“33. రికార్డులు మరియు నివేదికలు,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు (2023).
“33. రికార్డులు మరియు నివేదికలు,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు
33.
రికార్డులు మరియు నివేదికలు
33.0
పరిచయము
ప్రభువు యొక్క సంఘములో రికార్డు సంరక్షణ ఎల్లప్పుడూ ముఖ్యమైనది. ఉదాహరణకు:
ఆదాము “జ్ఞాపకార్థ గ్రంథమును” ఉంచాడు (మోషే 6:5).
క్రీస్తు సంఘములో బాప్తిస్మము పొందిన వారి పేర్లు నమోదు చేయబడ్డాయి, తద్వారా “వారు జ్ఞాపకము చేసుకొనబడి, దేవుని సువార్త ద్వారా పోషింపబడుదురు” (మొరోనై 6:4) అని మొరోనై బోధించాడు.
“ప్రభువు యెదుట ఒక సత్యమును గూర్చి లిఖించుటకు” ప్రతీ వార్డులో ఒక గ్రంథకర్తను పిలవాలని జోసెఫ్ స్మిత్ సూచించాడు (సిద్ధాంతము మరియు నిబంధనలు 128:2).
33.1
సంఘ రికార్డుల సమీక్ష
సంఘ రికార్డులు పవిత్రమైనవి. వాటిలోని సమాచారం సున్నితమైనది మరియు భద్రపరచబడాలి. సంఘ రికార్డు వ్యవస్థలు పిలుపుల ఆధారంగా సభ్యత్వ సమాచారానికి ప్రవేశాన్ని అనుమతిస్తాయి.
రికార్డులు నాయకులకు ఈ విధంగా సహాయపడతాయి:
-
ప్రత్యేక శ్రద్ధ అవసరమైన వారిని గుర్తించడానికి.
-
ఒక వ్యక్తి రక్షణకి సంబంధించిన ఏ విధులను పొందాడో లేదా ఏవి అవసరమో గుర్తించడానికి.
-
సభ్యులను గుర్తించడానికి.
క్రింది రకాల రికార్డులు సంఘ విభాగములలో ఉంచబడ్డాయి:
-
సభ్యుల భాగస్వామ్య నివేదికలు (33.5 చూడండి)
-
సభ్యత్వ రికార్డులు (33.6 చూడండి)
-
చారిత్రక రికార్డులు (33.7 చూడండి)
-
ఆర్థిక రికార్డులు (34వ అధ్యాయం చూడండి)
33.2
గుమాస్తాల కొరకు ముఖ్య సూచనలు
వారు ప్రస్తుత దేవాలయ సిఫారసు కలిగియుండాలి.
సంఘ నిధులను రక్షించడానికి మరియు సంఘ రికార్డులు ఖచ్చితమైనవని నిర్ధారించడానికి గుమాస్తాలు ప్రస్తుత విధానాలను జాగ్రత్తగా అనుసరిస్తారు. ఏవైనా అక్రమాలు జరిగితే గుమాస్తాలు వెంటనే యాజకత్వ నాయకులకు తెలియజేస్తారు. అక్రమాలను పరిష్కరించడంలో ఇబ్బందులు ఎదురైతే, గుమాస్తాలు సంఘ ప్రధాన కార్యాలయంలోని గోప్యమైన రికార్డుల కార్యాలయాన్ని సంప్రదించాలి.
టెలిఫోన్: 1-801-240-2053 లేదా 1-800-453-3860, పొడిగింపు 2-2053
టోల్ ఫ్రీ (GSD ఫోన్): 855-537-4357
ఈమెయిల్: ConfidentialRecords@ChurchofJesusChrist.org
గుమాస్తాల సేవాకాలం వారి విధులను తెలుసుకోవడానికి మరియు వారి పనిలో కొనసాగింపును కాపాడుకోవడానికి సరిపోతుంది. వారు స్టేకు అధ్యక్షత్వము లేదా బిషప్రిక్కులో సభ్యులు కానందున, స్టేకు అధ్యక్షత్వము లేదా బిషప్రిక్కు పునర్వ్యవస్థీకరించబడినప్పుడు వారిని విడుదల చేయవలసిన అవసరం లేదు.
33.4
వార్డు రికార్డులు మరియు నివేదికలు
33.4.1
బిషప్రిక్కు
బిషప్పు వార్డు రికార్డు సంరక్షణను పర్యవేక్షిస్తారు.
