చేతి పుస్తకములు మరియు పిలుపులు
30 సంఘములో పిలుపులు


“30. సంఘములో పిలుపులు,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు (2023).

“30. సంఘములో పిలుపులు,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు

కుడి చేతులు పైకెత్తుతున్న జనులు

30.

సంఘములో పిలుపులు

30.0

పరిచయము

పిలుపులు ఆయన బిడ్డలకు సేవ చేయడం ద్వారా దేవునికి సేవ చేయడంలోని ఆనందాన్ని అనుభవించడానికి సభ్యులకు అవకాశాలను అందిస్తాయి (మోషైయ 2:17 చూడండి). సభ్యులు తమ విశ్వాసాన్ని పెంచుకోవడానికి మరియు ప్రభువుకు దగ్గరవ్వడానికి కూడా పిలుపులు సహాయపడతాయి.

సంఘములో నిర్దిష్ట పిలుపులను కోరుకోవడం సరికాదు (మార్కు 10:42–45; సిద్ధాంతము మరియు నిబంధనలు 121:34–37 చూడండి). లేదా సంఘ సభ్యులు ఒక పిలుపు నుండి మరొక పిలుపుకు “ముందుకు కొనసాగరు”. పిలుపు ఏమిటి అనే కంటే పిలుపులో నమ్మకంగా సేవ చేయడం చాలా ముఖ్యం. ప్రభువు తన సంఘములో సేవ చేసే వారందరి అంకితభావాన్ని గౌరవిస్తారు.

30.1

ఎవరిని పిలవాలో నిర్ణయించడం

30.1.1

ప్రధాన మార్గదర్శకాలు

సంఘములో సేవ చేసేవారు దేవునిచే పిలువబడతారు (హెబ్రీయులకు 5:4; విశ్వాస ప్రమాణాలు 1:5 చూడండి). నాయకులు ఎవరిని పిలవాలో నిర్ణయించడంలో ఆత్మ యొక్క మార్గదర్శకత్వాన్ని కోరుకుంటారు (4.2.6 కూడా చూడండి). వారు ఈ క్రింది విషయాలను కూడా పరిగణిస్తారు:

  • సభ్యుని యోగ్యత (మౌఖికములో నిర్ణయించినట్లు).

  • ఇతరులను దీవించడానికి సభ్యుడు కలిగియున్న లేదా వృద్ధిచేయగల బహుమానాలు మరియు సామర్థ్యాలు.

  • అతని లేదా ఆమె ఆరోగ్యం మరియు పనితనంతో సహా, సభ్యుని వ్యక్తిగత పరిస్థితులు.

  • సభ్యుని వివాహం మరియు కుటుంబంపై పిలుపు చూపే ప్రభావం.

సంఘములో సేవ చేయడానికి వారు చేసే త్యాగాలకు సభ్యులు దీవించబడతారు. అయితే, ఒక పిలుపు వ్యక్తులు మరియు కుటుంబాలపై అనవసరమైన భారాన్ని మోపకూడదు. అలాగే సభ్యులు తమ ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించడాన్ని పిలుపులు కష్టతరం చేయకూడదు.

సాధారణంగా, ప్రతి సభ్యుడు పరిచర్య చేసే సహోదరుడు లేదా సహోదరిగా ఉండడంతో పాటు, ఒక సమయంలో ఒక పిలుపు‌లో మాత్రమే సేవ చేయడానికి పిలువబడతారు.

వివాహిత సభ్యునికి పిలుపును ఇచ్చేటప్పుడు, జీవిత భాగస్వామికి పిలుపు గురించి అవగాహన ఉందని మరియు మద్దతిస్తారని నాయకులు నిర్ధారిస్తారు. యువకుడికి లేదా యువతికి పిలుపు ఇవ్వడానికి ముందు, నాయకులు అతని లేదా ఆమె తల్లిదండ్రులు లేదా సంరక్షకుల నుండి ఆమోదం పొందుతారు.

