం సంభవించినప్పుడు.
-
సంఘ ప్రోత్సాహ కార్యక్రమాలలో పాల్గొంటున్న వ్యక్తి తప్పిపోయినప్పుడు.
-
సంఘ ప్రోత్సాహ కార్యక్రమాల సమయంలో వ్యక్తులకు, ప్రజలకు లేదా సంఘానికి చెందిన ఆస్తి నాశనమైనప్పుడు.
-
చట్టపరమైన చర్య బెదిరించబడినప్పుడు లేదా ఊహించబడినప్పుడు.
ఏదైనా సంఘటన వలన తీవ్రమైన గాయం, ప్రాణాపాయం జరిగినప్పుడు లేదా వ్యక్తి తప్పిపోయినట్లయితే, స్టేకు అధ్యక్షుడు, బిషప్పు లేదా అతను నియమించిన సభ్యుడు వెంటనే ప్రాంతీయ కార్యాలయానికి తెలియజేస్తారు.
20.7.6.4
భీమా మరియు ప్రశ్నలు
సంఘ కార్యక్రమంలో గాయం జరిగితే, సంఘ ప్రోత్సాహ కార్యక్రమాల వైద్య సహాయ కార్యక్రమం వర్తిస్తుందో లేదో నాయకులు నిర్ణయిస్తారు.
కొన్ని సందర్భాల్లో, స్టేకు అధ్యక్షుడు లేదా బిషప్పుకు భద్రతా సమస్యలు లేదా సంఘానికి వ్యతిరేకంగా దావాల గురించి ప్రశ్నలు ఉండవచ్చు. స్టేకు అధ్యక్షుడు (లేదా అతని ఆధ్వర్యంలోని బిషప్పు) అటువంటి ప్రశ్నలను ప్రమాద నిర్వహణ విభాగానికి లేదా ప్రాంతీయ కార్యాలయానికి సూచిస్తారు.
20.7.7
ప్రయాణం
సంఘ ప్రోత్సాహ కార్యక్రమాల కోసం ప్రయాణం బిషప్పు లేదా స్టేకు అధ్యక్షుని చేత ఆమోదించబడాలి. ఈ ప్రయాణం సభ్యులపై అనవసర భారాన్ని మోపకూడదు. కార్యక్రమాల కోసం దూర ప్రయాణాలు ప్రోత్సాహించబడవు.
సాధ్యమైనప్పుడు, సంఘ సమూహాలు సుదూర ప్రయాణానికి వాణిజ్య రవాణాను ఉపయోగించాలి. అది లైసెన్సు కలిగి ఉండాలి మరియు జవాబుదారిత్వ భీమా ద్వారా రక్షించబడాలి.
సంఘ సమూహాలు ప్రైవేట్ ప్రయాణీకుల వాహనాలలో ప్రయాణించేటప్పుడు, ప్రతీ వాహనం తప్పనిసరిగా సురక్షితమైన చోదక స్థితిలో ఉండాలి. ప్రతి వ్యక్తి తప్పనిసరిగా సీటు బెల్టును ఉపయోగించాలి. ప్రతి చోదకుడు లైసెన్సు పొందిన, బాధ్యతాయుతమైన పెద్దవారై ఉండాలి.