33.4.2
వార్డు గుమాస్తా
ప్రతి వార్డుకు అర్హత కలిగిన, పనిచేసే వార్డు గుమాస్తా ఉండాలి. అతను బిషప్రిక్కు చేత సిఫార్సు చేయబడతాడు మరియు స్టేకు అధ్యక్షత్వ సభ్యుడు లేదా నియమించబడిన ప్రధాన సలహాదారుని ద్వారా పిలువబడతాడు మరియు ప్రత్యేకపరచబడతాడు. అతను మెల్కీసెదెకు యాజకత్వాన్ని మరియు ప్రస్తుత దేవాలయ సిఫారసును కలిగియుండాలి. అతను వార్డు సలహాసభలో సభ్యుడు. 29.2లో సూచించిన విధంగా అతను వార్డు సమావేశాలకు హాజరవుతాడు.
వార్డు గుమాస్తా బిషప్రిక్కు మరియు స్టేకు గుమాస్తాలచే ఉపదేశమివ్వబడతాడు. సహాయం కొరకు సహాయక వార్డు గుమాస్తాలను పిలవవచ్చు.
33.4.2.1
రికార్డు సంరక్షణ బాధ్యతలు
వార్డు గుమాస్తా లేదా నియమించబడిన సహాయక గుమాస్తా క్రింది బాధ్యతలను కలిగి ఉంటారు:
-
వార్డు నాయకత్వ సమావేశాలలో చేసిన నియామకాలు మరియు నిర్ణయాలను వ్రాసియుంచడం.
-
రికార్డులు మరియు నివేదికలు ఖచ్చితమైనవని, సమయానుకూలంగా ఉన్నాయని నిర్ధారించుకోవడం.
వార్డు గుమాస్తాకు సంఘ రికార్డు సంరక్షణ సాధనాల గురించి బాగా తెలిసి ఉండాలి (33.0 చూడండి). వీటిని గుర్తించడంలో నాయకులకు సహాయపడడానికి అతను ఈ సాధనాలను ఉపయోగిస్తాడు:
-
సభ్యులు మరియు నిర్మాణాల అవసరాలు.
-
ఆర్థిక వ్యవహారలతో సహా వనరుల లభ్యత.
తమ సభ్యత్వ సమాచారంలో ఏవైనా తప్పులుంటే నివేదించమని వార్డు గుమాస్తాలు సభ్యులను ప్రోత్సహిస్తారు.
ఇతర రికార్డు సంరక్షణ విధులు వీటిని కలిగి ఉండవచ్చు:
-
విధులు సక్రమంగా మరియు తక్షణమే నమోదు చేయబడతాయని నిర్ధారించడం.
-
వార్డు సభ్యసమావేశము కొరకు అధికారులను ఆమోదించు ఫారంను సిద్ధం చేయడం.
-
వార్డు సభ్యత్వ సభల కోసం సమాచారాన్ని నమోదు చేయడం.
-
ఆర్థిక రికార్డులను నిర్వహించడం (34.2.2 చూడండి).
33.5
సభ్యుల భాగస్వామ్యంపై నివేదికలు
సభ్యుల భాగస్వామ్యానికి సంబంధించిన నివేదికలు సభ్యుల పురోగతి మరియు అవసరాలపై దృష్టిపెట్టడానికి నాయకులకు సహాయపడతాయి.
33.5.1
నివేదికల రకాలు
33.5.1.1
హాజరు నివేదికలు
సంస్కార కూడికలు మరియు ఆదివారం యాజకత్వము మరియు నిర్మాణ సమావేశాలకు హాజరు కావడం LCR లేదా సభ్యుల సాధనాలను ఉపయోగించి సాంకేతికంగా నమోదు చేయబడుతుంది.
సంస్కార కూడిక. సంస్కార కూడికకు హాజరు ప్రతీవారం వార్డు గుమాస్తా లేదా సహాయక వార్డు గుమాస్తా ద్వారా నమోదు చేయబడుతుంది. గణన అనేది సందర్శకులతో సహా వ్యక్తిగతంగా లేదా ప్రసారం ద్వారా సమావేశానికి హాజరయ్యే వారి సంఖ్య.