పిలుపును ఇచ్చే ముందు, బిషప్పు వ్యక్తి యొక్క సభ్యత్వ రికార్డును జాగ్రత్తగా సమీక్షించి, అందులో విమర్శ లేదా అధికారిక సభ్యత్వ పరిమితులు లేవని ధృవీకరిస్తారు.

30.1.2

క్రొత్త సభ్యులకు పిలుపులు

సేవ చేసే అవకాశాలు సభ్యులు ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయపడతాయి.

బాప్తిస్మముు పొంది, నిర్ధారించబడిన వెంటనే క్రొత్త సభ్యులు సేవ చేయడానికి వార్డు నాయకులు అవకాశం ఇస్తారు.

30.1.3

సభ్యులు కాని వారికి పిలుపులు

సంఘములో సభ్యులు కాని వ్యక్తులు వాద్యకారుడు, సంగీత దర్శకుడు లేదా ప్రోత్సాహ కార్యక్రమాలను ప్రణాళిక చేయడంలో సహాయం చేసే పిలుపు వంటి కొన్ని స్థానాలకు పిలువబడవచ్చు. అయినప్పటికీ, వారిని బోధకులుగా, సమూహము లేదా నిర్మాణ అధ్యక్షత్వ సభ్యులుగా లేదా ప్రాథమిక సంగీత నాయకులుగా పిలువకూడదు.

30.1.4

గోప్యత

పిలుపులు మరియు విడుదలలు పవిత్రమైనవి. దీని కారణంగా, నాయకులు ప్రతిపాదిత పిలుపులు మరియు విడుదలల గురించి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు.

30.1.5

పిలుపు‌ల కోసం సిఫార్సులు మరియు అనుమతులు

పిలుపుల పట్టిక ప్రతి పిలుపు‌కు ఎవరు సిఫార్సులు చేయవచ్చు మరియు ఎవరు అనుమతి ఇస్తారు అని సూచిస్తుంది (30.8 చూడండి).

బిషప్పు‌లు మరియు స్టేకు అధ్యక్షులు ప్రతి సిఫార్సును జాగ్రత్తగా పరిశీలిస్తారు, అది ప్రార్థనాపూర్వకంగా చేయబడిందని గుర్తిస్తారు. ఎవరిని పిలవాలి అనే దాని గురించి ప్రేరణ పొందడం బిషప్రిక్కు లేదా స్టేకు అధ్యక్షత్వము యొక్క ప్రధాన బాధ్యత.

30.2

పిలుపును ఇవ్వడం

సేవ చేయడానికి పిలుపును స్వీకరించడం అనేది సభ్యునికి అర్ధవంతమైన ఆధ్యాత్మిక అనుభవంగా ఉండాలి.

ఒక నాయకుడు పిలుపునిచ్చినప్పుడు, అది ప్రభువు నుండి వచ్చిందని అతను వివరిస్తాడు.

నాయకుడు ఇవి కూడా చేయవచ్చు:

  • పిలుపు యొక్క ఉద్దేశం, ప్రాముఖ్యత మరియు బాధ్యతలను వివరించడం.

  • పిలుపును నెరవేర్చడంలో ప్రభువు ఆత్మను వెదకమని సభ్యుడిని ప్రోత్సహించడం.

  • సభ్యునికి ప్రభువు సహాయం చేస్తారని మరియు నమ్మకంగా సేవ చేసినందుకు అతన్ని లేదా ఆమెను దీవిస్తారని సాక్ష్యమివ్వడం.

  • పిలుపు కోసం శిక్షణ మరియు మద్దతు ఎవరు అందిస్తారో సభ్యునికి చెప్పడం.

  • సభ్యునికి అతను లేదా ఆమె హాజరు కావలసిన సమావేశాలు మరియు అందుబాటులో ఉన్న వనరుల గురించి తెలియజేయడం.

