చేతి పుస్తకములు మరియు పిలుపులు
10. అహరోను యాజకత్వ సమూహములు


“10. అహరోను యాజకత్వము,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు (2023).

“10. అహరోను యాజకత్వము,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు

సంఘములో యువకులు

10.

అహరోను యాజకత్వ సమూహములు

10.1

ఉద్దేశ్యము మరియు నిర్మాణము

10.1.1

ఉద్దేశ్యము

సమూహము యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యమును సాధించడానికి కలిసి పని చేయడంలో యాజకత్వము కలిగియున్నవారికి సహాయం చేయుట.

10.1.2

అహరోను యాజకత్వ సమూహపు ఇతివృత్తము

“నేను దేవుని యొక్క ప్రియమైన కుమారుడిని మరియు నేను చేయవలసిన పనిని ఆయన కలిగియున్నారు.

“నా పూర్ణ హృదయముతో, శక్తితో, మనస్సుతో మరియు బలముతో నేను దేవుణ్ణి ప్రేమిస్తాను, నా నిబంధనలను పాటిస్తాను మరియు నా స్వంత గృహములో ప్రారంభించి ఇతరులకు సేవ చేయడానికి ఆయన యాజకత్వాన్ని ఉపయోగిస్తాను.

“నేను సేవ చేయడానికి, విశ్వాసాన్ని అభ్యసించడానికి, పశ్చాత్తాపం చెందడానికి మరియు ప్రతిరోజూ మెరుగుపడటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, దేవాలయ దీవెనలు మరియు సువార్త యొక్క శాశ్వతమైన ఆనందాన్ని పొందేందుకు నేను అర్హత పొందుతాను.

“నేను యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యుడిగా ఉండటం ద్వారా శ్రద్ధగల సువార్తికునిగా, నమ్మకమైన భర్తగా మరియు ప్రేమగల తండ్రిగా మారడానికి సిద్ధమవుతాను.

“క్రీస్తు వద్దకు రావాలని మరియు ఆయన ప్రాయశ్చిత్తం యొక్క దీవెనలను పొందాలని అందరినీ ఆహ్వానించడం ద్వారా రక్షకుని రాకడ కొరకు ప్రపంచాన్ని సిద్ధం చేయడంలో నేను సహాయం చేస్తాను.”

10.1.3

సమూహములు

10.1.3.1

పరిచారకుల సమూహము

యువకులు వారికి 12 ఏళ్లు నిండే సంవత్సరం జనవరిలో పరిచారక సమూహములో చేరతారు. ఈ సమయంలో వారు సిద్ధంగా మరియు యోగ్యత కలిగి ఉంటే వారు పరిచారకులుగా నియమించబడడానికి కూడా అర్హులు.

పరిచారకుడి యొక్క విధులు సిద్ధాంతము మరియు నిబంధనలు 20:57–59; 84:111 లో వివరించబడ్డాయి. ఇతర విధులలో సంస్కారమును అందించడం మరియు బిషప్పుకు “లౌకిక విషయాలన్నిటిని నిర్వహించడంలో సహాయం చేయడం” (సిద్ధాంతము మరియు నిబంధనలు 107:68) ఉన్నాయి.

10.1.3.2

బోధకుల సమూహము

యువకులు వారికి 14 ఏళ్లు నిండే సంవత్సరం జనవరిలో బోధకుల సమూహములో చేరతారు. ఈ సమయంలో వారు సిద్ధంగా మరియు యోగ్యత కలిగి ఉంటే వారు బోధకులుగా నియమించబడడానికి కూడా అర్హులు.

బోధకులకు పరిచారకుల మాదిరిగానే విధులు ఉంటాయి. వారు సంస్కారమును సిద్ధం చేస్తారు మరియు పరిచర్య చేయు సహోదరులుగా కూడా సేవ చేస్తారు. అదనపు విధులు సిద్ధాంతము మరియు నిబంధనలు 20:53–59; 84:111 లో వివరించబడ్డాయి.