ఆదివారపు సమూహ మరియు నిర్మాణ సమావేశాలు. ప్రతీవారం సమూహ మరియు నిర్మాణ కార్యదర్శులు మరియు సలహాదారుల ద్వారా హాజరు నమోదు చేయబడుతుంది. హాజరు నమోదు చేయడంలో యౌవనుల నాయకులు కూడా సహకరించవచ్చు. గణన అనేది సందర్శకులతో సహా వ్యక్తిగతంగా లేదా ప్రసారం ద్వారా సమావేశానికి హాజరయ్యే వారి సంఖ్య. ప్రాథమికలో పనిచేస్తున్న సభ్యులు లేదా వార్డు పరిధిలో యౌవనుల నాయకులుగా ఉన్నవారు కూడా హాజరులో చేర్చబడతారు.
వార్డు గుమాస్తా ఏ నిర్మాణం తరఫున అయినా హాజరు నమోదు చేయవచ్చు.
33.5.1.2
పరిచర్య మౌఖిక నివేదికలు
21.3 చూడండి.
33.5.1.3
త్రైమాసిక నివేదిక
నివేదికలోని ప్రతి సంఖ్య ప్రత్యేక అవసరాలను కలిగి ఉన్న నిజమైన వ్యక్తిని సూచిస్తుంది (హీలమన్ 15:13 చూడండి).
నాయకులు తమ పరిచర్య ప్రయత్నాల గురించి ప్రేరేపణ పొందుతున్నప్పుడు అంతర్దృష్టులను అందించగల ఉపయోగకరమైన సమాచారాన్ని త్రైమాసిక నివేదిక కలిగి ఉంది.
వ్యక్తుల పురోగతిని సమీక్షించడానికి స్టేకు మరియు వార్డు నాయకులు త్రైమాసిక నివేదికను క్రమం తప్పకుండా చూస్తారు.
ప్రతీ వార్డు త్రైమాసిక నివేదికను పూర్తి చేసి సంఘ ప్రధాన కార్యాలయానికి సమర్పిస్తుంది. గుమాస్తా బిషప్పుతో కలిసి నివేదికను సమీక్షించి, ప్రతీ త్రైమాసికం ముగిసిన తర్వాతి నెల 15వ తేదీలోపు దానిని సమర్పిస్తారు.
33.5.2
సభ్యత్వ జాబితాలు
సంఘ రికార్డు సంరక్షణ సాధనాలు సభ్యత్వ జాబితాలకు ప్రవేశాన్ని నాయకులకు అందిస్తాయి. ఈ జాబితాలు వీటిని గుర్తించడంలో నాయకులకు సహాయపడతాయి:
-
ఏ సభ్యులు వారు అర్హులైన విధులను ఇంకా పొందలేదు.
-
ఏ యువకులు మరియు యువతులు మిషను సేవ చేయడానికి అర్హులు.
-
ఏ యౌవనులకు ప్రస్తుత దేవాలయ సిఫారసు లేదు.
-
బిషప్రిక్కు సభ్యునితో సమావేశాలకు ఏ యువతను షెడ్యూల్ చేయాలి.
సమూహము మరియు నిర్మాణ నాయకులు వారి సమూహము లేదా నిర్మాణాలకు చెందిన వారి జాబితాలకు ప్రవేశాన్ని కలిగి ఉండాలి.
33.6
సభ్యత్వ రికార్డులు
సభ్యత్వ రికార్డులలో సభ్యుల పేర్లు, సంప్రదింపు సమాచారం, విధుల వివరాలు మరియు ఇతర ముఖ్యమైన సమాచారం ఉంటాయి.
సభ్యత్వ రికార్డులు సభ్యుడు నివసించే వార్డులో ఉంచబడాలి. అరుదుగా ఉండవలసిన మినహాయింపులకు సంబంధిత బిషప్పులు మరియు స్టేకు అధ్యక్షుల సమ్మతి అవసరం. మినహాయింపును అభ్యర్థించడానికి, ప్రథమ అధ్యక్షత్వ కార్యాలయానికి అభ్యర్థనను సమర్పించడానికి స్టేకు అధ్యక్షుడుLCR ని ఉపయోగిస్తాడు.
క్రింది వాటిని వెంటనే చేయడం చాలా ముఖ్యం:
-
విధుల సమాచారాన్ని నమోదు చేయడం.
-
వార్డులోకి లేదా బయటకు వెళ్లే సభ్యుల రికార్డులను తరలించడం.
-
క్రొత్త సభ్యులు మరియు సభ్యులైన తల్లిదండ్రులకు క్రొత్తగా పుట్టిన పిల్లల కొరకు రికార్డులను సృష్టించడం.
-
సభ్యుని మరణాన్ని నమోదు చేయడం.