30.3

పిలుపులలో సభ్యులను ఆమోదించడం

చాలామట్టుకు సంఘ స్థానాలకు పిలువబడిన వారు సేవ చేయడం ప్రారంభించే ముందు ఆమోదం కొరకు సమర్పించబడాలి (సిద్ధాంతము మరియు నిబంధనలు 28:13; 42:11 చూడండి).

ఆమోదాన్ని నిర్వహించే వ్యక్తి మొదట ఆ స్థానం నుండి ఎవరు విడుదల చేయబడ్డారో ప్రకటిస్తారు (వర్తిస్తే). ఆ వ్యక్తి యొక్క సేవకు కృతజ్ఞతలు తెలియజేయమని అతను సభ్యులను ఆహ్వానిస్తాడు (30.6 చూడండి).

ఒక వ్యక్తిని ఆమోదం కొరకు సమర్పించేటప్పుడు, అధికారముగల యాజకత్వ నాయకుడు అతన్ని లేదా ఆమెను నిలబడమని ఆహ్వానిస్తాడు. నాయకుడు క్రింది పదాలను ఉపయోగించవచ్చు:

“[పేరు] [స్థానం] గా పిలువబడ్డారు. [అతన్ని లేదా ఆమెను] ఆమోదించడానికి అనుకూలంగా ఉన్నవారు చేయి పైకెత్తి చూపవచ్చు. [కొంత విరామం ఇవ్వండి.] వ్యతిరేకించేవారు ఎవరైనా ఉంటే కూడా చూపవచ్చు. [కొంత విరామం ఇవ్వండి.]”

మంచి స్థితిలో ఉన్న సభ్యుడు పిలుపును వ్యతిరేకిస్తే, అధ్యక్షత్వం వహించే నాయకుడు లేదా నియమించబడిన మరొక యాజకత్వ నాయకుడు సమావేశం తర్వాత అతడిని లేదా ఆమెను ఏకాంతంగా కలిసి చర్చిస్తారు.

30.4

పిలుపులలో సేవ చేయడానికి సభ్యులను ప్రత్యేకపరచుట

మరింత సమాచారం కోసం, 18.11 చూడండి.

30.6

పిలుపుల నుండి సభ్యులను విడుదల చేయడం

అధ్యక్షుడు లేదా బిషప్పు విడుదలైనప్పుడు, అతని లేదా ఆమె సలహాదారులు స్వతస్సిద్ధంగా విడుదల చేయబడతారు.

విడుదల చేయడం అనేది కృతజ్ఞతలు తెలియజేయడానికి మరియు సభ్యుని సేవలో దేవుని హస్తాన్ని గుర్తించడానికి నాయకుడికి ఒక ముఖ్యమైన అవకాశం. విడుదల గురించి బహిరంగంగా ప్రకటించే ముందు అతనికి లేదా ఆమెకు తెలియజేయడానికి నాయకుడు సభ్యునితో వ్యక్తిగతంగా సమావేశమవుతాడు. విడుదల గురించి ప్రకటించే ముందు తెలుసుకోవలసిన వారికి మాత్రమే అది తెలియజేయబడుతుంది.

అధికారముగల యాజకత్వ నాయకుడు ఒక వ్యక్తిని ఆమోదించిన విధములోనే విడుదలను ప్రకటిస్తాడు. నాయకుడు క్రింది పదాలను ఉపయోగించవచ్చు:

“[పేరు] [స్థానం] గా విడుదల చేయబడ్డారు. [అతని లేదా ఆమె] సేవకు కృతజ్ఞతలు తెలియజేయాలనుకునే వారు చేయి పైకెత్తి చూపవచ్చు.”

ఎవరైనా వ్యతిరేకిస్తారా అని నాయకుడు అడగడు.