10.1.3.3

యాజకుల సమూహము

యువకులు వారికి 16 ఏళ్లు నిండే సంవత్సరం జనవరిలో యాజకుల సమూహములో చేరతారు. ఈ సమయంలో వారు సిద్ధంగా మరియు యోగ్యత కలిగి ఉంటే వారు యాజకులుగా నియమించబడడానికి కూడా అర్హులు.

యాజకులకు పరిచారకులు మరియు బోధకుల మాదిరిగానే విధులు ఉంటాయి. అదనపు విధులు సిద్ధాంతము మరియు నిబంధనలు 20:46–52, 73–79 లో వివరించబడ్డాయి.

10.1.4

యాజకత్వ తాళపుచెవులు

ఈ తాళపుచెవుల గురించి మరింత సమాచారం కోసం, 3.4.1 చూడండి.

10.1.5

సమూహములను స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్చడం

కొద్దిమంది యువకులు ఉన్న వార్డు లేదా శాఖలో, అహరోను యాజకత్వ సమూహములు బోధన మరియు ప్రోత్సాహ కార్యక్రమాల కోసం కలిసి సమకూడవచ్చు.

10.2

రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యములో పాల్గొనడం

10.2.1

యేసు క్రీస్తు సువార్తను జీవించడం

10.2.1.2

సువార్త అభ్యాసం

సమూహ కూడికలు నెలలో రెండవ మరియు నాల్గవ ఆదివారాలలో జరుగుతాయి. అవి 50 నిమిషాల పాటు ఉంటాయి. సమూహ అధ్యక్షత్వ సభ్యుడు (లేదా యాజకుల సమూహంలో బిషప్పు యొక్క సహాయకులలో ఒకరు) నిర్వహిస్తారు. అతను ఇతివృత్తమును పఠించడంలో మరియు నియామకాలు, విధులు మరియు ఇతర విషయాల గురించి కలిసి ఆలోచన చేయడంలో సమూహమునకు నాయకత్వం వహిస్తాడు.

తర్వాత సమూహ సభ్యుడు లేదా పెద్దవారైన నాయకుడు సువార్త బోధనకు నాయకత్వం వహిస్తారు.

10.2.1.3

సేవ మరియు ప్రోత్సాహ కార్యక్రమాలు

సేవ మరియు ప్రోత్సాహ కార్యక్రమాలు సాక్ష్యాలను నిర్మించాలి, కుటుంబాలను బలోపేతం చేయాలి, సమూహ ఐక్యతను పెంపొందించాలి మరియు ఇతరులను దీవించే అవకాశాలను అందించాలి.

కొన్ని సేవ మరియు ప్రోత్సాహ కార్యక్రమాలు యువకులు మరియు యువతులు ఇరువురిని కలిపి ఉండాలి, ముఖ్యంగా పెద్దవారైన యువత కోసం.

వార్షిక ప్రోత్సాహ కార్యక్రమాలు. క్రమమైన యువజన ప్రోత్సాహ కార్యక్రమాలతో పాటు, యువకులు ప్రతీ సంవత్సరం ఈ క్రింది వాటిలో కూడా పాల్గొనవచ్చు:

  • అహరోను యాజకత్వ సమూహ శిబిరం (Aaronic Priesthood Quorum Camp Guide చూడండి).

  • వార్డు లేదా స్టేకు యువజన సభ్యసమావేశం లేదా యౌవనుల బలము కొరకు (ఎఫ్ ఎస్ వై) సమావేశం.

10.2.1.4

వ్యక్తిగత అభివృద్ధి

మరింతగా రక్షకుని వలె మారడానికి వారి ప్రయత్నాలలో, యువజనులు ఆధ్యాత్మికంగా, సామాజికంగా, భౌతికంగా మరియు మేధోపరంగా ఎదగడానికి లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి ఆహ్వానించబడ్డారు (లూకా 2:52 చూడండి).

మరింత సమాచారం కోసం, ChildrenandYouth.ChurchofJesusChrist.org చూడండి.