-
వివాహం మరియు కుటుంబ సభ్యుల సమాచారాన్ని నమోదు చేయడం.
క్రిందివి పొందడానికి ఒక సభ్యుడు మౌఖికం చేయబడడానికి ముందు, బిషప్పు లేదా స్టేకు అధ్యక్షుడు సభ్యత్వ రికార్డు సముచిత వార్డులో ఉండేలా చూసుకుంటారు:
-
సంఘ పిలుపు.
-
దేవాలయ సిఫారసు.
-
మెల్కీసెదెకు యాజకత్వం లేదా ఆ యాజకత్వంలో ఒక స్థానానికి నియమించబడడం.
రికార్డులో క్రింది వాటిలో ఏవీ చేర్చబడలేదని కూడా అతను నిర్ధారిస్తాడు:
-
విమర్శ
-
ముద్ర లేదా విధి పరిమితి గురించిన వ్యాఖ్య
-
అధికారిక సభ్యత్వ పరిమితులు
ఎట్టి పరిస్థితుల్లోనూ బిషప్పు లేదా గుమాస్తాకు కాకుండా వేరెవరికి సభ్యత్వ రికార్డులు ఇవ్వకూడదు లేదా చూపించకూడదు.
సభ్యులు తమ కోసం మరియు ఇంట్లోనే ఉండి కుటుంబంపై ఆధారపడిన పిల్లల కోసం సభ్యత్వ సమాచారాన్ని Member Tools app [సభ్యత్వ సాధనాల యాప్]లో వీక్షించవచ్చు. వారు గుమాస్తా నుండి వారి వ్యక్తిగత విధి సారాంశాల ముద్రిత కాపీలను కూడా అభ్యర్థించవచ్చు. లోపాలు కనుగొనబడితే, సభ్యత్వ రికార్డులలో అవి సరిదిద్దబడునట్లు గుమాస్తా నిర్ధారిస్తారు.
33.6.1
సంఘ రికార్డులలో ఉపయోగించబడిన పేర్లు
స్థానిక చట్టం లేదా ఆచారం ద్వారా నిర్వచించబడినట్లుగా, ఒక వ్యక్తి యొక్క చట్టపరమైన పూర్తి పేరును సభ్యత్వ రికార్డులలో మరియు విధి ధృవపత్రాలలో ఉపయోగించాలి.
33.6.2
రికార్డులోని సభ్యులు
క్రింది వ్యక్తులు రికార్డులో సభ్యులు మరియు సభ్యత్వ రికార్డును కలిగి ఉండాలి:
-
బాప్తిస్మము మరియు నిర్ధారణ పొందిన వారు
-
బాప్తిస్మము పొందకుండా దీవెన పొందిన 9 ఏళ్లలోపు వారు
-
వయస్సుతో సంబంధం లేకుండా, మేధోపరమైన వైకల్యాల కారణంగా జవాబుదారులు కాని వారు
-
ఈ క్రిందివి రెండూ వర్తించినప్పుడు దీవెన పొందని 9 ఏళ్లలోపు పిల్లలు:
-
కనీసం తల్లిదండ్రులలో ఒకరు లేదా తాతమామ్మలలో ఒకరు సంఘములో సభ్యులైయున్నప్పుడు.
-
రికార్డు సృష్టించడానికి తల్లిదండ్రులు ఇద్దరూ అనుమతి ఇచ్చినప్పుడు. (ఒకవేళ తల్లిదండ్రులలో ఒకరు మాత్రమే పిల్లల చట్టపరమైన సంరక్షకులైతే, ఆ తల్లి లేదా తండ్రి అనుమతి సరిపోతుంది.)
-
బాప్తిస్మము మరియు నిర్ధారణ పొందకుండా సభ్యత్వ రికార్డును కలిగియున్న 9 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తి రికార్డులో సభ్యుడు కాదు. అయితే, వ్యక్తి నివసించే వార్డు ఆ వ్యక్తికి 18 ఏళ్లు వచ్చే వరకు సభ్యత్వ రికార్డును కలిగి ఉంటుంది. ఆ సమయంలో, వ్యక్తి బాప్తిస్మము పొందకూడదని ఎంచుకుంటే, బిషప్పు సభ్యత్వ రికార్డును రద్దు చేస్తారు. స్టేకు అధ్యక్షుని అనుమతి అవసరం.