30.8

పిలుపుల పట్టిక

30.8.1

వార్డు పిలుపు‌లు

పిలుపు

వీరిచే సిఫార్సు చేయబడ్డారు

వీరిచే అనుమతివ్వబడ్డారు

వీరిచే ఆమోదించబడ్డారు

వీరిచే పిలువబడి, ప్రత్యేకపరచబడ్డారు

పిలుపు

బిషప్పు

వీరిచే సిఫార్సు చేయబడ్డారు

స్టేకు అధ్యక్షత్వము, LCRను ఉపయోగించి

వీరిచే అనుమతివ్వబడ్డారు

ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది సమూహము

వీరిచే ఆమోదించబడ్డారు

వార్డు సభ్యులు

వీరిచే పిలువబడి, ప్రత్యేకపరచబడ్డారు

ప్రథమ అధ్యక్షత్వము నుండి ఆమోదం పొందిన తర్వాత స్టేకు అధ్యక్షుడు

పిలుపు

బిషప్రిక్కులో సలహాదారులు

వీరిచే సిఫార్సు చేయబడ్డారు

బిషప్పు

వీరిచే అనుమతివ్వబడ్డారు

స్టేకు అధ్యక్షత్వము మరియు ఉన్నత సలహామండలి

వీరిచే ఆమోదించబడ్డారు

వార్డు సభ్యులు

వీరిచే పిలువబడి, ప్రత్యేకపరచబడ్డారు

స్టేకు అధ్యక్షుడు లేదా నియమించబడిన సలహాదారుడు

పిలుపు

వార్డు గుమాస్తా

వీరిచే సిఫార్సు చేయబడ్డారు

బిషప్రిక్కు

వీరిచే అనుమతివ్వబడ్డారు

స్టేకు అధ్యక్షత్వము మరియు ఉన్నత సలహామండలి

వీరిచే ఆమోదించబడ్డారు

వార్డు సభ్యులు

వీరిచే పిలువబడి, ప్రత్యేకపరచబడ్డారు

స్టేకు అధ్యక్షుడు లేదా నియమించబడిన సలహాదారుడు లేదా ప్రధాన సలహాదారుడు

పిలుపు

వార్డు కార్యనిర్వాహక కార్యదర్శి

వీరిచే సిఫార్సు చేయబడ్డారు

బిషప్రిక్కు

వీరిచే అనుమతివ్వబడ్డారు

స్టేకు అధ్యక్షత్వము మరియు ఉన్నత సలహామండలి

వీరిచే ఆమోదించబడ్డారు

వార్డు సభ్యులు

వీరిచే పిలువబడి, ప్రత్యేకపరచబడ్డారు

స్టేకు అధ్యక్షుడు లేదా నియమించబడిన సలహాదారుడు లేదా ప్రధాన సలహాదారుడు

పిలుపు

పెద్దల సమూహ అధ్యక్షుడు

వీరిచే సిఫార్సు చేయబడ్డారు

స్టేకు అధ్యక్షత్వము (బిషప్పు‌తో సంప్రదించి)

వీరిచే అనుమతివ్వబడ్డారు

స్టేకు అధ్యక్షత్వము మరియు ఉన్నత సలహామండలి

వీరిచే ఆమోదించబడ్డారు

వార్డు సభ్యులు

వీరిచే పిలువబడి, ప్రత్యేకపరచబడ్డారు

స్టేకు అధ్యక్షుడు

పిలుపు

పెద్దల సమూహ అధ్యక్షత్వములో సలహాదారులు

వీరిచే సిఫార్సు చేయబడ్డారు

సమూహ అధ్యక్షుడు (బిషప్పు‌తో సంప్రదించి)