10.2.2

అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడం

అహరోను యాజకత్వము కలిగియున్నవారు “లౌకిక విషయాలన్నిటిని నిర్వహించడంలో” బిషప్పుకు సహాయం చేస్తారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 107:68). వారి కుటుంబాలలో మరియు వారితో పాటు, యువజన ప్రోత్సాహ కార్యక్రమాల సమయంలో మరియు స్వంతంగా ఇతరులకు సేవ చేయడానికి వారికి క్రమమైన అవకాశాలు ఉండాలి.

10.2.2.1

పరిచర్య

అహరోను యాజకత్వము కలిగియున్నవారు 14 ఏళ్లు నిండిన సంవత్సరం జనవరి నుండి పరిచర్య నియామకాలను అందుకుంటారు. మరింత సమాచారం కోసం, 21వ అధ్యాయం చూడండి.

10.2.3

సువార్తను స్వీకరించమని అందరినీ ఆహ్వానించడం

అహరోను యాజకత్వము కలిగియున్నవారు “అందరిని క్రీస్తునొద్దకు రమ్మని ఆహ్వానించు” విధిని కలిగియున్నారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:59).

పూర్తి కాల సువార్తసేవ చేయడానికి మరియు వారి జీవితమంతా సువార్తను పంచుకోవడానికి సిద్ధపడమని తల్లిదండ్రులు మరియు నాయకులు యువకులను ప్రోత్సహిస్తారు.

10.2.4

నిత్యత్వము కొరకు కుటుంబాలను ఏకం చేయడం

అహరోను యాజకత్వము కలిగియున్నవారు నిత్యత్వము కొరకు కుటుంబాలను ఏకం చేసే కార్యములో అనేక విధాలుగా సహాయం చేయగలరు.

  • తమ తల్లిదండ్రులను గౌరవించి, ఇంటిలో క్రీస్తువంటి జీవనానికి ఒక ఉదాహరణగా ఉండగలరు.

  • నిత్య వివాహంతో సహా దేవాలయ విధులను పొందడానికి సిద్ధపడగలరు.

  • దేవాలయ విధులు అవసరమైన పూర్వీకులను గుర్తించగలరు (FamilySearch.org చూడండి).

  • పరిస్థితులు అనుమతించినంత వరకు మరణించిన వారి కొరకు బాప్తిస్మములు మరియు నిర్ధారణలలో పాల్గొనగలరు.

10.3

బిషప్రిక్కు

తన వార్డులోని యువతీ యువకులను సంరక్షించడం బిషప్పు యొక్క ప్రధాన బాధ్యత. అతను వారి పేర్లను తెలుసుకుంటాడు మరియు వారి ఇంటి పరిస్థితులను అర్థం చేసుకుంటాడు. వారి ప్రోత్సాహ కార్యక్రమాలు మరియు ఆదివారం సమావేశాలకు అతను క్రమం తప్పకుండా హాజరవుతాడు.

బిషప్పు యాజకుల సమూహమునకు అధ్యక్షుడు.

బిషప్రిక్కులోని మొదటి సలహాదారుడు బోధకుల సమూహమునకు బాధ్యత వహిస్తారు. బిషప్రిక్కులోని రెండవ సలహాదారుడు పరిచారకుల సమూహమునకు బాధ్యత వహిస్తారు.

అహరోను యాజకత్వ సమూహముల కొరకు బిషప్రిక్కు ఈ క్రింది అదనపు బాధ్యతలను కలిగి ఉన్నారు:

  • ప్రతీ యువకుడిని కనీసం సంవత్సరానికి రెండుసార్లు కలుసుకుంటారు (31.3.1 చూడండి).

  • మెల్కీసెదెకు యాజకత్వమును పొందడానికి యువకులకు సహాయం చేస్తారు.

  • అహరోను యాజకత్వ సమూహముల రికార్డులను, నివేదికలను మరియు ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షిస్తారు.

కోరిన విధంగా ఈ బాధ్యతలలో సమూహ సలహాదారులు మరియు నిపుణులు సహాయం చేస్తారు.