మేధోపరమైన వైకల్యం కారణంగా బాప్తిస్మము పొందని వారి కోసం, తల్లిదండ్రులతో సహా వ్యక్తి లేదా చట్టపరమైన సంరక్షకుడు అభ్యర్థించినట్లయితే తప్ప రికార్డులు రద్దు చేయబడవు.
33.6.3
క్రొత్త వార్డు సభ్యుల రికార్డులు
వ్యక్తిగత విధుల సారాంశాన్ని ఖచ్చితత్వం కోసం సమీక్షించడానికి వారి సభ్యత్వ రికార్డులు వచ్చిన వెంటనే వార్డు గుమాస్తా లేదా సహాయక వార్డు గుమాస్తా క్రొత్త వార్డు సభ్యులను సంప్రదిస్తారు.
33.6.6
వారి భౌగోళిక వార్డు వెలుపల సేవలందిస్తున్న సభ్యుల రికార్డులు
33.6.6.2
పూర్తి-కాల సువార్తికుల రికార్డులు
24.6.2.8 చూడండి.
33.6.13
విడాకులు తీసుకున్న తల్లిదండ్రుల పిల్లల రికార్డులు
అన్ని సభ్యత్వ రికార్డులు స్థానిక చట్టం లేదా ఆచారం ద్వారా నిర్వచించబడిన వ్యక్తి యొక్క చట్టపరమైన పేరును ఉపయోగిస్తాయి. ఇందులో విడాకులు తీసుకున్న తల్లిదండ్రుల పిల్లలు కూడా ఉన్నారు.
విడాకులు తీసుకున్న తల్లిదండ్రులతో ఉన్న పిల్లలు తరచుగా తల్లిదండ్రులిద్దరి వార్డులలో సంఘ సమావేశాలకు హాజరవుతారు. ఒక విభాగము మాత్రమే పిల్లల అధికారిక సభ్యత్వ రికార్డును ఉంచగలిగి, నవీకరించగలిగినప్పటికీ, అతను లేదా ఆమె హాజరయ్యే ఇతర వార్డులో విభాగము వెలుపలి సభ్యత్వ రికార్డు సృష్టించబడవచ్చు. ఇది పిల్లల పేరు మరియు సంప్రదింపు సమాచారాన్ని వార్డు జాబితాలు మరియు తరగతి పట్టికలలో చేర్చడానికి అనుమతిస్తుంది.
విభాగము వెలుపలి సభ్యత్వ రికార్డు ఉన్న పిల్లలు ఆ విభాగములో పిలుపును పొందవచ్చు.
33.6.15
సభ్యత్వ రికార్డులపై పరిమితులను తరలించండి
అధికారిక సభ్యత్వ పరిమితులు లేదా మరొక తీవ్రమైన సమస్య అమలులో ఉండగా సభ్యుడు తరలిపోతే, బిషప్పు లేదా అధీకృత గుమాస్తా సభ్యత్వ రికార్డుపై తరలింపు పరిమితిని విధించవచ్చు. అతను వీటిని చేయడానికి LCR ని ఉపయోగిస్తాడు.
తరలింపు పరిమితిని కలిగి ఉన్న రికార్డు ఆ పరిమితిని విధించిన యాజకత్వ నాయకుడు దానిని తీసివేయడానికి అధికారం ఇచ్చే వరకు క్రొత్త విభాగానికి తరలించబడదు.
33.6.16
“చిరునామా తెలియని” జాబితా నుండి రికార్డులు
సంఘ ప్రధాన కార్యాలయంలో “చిరునామా తెలియని జాబితాలో” అతని లేదా ఆమె రికార్డు ఉన్న తర్వాత కొన్నిసార్లు సభ్యుడు గుర్తించబడతాడు. ఈ పరిస్థితిలో, వార్డు గుమాస్తా LCR ను ఉపయోగించి రికార్డును అభ్యర్థిస్తాడు.
33.6.17
విధుల సమాచారాన్ని నమోదు చేయడం మరియు సరిదిద్దడం
18వ అధ్యాయం చూడండి.
33.6.19
సభ్యత్వ రికార్డుల తనిఖీలు
ప్రతి సంవత్సరం LCRని ఉపయోగించి ప్రతి వార్డులో audit of membership records [సభ్యత్వ రికార్డుల తనిఖీ] నిర్వహించబడేలా స్టేకు గుమాస్తా లేదా స్టేకు సహాయక గుమాస్తా నిర్ధారిస్తారు. ప్రతి సంవత్సరం జూన్ 30లోపు తనిఖీలను పూర్తి చేయాలి.
