అబ్రాహాము గ్రంథము నుండి ఒక ప్రతి సంఖ్య 3 వివరణ చిత్రము 1. పరలోకమందున్న గొప్ప అధ్యక్షత్వమునకు గుర్తుగా యాజకత్వమును సూచించుచు రాజు యొక్క సౌజన్యముతో తన తలమీద కిరీటమును ధరించి, తన చేతిలో న్యాయమును, తీర్పు దండమును పట్టుకొని ఫరో సింహాసనముమీద అబ్రాహాము కూర్చొనియుండుట. చిత్రము 2. ఫరో రాజు, అతని తలమీదనున్న అక్షరములలో అతని పేరు ఇవ్వబడెను. చిత్రము 3. ఒకటవ ప్రతిలోని 10వ చిత్రములో కూడా ఇవ్వబడిన విధముగా ఐగుప్తులోనున్న అబ్రాహామును సూచించుచున్నది. చిత్రము 4. చేతికి పైన వ్రాయబడినట్లుగా ఐగుప్తు రాజైన ఫరో రాకుమారుడు. చిత్రము 5. తన చేతికి పైనున్న అక్షరముల ద్వారా సూచించబడినట్లుగా రాజు యొక్క ప్రధాన పానదాయకుడైన షూలేము. చిత్రము 6. రాకుమారునికి చెందిన బానిసయైన ఒలిమ్లాహు. ఖగోళశాస్త్ర సూత్రములను గూర్చి అబ్రాహాము రాజసభలో తర్కించుట.