10.4

యువజన సమూహ నాయకులు

10.4.1

పిలుపు, ఆమోదించడం మరియు ప్రత్యేకపరచడం

యాజకుల సమూహమును నడిపించడంలో తనకు సహాయకులుగా ఉండమని బిషప్పు ఒకరిద్దరు యాజకులను పిలుస్తారు.

బిషప్రిక్కు సభ్యుడొకరు పరిచారకులు మరియు బోధకుల సమూహ అధ్యక్షులను పిలుస్తారు. సేవ చేయడానికి అహరోను యాజకత్వము కలిగియున్నవారు తగినంతమంది ఉన్నప్పుడు, ఈ యువకులు ప్రార్థనాపూర్వకంగా సమూహ సభ్యులను సలహాదారులుగా మరియు కార్యదర్శిగా సిఫార్సు చేస్తారు.

ఈ పిలుపులను ఇచ్చిన తర్వాత, బిషప్రిక్కు సభ్యుడొకరు వారి సమూహ సమావేశములో యువజన సమూహ నాయకులను ఆమోదము కొరకు సమర్పిస్తారు. బిషప్పు తన సహాయకులను, పరిచారకులు మరియు బోధకుల సమూహ అధ్యక్షులను ప్రత్యేకపరుస్తారు. అతను సమూహ అధ్యక్షులకు యాజకత్వ తాళపుచెవులను అనుగ్రహిస్తాడు. ఇతర అధ్యక్షత్వ సభ్యులు మరియు కార్యదర్శులను ప్రత్యేక పరచడానికి అతను తన సలహాదారులను నియమించవచ్చు.

10.4.2

బాధ్యతలు

  • రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యములో పాల్గొనడానికి సమూహం యొక్క ప్రయత్నాలకు నాయకత్వం వహించడం.(1వ అధ్యాయం చూడండి).

  • సమూహ సమావేశాలకు హాజరుకాని వారితో సహా ప్రతీ సమూహ సభ్యుని గురించి తెలుసుకోవడం మరియు సేవ చేయడం.

  • వార్డు యువజన సలహాసభలో సేవ చేయడం (10.4.4 చూడండి).

  • సమూహ సభ్యులకు వారి యాజకత్వ విధులను బోధించడం (సిద్ధాంతము మరియు నిబంధనలు 107: 85–88 చూడండి).

  • సమూహ సమావేశాలను ప్రణాళిక చేయడం మరియు నిర్వహించడం (10.2.1.2 చూడండి).

  • సమూహ సేవ మరియు ప్రోత్సాహ కార్యక్రమాలను ప్రణాళిక చేయడం మరియు నిర్వహించడం (10.2.1.3 చూడండి).

10.4.3

సమూహ అధ్యక్షత్వ సమావేశము

అహరోను యాజకత్వ సమూహముల అధ్యక్షత్వములు క్రమం తప్పకుండా కలుస్తారు. సమూహ అధ్యక్షుడు ఈ సమావేశాలను నిర్వహిస్తారు. కనీసం ఇద్దరు పెద్దలు హాజరవుతారు—బిషప్రిక్కు సభ్యుడు, సలహాదారుడు లేదా నిపుణుడు.

10.4.4

వార్డు యువజన సలహాసభ

వార్డు యువజన సలహాసభ గురించి మరింత సమాచారం కోసం 29.2.6 చూడండి.

10.8

అదనపు మార్గదర్శకాలు మరియు విధానాలు

10.8.1

యువతను కాపాడుకోవడం

సంఘ కార్యక్రమాలలో పెద్దలు యువతతో సంభాషిస్తున్నప్పుడు, కనీసం ఇద్దరు బాధ్యతగల పెద్దలు అక్కడ ఉండాలి.

యువతతో పనిచేసే పెద్దలందరూ వారు ఆమోదించబడిన ఒక నెలలోపు తప్పనిసరిగా పిల్లలు మరియు యువత రక్షణా శిక్షణను పూర్తి చేయాలి (ProtectingChildren.ChurchofJesusChrist.org).