చిత్రము 1. మొదటి సృష్టిని సూచించు కోలబ్, సిలెస్టియల్ లేదా దేవుని నివాసమునకు సమీపములోనున్నది. ఇతర సృష్టిని నియంత్రించుటలో మొదటిది, కాలము యొక్క కొలమానములో చివరిది. సిలెస్టియల్ కాలము ప్రకారము కొలమానము, ఆ సిలెస్టియల్ కాలము ఒక దినము ఒక మూరెడును సూచించును. ఈ భూమి యొక్క కొలమానము ప్రకారము కోలబ్‌లో ఒక దినము వెయ్యేండ్లతో సమానము, అది ఐగుప్తీయులచేత యహోయే అని పిలువబడెను.
చిత్రము 2. ఐగుప్తీయుల చేత ఓలిబ్లిషు అని పేరుపెట్టబడిన నక్షత్రము కోలబ్ తరువాత ఉన్నది, అది సిలెస్టియల్ లేదా దేవుడు నివాసముండు స్థలమునకు సమీపముగానున్నది, ఇతర సృష్టిని నియంత్రించు పెద్ద నక్షత్రములలో ఇది రెండవది; ఇతర గ్రహములకు సంబంధించిన అధికారము యొక్క తాళపుచెవిని కలిగియున్నది; అబ్రాహాము ప్రభువుకు ఒక బలిపీఠమును కట్టించి, ఆ బలిపీఠముపై బలి అర్పించగా దేవుని నుండి ఆయనకు బయలుపరచబడినది.
చిత్రము 3. తన సింహాసనముమీద కూర్చొనియున్న దేవునిని తెలుపుటకు ఇది గీయబడినది, శిరస్సుపై నిత్యవెలుగు కిరీటమును, శక్తి మరియు అధికారములను ఆయన ధరించెను; ఏదోను తోటలో ఆదామునకు అంతేకాక సేతు, నోవహు, మెల్కీసెదెకు, అబ్రాహాము మరియు యాజకత్వము బయలుపరచబడిన వారందరికి తెలుపబడిన విధముగా పరిశుద్ధ యాజకత్వము యొక్క గొప్ప ప్రత్యేక పదాలను కూడా తెలుపుచున్నది.
చిత్రము 4. హెబ్రీ పదమైన రౌకీయాంగ్‌కు సమానార్థము గలది, విశాలమును లేదా ఆకాశ మహాకాశములను తెలుపుచున్నది; ఇది ఐగుప్తు భాషలో ఒక వెయ్యిని సూచించు సంఖ్య యొక్క గుర్తు కూడా; దాని భ్రమణములోను, కాలము యొక్క లెక్కింపులోను కోలబ్‌తో సమానముగానున్న ఓలిబ్లిషు కాలము యొక్క లెక్కింపునకు ఇది సమానము.
చిత్రము 5. ఐగుప్తు భాషలో ఎనిష్-గో-ఆన్-దోష్ అని పిలువబడును; ఇది కూడా సృష్టిని నియంత్రించు గ్రహములలో ఒకటి, ఐగుప్తీయులచేత సూర్యుడని, కోలబ్‌నుండి కేయివన్రాష్ మాంధ్యము ద్వారా కాంతిని పొందుచున్నదని, అది గొప్ప తాళపుచేయి లేదా మరొక విధముగా సృష్టిని నియంత్రించు శక్తియని, అది స్థిరముగానున్న పదిహేను ఇతర గ్రహములు లేదా నక్షత్రములను ఏలునని పేర్కొనబడెను, అంతేకాక ఫ్లోయీస్ లేదా చంద్రుని, భూమిని, సూర్యుని, వాటి వార్షిక భ్రమణములను నియంత్రించును. ఈ గ్రహము దాని శక్తిని క్లి-ఫ్లోస్-ఇస్-ఎస్ లేదా హా-కొ-కౌ-బీమ్ యొక్క మాధ్యమము ద్వారా పొందును, 22, 23 సంఖ్యలచేత సూచించబడిన ఈ నక్షత్రములు కోలబ్ యొక్క భ్రమణముల వలన కాంతిని పొందుచున్నవి.
చిత్రము 6. నాలుగు దిశలలో ఈ భూమిని సూచించుచున్నది.
చిత్రము 7. తన సింహాసనముపై కూర్చొనియున్న దేవుడు ఆకాశ మాధ్యమము ద్వారా పరిశుద్ధ యాజకత్వము యొక్క గొప్ప ప్రత్యేక పదాలను బయలుపరచుటను సూచించుచున్నది; పరిశుద్ధాత్మ పావురము వలె అబ్రాహాము యొద్దకు వచ్చే సూచనను కూడా తెలుపుచున్నది.
చిత్రము 8. లోకమునకు బయలుపరచజాలని వ్రాతలను కలిగియున్నది; కానీ దానిని దేవుని పరిశుద్ధ దేవాలయములో పొందవచ్చును.
చిత్రము 9. ప్రస్తుత కాలములో ఇది బయలుపరచబడకూడదు.
చిత్రము 10. ఇది కూడా.
చిత్రము 11. ఇది కూడా. లోకము ఈ అంకెలను కనుగొనగలిగిన యెడల, అది అనుమతించబడును. ఆమేన్.
చిత్రములు 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 మరియు 21 ప్రభువు యొక్క యుక్త కాలములో ఇవ్వబడును.
పై అనువాదము ప్రస్తుత కాలములో మాకు అనుమతి ఉన్నంతవరకు ఇవ్వబడినది.