వీరిచే అనుమతివ్వబడ్డారు

స్టేకు అధ్యక్షత్వము మరియు ఉన్నత సలహామండలి

వీరిచే ఆమోదించబడ్డారు

వార్డు సభ్యులు

వీరిచే పిలువబడి, ప్రత్యేకపరచబడ్డారు

స్టేకు అధ్యక్షుడు లేదా నియమించబడిన సలహాదారుడు లేదా ప్రధాన సలహాదారుడు

పిలుపు

ఇతర పెద్దల సమూహ పిలుపులు

వీరిచే సిఫార్సు చేయబడ్డారు

సమూహ అధ్యక్షత్వము

వీరిచే అనుమతివ్వబడ్డారు

బిషప్రిక్కు

వీరిచే ఆమోదించబడ్డారు

సమూహ సభ్యులు

వీరిచే పిలువబడి, ప్రత్యేకపరచబడ్డారు

సమూహ అధ్యక్షుడు లేదా నియమించబడిన సలహాదారుడు

పిలుపు

వార్డు నిర్మాణ అధ్యక్షులు

వీరిచే సిఫార్సు చేయబడ్డారు

బిషప్రిక్కు

వీరిచే అనుమతివ్వబడ్డారు

బిషప్రిక్కు

వీరిచే ఆమోదించబడ్డారు

వార్డు సభ్యులు

వీరిచే పిలువబడి, ప్రత్యేకపరచబడ్డారు

బిషప్పు

పిలుపు

వార్డు నిర్మాణాల అధ్యక్షత్వములలో సలహాదారులు

వీరిచే సిఫార్సు చేయబడ్డారు

నిర్మాణ అధ్యక్షుడు

వీరిచే అనుమతివ్వబడ్డారు

బిషప్రిక్కు

వీరిచే ఆమోదించబడ్డారు

వార్డు సభ్యులు

వీరిచే పిలువబడి, ప్రత్యేకపరచబడ్డారు

బిషప్పు లేదా నియమించబడిన సలహాదారుడు

పిలుపు

ఇతర వార్డు ఉపశమన సమాజ పిలుపులు

వీరిచే సిఫార్సు చేయబడ్డారు

ఉపశమన సమాజ అధ్యక్షత్వము

వీరిచే అనుమతివ్వబడ్డారు

బిషప్రిక్కు

వీరిచే ఆమోదించబడ్డారు

ఉపశమన సమాజ సభ్యులు

వీరిచే పిలువబడి, ప్రత్యేకపరచబడ్డారు

బిషప్పు లేదా నియమించబడిన సలహాదారుడు

పిలుపు

ఇతర వార్డు యువతులు, ప్రాథమిక మరియు ఆదివారపు బడి పిలుపులు

వీరిచే సిఫార్సు చేయబడ్డారు

నిర్మాణ అధ్యక్షత్వము

వీరిచే అనుమతివ్వబడ్డారు

బిషప్రిక్కు

వీరిచే ఆమోదించబడ్డారు

వార్డు సభ్యులు

వీరిచే పిలువబడి, ప్రత్యేకపరచబడ్డారు

బిషప్పు లేదా నియమించబడిన సలహాదారుడు

పిలుపు

వార్డు మిషను నాయకుడు (పెద్దల సమూహ అధ్యక్షత్వ సభ్యుడు ఈ పాత్రను పూరించవచ్చు; అలా అయితే, అతన్ని విడిగా పిలువవలసిన, ఆమోదించవలసిన లేదా ప్రత్యేకపరచవలసిన అవసరం లేదు)

వీరిచే సిఫార్సు చేయబడ్డారు

బిషప్రిక్కు (పెద్దల సమూహము మరియు ఉపశమన సమాజ అధ్యక్షులతో సంప్రదించి)