33.7
చారిత్రక రికార్డులు
33.7.1
వార్డు మరియు స్టేకు చరిత్రలు
తన సంఘానికి సంబంధించిన “అన్ని ముఖ్యమైన విషయాల చరిత్ర” వ్రాసి ఉంచబడాలని ప్రభువు ఆదేశించారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 69:3; 5వ వచనము; ఆల్మా 37:2 కూడా చూడండి).
సంఘములోని ప్రతి విభాగము ఆ విభాగానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన విషయాలను వ్రాసియుంచాలి.
చరిత్రను సంరక్షించడం అనేది ఒక ఆధ్యాత్మిక కార్యము, దానిని వ్రాసే మరియు చదివే వారి విశ్వాసాన్ని అది బలపరుస్తుంది.
స్టేకు గుమాస్తా లేదా స్టేకు సహాయక గుమాస్తా స్టేకు చరిత్రను సిద్ధం చేస్తారు. బిషప్రిక్కు వార్డులో ఇదే విధానాన్ని అనుసరిస్తారు. ChurchofJesusChrist.org వద్ద స్టేకు, జిల్లా మరియు మిషను వార్షిక చరిత్రలలో సూచనలు లభ్యమవుతాయి.
33.8
రికార్డుల గోప్యత
సంఘ రికార్డులు కాగితంపై ఉన్నా లేదా డిజిటల్‌గా ఉన్నా గోప్యంగా ఉంటాయి. వీటిలో ఇవి ఉన్నాయి:
-
సభ్యత్వ రికార్డులు
-
ఆర్థిక రికార్డులు.
-
సమావేశాల నుండి వివరణలు.
-
అధికారిక ఫారమ్‌లు మరియు పత్రాలు (సభ్యత్వ సభల రికార్డులతో సహా).
సభ్యుల నుండి సేకరించిన సమాచారం క్రింది విధంగా ఉందని నాయకులు నిర్ధారిస్తారు:
-
సంఘానికి అవసరమైనంత మేరకు ఉంది.
-
ఆమోదించబడిన సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించబడుతుంది.
-
దాన్ని ఉపయోగించడానికి అధికారం ఉన్నవారికి మాత్రమే ఇవ్వబడుతుంది.
సాంకేతికంగా నిల్వ చేయబడిన సమాచారం తప్పనిసరిగా సురక్షితంగా ఉంచబడాలి మరియు తగిన విధంగా రక్షించబడాలి (33.9.1 చూడండి).
33.9
రికార్డుల నిర్వహణ
33.9.1
రక్షణ
అన్ని సంఘ రికార్డులు, నివేదికలు మరియు సమాచారం అనధికారిక ప్రవేశము, మార్పు, నాశనం లేదా బహిర్గతం నుండి రక్షించబడాలి. ఈ సమాచారాన్ని సురక్షితమైన స్థలంలో ఉంచాలి.
పోయిన లేదా దొంగిలించబడిన సంఘ యాజమాన్యంలోని పరికరాలు లేదా స్టోరేజ్ మీడియా తక్షణమే incidents.ChurchofJesusChrist.org వద్ద నివేదించబడాలి. సంఘ సమాచారాన్ని దుర్వినియోగం చేయడం గురించి కూడా నివేదించబడాలి.
33.9.1.1
వినియోగదారుల పేర్లు మరియు పాస్వర్డ్లు
స్టేకు అధ్యక్షులు, బిషప్పులు మరియు ఇతర నాయకులు తమ సంఘ వినియోగదారుల పేరు మరియు పాస్‌వర్డ్‌ను సలహాదారులు, గుమాస్తాలు, కార్యనిర్వాహక కార్యదర్శులు లేదా ఇతరులతో ఎప్పుడూ పంచుకోకూడదు.
33.9.1.3
సమాచార గోప్యత
అనేక దేశాలు వ్యక్తిగత సమాచార ప్రక్రియను నియంత్రించే సమాచార రక్షణ చట్టాలను రూపొందించాయి. ఇందులో వ్యక్తులను గుర్తించే సభ్యత్వ రికార్డులు మరియు ఇతర సంఘ రికార్డులలోని సమాచారం ఉంటుంది. సంఘ రికార్డుల స్థానిక నిర్వహణకు సమాచార రక్షణ చట్టాల వర్తింపు గురించి ప్రశ్నలు ఉన్న నాయకులు DataPrivacyOfficer@ChurchofJesusChrist.org వద్ద సంఘ సమాచార గోప్యతా కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.