చేతి పుస్తకములు మరియు పిలుపులు
11. యువతులు


“11. యువతులు,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు (2023).

“11. యువతులు,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు

వెలుపలనున్న యువతులు

11.

యువతులు

11.1

ఉద్దేశ్యము మరియు నిర్మాణము

11.1.1

ఉద్దేశ్యము

యువతులు పవిత్రమైన నిబంధనలను చేసి, పాటించడానికి మరియు యేసు క్రీస్తుపట్ల, ఆయన సువార్తపట్ల వారి పరివర్తనను మరింత ఎక్కువగా చేసుకోవడానికి యువతుల నిర్మాణము సహాయపడుతుంది.

11.1.2

యువతుల ఇతివృత్తము

“నేను పరలోక తల్లిదండ్రుల ప్రియమైన కుమార్తెను, దైవిక స్వభావం మరియు నిత్య గమ్యము కలిగియున్నాను.

“యేసు క్రీస్తు శిష్యురాలిగా, నేను ఆయనలా మారడానికి ప్రయత్నిస్తున్నాను. నేను వ్యక్తిగత బయల్పాటును వెదకి, దానిపై చర్య తీసుకుంటాను మరియు ఆయన పరిశుద్ధ నామములో ఇతరులకు పరిచర్య చేస్తాను.

“నేను అన్ని సమయాలలో, అన్ని విషయాలలో మరియు అన్ని ప్రదేశాలలో దేవుని సాక్షిగా నిలబడతాను.

“నేను ఉన్నతస్థితికి అర్హత సాధించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, నేను పశ్చాత్తాపం యొక్క బహుమతిని ఎంతో విలువైనదిగా భావిస్తాను మరియు ప్రతిరోజూ మెరుగుపడాలని కోరుకుంటాను. విశ్వాసంతో, నేను నా ఇంటిని మరియు కుటుంబాన్ని బలపరుస్తాను, పవిత్రమైన నిబంధనలను చేసి పాటిస్తాను మరియు పరిశుద్ధ దేవాలయం యొక్క విధులను, దీవెనలను పొందుతాను.

11.1.3

తరగతులు

యువతులు వారికి 12 ఏళ్లు నిండిన సంవత్సరం జనవరిలో ప్రారంభమయ్యే యువతుల తరగతిలో సభ్యులు అవుతారు.

బిషప్రిక్కులు మరియు యువతుల నాయకులు వయస్సు ప్రకారం తరగతులను ఎలా నిర్వహించాలో ప్రార్థనాపూర్వకంగా నిర్ణయిస్తారు. పరిమాణంతో సంబంధం లేకుండా ప్రతి తరగతికి ఒక అధ్యక్షురాలు మరియు సాధ్యమైన చోట ఒకరు లేదా ఇద్దరు సలహాదారులు మరియు కార్యదర్శి ఉండాలి.

11.2

రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యములో పాల్గొనడం

11.2.1

యేసు క్రీస్తు సువార్తను జీవించడం

11.2.1.2

సువార్త అభ్యాసం

తరగతి సమావేశాలు నెలలో రెండవ మరియు నాల్గవ ఆదివారాలలో జరుగుతాయి. అవి 50 నిమిషాల పాటు ఉంటాయి. తరగతి అధ్యక్షత్వములోని ఒక సభ్యురాలు నిర్వహిస్తారు. ఇతివృత్తమును పఠించడంలో, నియమితకార్యములు మరియు ఇతర విషయాల గురించి కలిసి ఆలోచన చేయడంలో ఆమె తరగతికి నాయకత్వం వహిస్తారు.

తర్వాత ఒక తరగతి సభ్యురాలు లేదా పెద్దవారైన నాయకురాలు సువార్త బోధనకు నాయకత్వం వహిస్తారు.

11.2.1.3

సేవ మరియు ప్రోత్సాహ కార్యక్రమాలు

సేవ మరియు ప్రోత్సాహ కార్యక్రమాలు సాక్ష్యాలను నిర్మించాలి, కుటుంబాలను బలోపేతం చేయాలి, తరగతి ఐక్యతను పెంపొందించాలి మరియు ఇతరులను దీవించడానికి అవకాశాలను అందించాలి.

కొన్ని సేవ మరియు ప్రోత్సాహ కార్యక్రమాలలో యువకులు మరియు యువతులు ఇరువురిని చేర్చాలి, ముఖ్యంగా పెద్దవారైన యువత కోసం.

వార్షిక ప్రోత్సాహ కార్యక్రమాలు. క్రమమైన యువజన ప్రోత్సాహ కార్యక్రమాలకు అదనంగా, యువతులు ప్రతీ సంవత్సరం ఈ క్రింది వాటిలో కూడా పాల్గొనవచ్చు:

  • యువతుల శిబిరం (Young Women Camp Guide చూడండి).