వీరిచే అనుమతివ్వబడ్డారు

బిషప్రిక్కు

వీరిచే ఆమోదించబడ్డారు

వార్డు సభ్యులు

వీరిచే పిలువబడి, ప్రత్యేకపరచబడ్డారు

బిషప్పు లేదా నియమించబడిన సలహాదారుడు

పిలుపు

వార్డు సువార్తికులు

వీరిచే సిఫార్సు చేయబడ్డారు

బిషప్రిక్కు లేదా పెద్దల సమూహము మరియు ఉపశమన సమాజ అధ్యక్షులు

వీరిచే అనుమతివ్వబడ్డారు

బిషప్రిక్కు

వీరిచే ఆమోదించబడ్డారు

వార్డు సభ్యులు

వీరిచే పిలువబడి, ప్రత్యేకపరచబడ్డారు

బిషప్పు లేదా నియమించబడిన సలహాదారుడు

పిలుపు

వార్డు దేవాలయం మరియు కుటుంబ చరిత్ర నాయకుడు (పెద్దల సమూహ అధ్యక్షత్వ సభ్యుడు ఈ పాత్రను పూరించవచ్చు; అలా అయితే, అతన్ని విడిగా పిలువవలసిన, ఆమోదించవలసిన లేదా ప్రత్యేకపరచవలసిన అవసరం లేదు)

వీరిచే సిఫార్సు చేయబడ్డారు

బిషప్రిక్కు (పెద్దల సమూహము మరియు ఉపశమన సమాజ అధ్యక్షులతో సంప్రదించి)

వీరిచే అనుమతివ్వబడ్డారు

బిషప్రిక్కు

వీరిచే ఆమోదించబడ్డారు

వార్డు సభ్యులు

వీరిచే పిలువబడి, ప్రత్యేకపరచబడ్డారు

బిషప్పు లేదా నియమించబడిన సలహాదారుడు

పిలుపు

యాజకుల సమూహ అధ్యక్షునికి సహాయకులు

వీరిచే సిఫార్సు చేయబడ్డారు

బిషప్పు (యాజకుల సమూహ అధ్యక్షుడిగా)

వీరిచే అనుమతివ్వబడ్డారు

బిషప్రిక్కు

వీరిచే ఆమోదించబడ్డారు

సమూహ సభ్యులు

వీరిచే పిలువబడి, ప్రత్యేకపరచబడ్డారు

బిషప్పు

పిలుపు

బోధకులు మరియు పరిచారకుల సమూహ అధ్యక్షులు

వీరిచే సిఫార్సు చేయబడ్డారు

బిషప్రిక్కు

వీరిచే అనుమతివ్వబడ్డారు

బిషప్రిక్కు

వీరిచే ఆమోదించబడ్డారు

సమూహ సభ్యులు

వీరిచే పిలువబడి, ప్రత్యేకపరచబడ్డారు

బిషప్పు లేదా నియమించబడిన సలహాదారుని చేత పిలువబడతారు; బిషప్పు చేత ప్రత్యేకపరచబడతారు

పిలుపు

బోధకులు మరియు పరిచారకుల సమూహ అధ్యక్షత్వములలో సలహాదారులు మరియు సమూహ కార్యదర్శులు

వీరిచే సిఫార్సు చేయబడ్డారు

సమూహ అధ్యక్షుడు

వీరిచే అనుమతివ్వబడ్డారు

బిషప్రిక్కు

వీరిచే ఆమోదించబడ్డారు

సమూహ సభ్యులు

వీరిచే పిలువబడి, ప్రత్యేకపరచబడ్డారు

బిషప్పు లేదా నియమించబడిన సలహాదారుడు

పిలుపు

యువతుల తరగతి అధ్యక్షులు

వీరిచే సిఫార్సు చేయబడ్డారు

బిషప్రిక్కు (యువతుల అధ్యక్షత్వముతో సంప్రదించి)

వీరిచే అనుమతివ్వబడ్డారు

బిషప్రిక్కు

వీరిచే ఆమోదించబడ్డారు

తరగతి సభ్యులు

వీరిచే పిలువబడి, ప్రత్యేకపరచబడ్డారు

బిషప్పు లేదా నియమించబడిన సలహాదారుడు

పిలుపు

యువతుల తరగతి అధ్యక్షత్వములలో సలహాదారులు మరియు తరగతి కార్యదర్శులు

వీరిచే సిఫార్సు చేయబడ్డారు

తరగతి అధ్యక్షురాలు

వీరిచే అనుమతివ్వబడ్డారు

బిషప్రిక్కు

వీరిచే ఆమోదించబడ్డారు

తరగతి సభ్యులు

వీరిచే పిలువబడి, ప్రత్యేకపరచబడ్డారు

బిషప్పు లేదా నియమించబడిన సలహాదారుడు

పిలుపు

ఇతర వార్డు పిలుపులు

వీరిచే సిఫార్సు చేయబడ్డారు

బిషప్రిక్కు

వీరిచే అనుమతివ్వబడ్డారు

బిషప్రిక్కు

వీరిచే ఆమోదించబడ్డారు

వార్డు సభ్యులు

వీరిచే పిలువబడి, ప్రత్యేకపరచబడ్డారు

బిషప్పు లేదా నియమించబడిన సలహాదారుడు

  1. దేవాలయంలో క్రియాశీలంగా ఉన్న ముద్రవేయు వ్యక్తులను బిషప్రిక్కులో సేవ చేయడానికి పిలువకూడదు. ముద్రవేయు వ్యక్తులు సంఘ అధ్యక్షుడి ఆధ్వర్యంలో పిలువబడతారు.

30.8.2

శాఖలో పిలుపులు

పిలుపు

వీరిచే సిఫార్సు చేయబడ్డారు

వీరిచే అనుమతివ్వబడ్డారు

వీరిచే ఆమోదించబడ్డారు

వీరిచే పిలువబడి, ప్రత్యేకపరచబడ్డారు

పిలుపు

శాఖాధ్యక్షుడు

వీరిచే సిఫార్సు చేయబడ్డారు

స్టేకు, మిషను లేదా జిల్లా అధ్యక్షత్వము

వీరిచే అనుమతివ్వబడ్డారు

స్టేకు అధ్యక్షత్వము మరియు ఉన్నత సలహామండలి లేదా మిషను అధ్యక్షత్వము

వీరిచే ఆమోదించబడ్డారు

శాఖ సభ్యులు

వీరిచే పిలువబడి, ప్రత్యేకపరచబడ్డారు

స్టేకు లేదా మిషను అధ్యక్షుడు (లేదా జిల్లా అధ్యక్షుడు, నియమించబడితే)

పిలుపు

శాఖాధ్యక్షత్వములో సలహాదారులు

వీరిచే సిఫార్సు చేయబడ్డారు

శాఖాధ్యక్షుడు

వీరిచే అనుమతివ్వబడ్డారు

స్టేకు అధ్యక్షత్వము మరియు ఉన్నత సలహామండలి లేదా మిషను అధ్యక్షత్వము (లేదా మిషను అధ్యక్షుని ద్వారా అధికారం పొందినప్పుడు జిల్లా అధ్యక్షత్వము)

వీరిచే ఆమోదించబడ్డారు

శాఖ సభ్యులు

వీరిచే పిలువబడి, ప్రత్యేకపరచబడ్డారు

స్టేకు, మిషను లేదా జిల్లా అధ్యక్షుడు లేదా నియమించబడిన సలహాదారుడు

పిలుపు

శాఖ గుమాస్తా, సహాయక గుమాస్తాలు మరియు కార్యనిర్వాహక కార్యదర్శి

వీరిచే సిఫార్సు చేయబడ్డారు

శాఖ అధ్యక్షత్వము

వీరిచే అనుమతివ్వబడ్డారు

స్టేకు అధ్యక్షత్వము మరియు ఉన్నత సలహామండలి లేదా మిషను అధ్యక్షత్వము (లేదా మిషను అధ్యక్షుని ద్వారా అధికారం పొందినప్పుడు జిల్లా అధ్యక్షత్వము)