  • వార్డు లేదా స్టేకు యువజన సభ్యసమావేశం లేదా యౌవనుల బలము కొరకు (ఎఫ్ ఎస్ వై) సమావేశం.

11.2.1.4

వ్యక్తిగత అభివృద్ధి

మరింతగా రక్షకుని వలె మారడానికి వారి ప్రయత్నాలలో, యువత ఆధ్యాత్మికంగా, సామాజికంగా, భౌతికంగా మరియు మేధోపరంగా ఎదగడానికి లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి ఆహ్వానించబడ్డారు (లూకా 2:52 చూడండి).

మరింత సమాచారం కోసం, ChildrenandYouth.ChurchofJesusChrist.org చూడండి.

11.2.2

అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడం

యువతులు తమ కుటుంబాలలో మరియు వారితో పాటు, యువజన ప్రోత్సాహ కార్యక్రమాల సమయంలో మరియు వారి స్వంతంగా ఇతరులకు సేవ చేయడానికి క్రమమైన అవకాశాలను కలిగి ఉండాలి.

11.2.2.1

పరిచర్య

యువతులు వారికి 14 ఏళ్లు నిండిన సంవత్సరం జనవరి నుండి పరిచర్య నియామకాల‌ను అందుకోవచ్చు. మరింత సమాచారం కోసం, 21వ అధ్యాయం చూడండి.

11.2.3

సువార్తను స్వీకరించమని అందరినీ ఆహ్వానించడం

వారు “అన్ని సమయములలో, అన్ని విషయములలో మరియు అన్ని స్థలములలో దేవునికి సాక్షులుగా నిలిచినప్పుడు” (మోషైయ 18:9) యువతులు సువార్తను స్వీకరించమని అందరినీ ఆహ్వానిస్తారు.

వారి జీవితమంతా సువార్తను పంచుకోవడానికి సిద్ధపడేందుకు తల్లిదండ్రులు మరియు నాయకులు యువతులకు సహాయపడగలరు.

11.2.4

నిత్యత్వము కొరకు కుటుంబాలను ఏకం చేయడం

నిత్యత్వము కొరకు కుటుంబాలను ఏకం చేయడంలో యువతులు అనేక విధాలుగా సహాయపడగలరు.

  • తమ తల్లిదండ్రులను గౌరవించి, ఇంటిలో క్రీస్తువంటి జీవనానికి ఒక ఉదాహరణగా ఉండగలరు.

  • నిత్య వివాహంతో సహా దేవాలయ విధులను పొందడానికి సిద్ధపడగలరు.

  • దేవాలయ విధులు అవసరమైన పూర్వీకులను గుర్తించగలరు (FamilySearch.org చూడండి).

  • పరిస్థితులు అనుమతించినంత వరకు మరణించిన వారి కొరకు బాప్తిస్మములు మరియు నిర్ధారణలలో పాల్గొనగలరు.

11.3

వార్డు యువతుల నాయకత్వము

11.3.1

బిషప్రిక్కు

తన వార్డులోని యువతీ యువకులను సంరక్షించడం బిషప్పు యొక్క ప్రధాన బాధ్యత. అతను మరియు అతని సలహాదారులు వారి పేర్లను తెలుసుకుంటారు మరియు వారి ఇంటి పరిస్థితులను అర్థం చేసుకుంటారు. వారు ప్రతీ యువతిని కనీసం సంవత్సరానికి రెండుసార్లు కలుసుకుంటారు (31.3.1 చూడండి).

బిషప్పు‌కు వార్డు యువతుల నిర్మాణము యొక్క బాధ్యత కలదు. అతను యువతుల అధ్యక్షురాలిని క్రమం తప్పకుండా కలుస్తుంటాడు.

బిషప్పు మరియు అతని సలహాదారులు క్రమం తప్పకుండా యువతుల సమావేశాలు, సేవ మరియు ప్రోత్సాహ కార్యక్రమాలలో పాల్గొంటారు.

11.3.2

పెద్దవారైన యువతుల అధ్యక్షత్వము

బిషప్పు ఒక మహిళను వార్డు యువతుల అధ్యక్షురాలిగా సేవ చేయడానికి పిలిచి, ప్రత్యేకపరుస్తారు. విభాగము తగినంత పెద్దదైతే, ఒకరు లేదా ఇద్దరు మహిళలను తన సలహాదారులుగా పిలవాలని ఆమె సిఫార్సు చేస్తుంది (30వ అధ్యాయం చూడండి).

ఒక చిన్న విభాగము‌లో, యువతుల అధ్యక్షురాలు మాత్రమే యువతుల నిర్మాణములో పిలువబడిన పెద్దవారైన నాయకురాలు కావచ్చు. ఈ సందర్భంలో, ఆమె యువతుల కోసం ఉపదేశాన్ని మరియు ప్రోత్సాహ కార్యక్రమాలను నిర్వహించడానికి తల్లిదండ్రులతో కలిసి పనిచేస్తుంది.

ఒక శాఖకు యువతుల అధ్యక్షురాలు లేకపోతే, యువతుల అధ్యక్షురాలు పిలువబడే వరకు ఉపశమన సమాజ అధ్యక్షురాలు యువతుల కోసం ఉపదేశాన్ని నిర్వహించవచ్చు.

యువతుల అధ్యక్షురాలికి ఈ క్రింది బాధ్యతలు ఉంటాయి. ఆమె సలహాదారులు ఆమెకు సహాయం చేస్తారు.

  • వార్డు సలహాసభలో సేవ చేయడం.

  • వార్డు యువజన సలహాసభ సభ్యురాలిగా సేవ చేయడం (29.2.6 చూడండి).

  • యువతులు ఒక్కొక్కరికి పరిచర్య చేయడం.

  • ఇతర యువతుల నాయకులకు మరియు తరగతి అధ్యక్షత్వములకు వారి బాధ్యతలను బోధించడం.

  • బిషప్పుతో అవసరం లేని లేదా హింసకు సంబంధించిన సవాళ్ల గురించి యువతులతో ఆలోచన చేయడం (32.3, 31.3.1 మరియు 38.6.2 చూడండి).

11.3.4

తరగతి అధ్యక్షత్వము మరియు కార్యదర్శి

11.3.4.1

పిలుపు, ఆమోదించడం మరియు ప్రత్యేకపరచడం

ప్రతి యువతుల తరగతికి తరగతి అధ్యక్షురాలు ఉండాలి.

బిషప్రిక్కు సభ్యుడు ఒక యువతిని తరగతి అధ్యక్షురాలిగా సేవ చేయడానికి పిలుస్తారు. సేవ చేయడానికి తగినంతమంది యువతులు ఉన్నప్పుడు, తరగతి సభ్యులను సలహాదారులుగా మరియు కార్యదర్శిగా సిఫార్సు చేయడానికి ఆమె ప్రార్థనాపూర్వకంగా ఆలోచిస్తుంది.

ఈ పిలుపులను ఇచ్చిన తర్వాత, బిషప్రిక్కు సభ్యుడొకరు ఆమోదము కొరకు యువతులను వారి తరగతిలో సమర్పిస్తారు. బిషప్పు లేదా నియమించబడిన సలహాదారుడు యువతులను ప్రత్యేకపరుస్తారు.

11.3.4.2

బాధ్యతలు

తరగతి అధ్యక్షులు వార్డు యువజన సలహాసభలో సేవ చేస్తారు (11.3.4.4 చూడండి). తరగతి అధ్యక్షత్వాలు క్రింది బాధ్యతలను కూడా కలిగి ఉంటాయి:

  • రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యములో పాల్గొనడానికి తరగతి యొక్క ప్రయత్నాలకు నాయకత్వం వహించడం (1వ అధ్యాయం చూడండి).

  • తరగతి సమావేశాలకు హాజరుకాని వారితో సహా ప్రతీ యువతి గురించి తెలుసుకోవడం మరియు సేవ చేయడం.

  • ఆదివారం తరగతి సమావేశాలను ప్రణాళిక చేయడం మరియు నిర్వహించడం (11.2.1.2 చూడండి).

  • తరగతి సేవ మరియు ప్రోత్సాహ కార్యక్రమాలను ప్రణాళిక చేయడం మరియు నిర్వహించడం (11.2.1.3 చూడండి).

11.3.4.3

తరగతి అధ్యక్షత్వ సమావేశము

యువతుల తరగతి అధ్యక్షత్వములు క్రమం తప్పకుండా సమావేశమవుతారు. తరగతి అధ్యక్షురాలు ఈ సమావేశాలను నిర్వహిస్తారు. తరగతి అధ్యక్షత్వములకు మద్దతివ్వడానికి నియమించబడిన పెద్దవారైన యువతుల నాయకులు కూడా హాజరవుతారు.

11.3.4.4

వార్డు యువజన సలహాసభ

వార్డు యువజన సలహాసభ గురించి మరింత సమాచారం కోసం 29.2.6 చూడండి.

11.6

అదనపు మార్గదర్శకాలు మరియు విధానాలు

11.6.1

యువతను కాపాడుకోవడం

సంఘ కార్యక్రమాలలో పెద్దలు యువతతో సంభాషిస్తున్నప్పుడు, కనీసం ఇద్దరు బాధ్యతగల పెద్దలు అక్కడ ఉండాలి. దీన్ని సాధ్యం చేయడానికి తరగతులను కలపడం అవసరం కావచ్చు.

యువతతో పనిచేసే పెద్దలందరూ వారు ఆమోదించబడిన ఒక నెలలోపు తప్పనిసరిగా పిల్లలు మరియు యువత రక్షణా శిక్షణను పూర్తి చేయాలి (ProtectingChildren.ChurchofJesusChrist.org).