వీరిచే ఆమోదించబడ్డారు

శాఖ సభ్యులు

వీరిచే పిలువబడి, ప్రత్యేకపరచబడ్డారు

స్టేకు అధ్యక్షుడు లేదా నియమించబడిన సలహాదారుడు లేదా ప్రధాన సలహాదారుడు (స్టేకు‌లలోని శాఖల కొరకు); జిల్లా అధ్యక్షుడు లేదా అతను నియమించిన యాజకత్వ నాయకుడు (మిషన్లలోని శాఖల కొరకు)

పిలుపు

పెద్దల సమూహ అధ్యక్షుడు

వీరిచే సిఫార్సు చేయబడ్డారు

స్టేకు, జిల్లా లేదా మిషను అధ్యక్షత్వము (శాఖాధ్యక్షునితో సంప్రదించి)

వీరిచే అనుమతివ్వబడ్డారు

స్టేకు అధ్యక్షత్వము మరియు ఉన్నత సలహామండలి లేదా మిషను అధ్యక్షత్వము (లేదా మిషను అధ్యక్షుని ద్వారా అధికారం పొందినప్పుడు జిల్లా అధ్యక్షత్వము)

వీరిచే ఆమోదించబడ్డారు

శాఖ సభ్యులు

వీరిచే పిలువబడి, ప్రత్యేకపరచబడ్డారు

స్టేకు లేదా మిషను అధ్యక్షుడు (లేదా జిల్లా అధ్యక్షుడు నియమించబడితే)

పిలుపు

పెద్దల సమూహ అధ్యక్షత్వములో సలహాదారులు

వీరిచే సిఫార్సు చేయబడ్డారు

సమూహ అధ్యక్షుడు (శాఖాధ్యక్షుడుతో సంప్రదించి)

వీరిచే అనుమతివ్వబడ్డారు

స్టేకు అధ్యక్షత్వము మరియు ఉన్నత సలహామండలి లేదా మిషను అధ్యక్షత్వము (లేదా మిషను అధ్యక్షుని ద్వారా అధికారం పొందినప్పుడు జిల్లా అధ్యక్షత్వము)

వీరిచే ఆమోదించబడ్డారు

శాఖ సభ్యులు

వీరిచే పిలువబడి, ప్రత్యేకపరచబడ్డారు

స్టేకు లేదా మిషను అధ్యక్షుడు లేదా నియమించబడిన సలహాదారుడు లేదా ప్రధాన సలహాదారుడు (లేదా జిల్లా అధ్యక్షుడు లేదా నియమించబడినట్లయితే, మరొక యాజకత్వ నాయకుడు)

పిలుపు

శాఖలో ఇతర పిలుపులు

వీరిచే సిఫార్సు చేయబడ్డారు

శాఖాధ్యక్షుని స్థానంలో బిషప్పు‌ మరియు శాఖ స్థానంలో వార్డు అని చేర్చి 30.8.1 చూడండి.

వీరిచే అనుమతివ్వబడ్డారు

శాఖాధ్యక్షుని స్థానంలో బిషప్పు‌ మరియు శాఖ స్థానంలో వార్డు అని చేర్చి 30.8.1 చూడండి.

వీరిచే ఆమోదించబడ్డారు

శాఖాధ్యక్షుని స్థానంలో బిషప్పు‌ మరియు శాఖ స్థానంలో వార్డు అని చేర్చి 30.8.1 చూడండి.

వీరిచే పిలువబడి, ప్రత్యేకపరచబడ్డారు

శాఖాధ్యక్షుని స్థానంలో బిషప్పు‌ మరియు శాఖ స్థానంలో వార్డు అని చేర్చి 30.8.1 చూడండి.

  1. దేవాలయంలో క్రియాశీలంగా ఉన్న ముద్రవేయు వ్యక్తులను శాఖ అధ్యక్షత్వములో సేవ చేయడానికి పిలువకూడదు. ముద్రవేయు వ్యక్తులు సంఘ అధ్యక్షుడి ఆధ్వర్యంలో పిలువబడతారు.