2024 రండి, నన్ను అనుసరించండి
రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు ఉపయోగించుట


రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు ఉపయోగించుట,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2023)

రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు ఉపయోగించుట,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024

చిత్రం
లేఖనాలను చదువుతున్న కుటుంబము

రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు ఉపయోగించుట

ఈ వనరు ఎవరి కొరకైనది?

వ్యక్తిగతంగా, కుటుంబంగా మరియు సంఘ తరగతుల్లో మోర్మన్ గ్రంథము నుండి నేర్చుకోవాలనుకొనే ప్రతీఒక్కరి కొరకైనది ఈ వనరు. మీరు గతంలో లేఖనాలను క్రమం తప్పకుండా చదవనట్లయితే, ఈ వనరు మీరు ప్రారంభించేందుకు సహాయపడగలదు. మీకు ఇదివరకే లేఖనాలను చదివే మంచి అలవాటు ఉంటే, ఇంకా ఎక్కువ అర్థవంతమైన అనుభవాలను కలిగియుండేందుకు ఈ వనరు మీకు సహాయపడగలదు.

ఇంటివద్ద వ్యక్తులు మరియు కుటుంబాలు

సువార్తను నేర్చుకోవడానికి ఉత్తమమైన ప్రదేశం ఇల్లు. సంఘములో మీ బోధకులు మీకు సహకరించగలరు మరియు ఇతర వార్డు సభ్యుల నుండి మీరు ప్రోత్సాహాన్ని పొందగలరు. కానీ ఆధ్యాత్మికంగా జీవించడానికి మీకు మరియు మీ కుటుంబానికి “దేవుని సువార్త” నుండి అనుదిన పోషణ అవసరము (మొరోనై 6:4; రస్సెల్ ఎమ్. నెల్సన్, “ప్రారంభ వ్యాఖ్యలు,” లియహోనా, నవ. 2018, 6–8 కూడా చూడండి).

మీకు సహాయకరంగా ఉండే ఏ విధానంలోనైనా ఈ వనరును ఉపయోగించండి. దీనిలోనున్న సారాంశాలు మోర్మన్ గ్రంథములో కనుగొనబడు కొన్ని నిత్య సత్యాలను ఎత్తిచూపుతాయి మరియు వ్యక్తిగతంగా, మీ కుటుంబంతో లేదా స్నేహితులతో మీరు లేఖనాలను అధ్యయనం చేయడానికి సహాయపడే ఆలోచనలను, కార్యకలాపాలను సూచిస్తాయి. మీరు అధ్యయనం చేస్తున్నప్పుడు, మీకు అర్థవంతమనిపించే నిత్య సత్యాలను కనుగొనడానికి ఆత్మ యొక్క నడిపింపును అనుసరించండి. మీ కొరకు దేవుని సందేశాలకై చూడండి మరియు మీరు పొందే ప్రేరేపణలను అనుసరించండి.

సంఘము వద్ద బోధకులు మరియు అభ్యాసకులు

మీరు ఒక ప్రాథమిక తరగతికి, యౌవనుల లేదా పెద్దల ఆదివారపు బడి తరగతికి, ఒక అహరోను యాజకత్వ సమూహానికి లేదా యువతుల తరగతికి బోధిస్తున్నట్లయితే, మీరు బోధించడానికి సిద్ధపడుతున్నప్పుడు ఈ వనరులోని సారాంశాలను ఉపయోగించడానికి మీరు ప్రోత్సహించబడుతున్నారు. రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు అనేది మీ ఆదివారపు తరగతి కొరకైన పాఠ్యప్రణాళిక. ఈ వనరులోని అభ్యాస ఉపాయములు గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి రూపొందించబడ్డాయి. మీరు బోధించడానికి సిద్ధపడుతున్నప్పుడు, లేఖనాలలో మీ స్వంత అనుభవాలను కలిగియుండడం ద్వారా ప్రారంభించండి. మీరు లేఖనాలను పరిశోధించి, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణను వెదికినప్పుడు, మీ అత్యంత ముఖ్యమైన సిద్ధపాటు సంభవిస్తుంది. మరింతగా పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు వలె మారడానికి మీకు సహాయపడే నిత్య సత్యాల కొరకు చూడండి. ఈ సత్యాలలో కొన్నింటిని గుర్తించడానికి మరియు లేఖన సందర్భాలను అర్థం చేసుకోవడానికి రండి, నన్ను అనుసరించండి మీకు సహాయపడగలదు.

సువార్తను ఉత్తమంగా నేర్చుకొనుట అనేది గృహ-కేంద్రీకృతమైనది మరియు సంఘ సహకారమివ్వబడినది అని గుర్తుంచుకోండి. ఇతర మాటలలో, మీరు బోధించే జనులకు ఇంటివద్ద సువార్తను నేర్చుకొని, జీవించడానికి వారు చేసే ప్రయత్నాలలో సహకరించడమే మీ ప్రధాన బాధ్యత. వారి అనుభవాలను, ఆలోచనలను మరియు లేఖన గద్యభాగాల గురించి ప్రశ్నలను పంచుకోవడానికి వారికి అవకాశాలివ్వండి. వారు కనుగొన్న నిత్య సత్యాలను పంచుకోమని వారిని అడగండి. పాఠంలో నిర్దిష్ట మొత్తాన్ని పూర్తిచేయడం కంటే ఇది చాలా ముఖ్యమైనది.

ప్రాథమిక

ప్రాథమికకు బోధించడానికి మీ సిద్ధపాటు అనేది మీరు వ్యక్తిగతంగా మరియు మీ కుటుంబంతో మోర్మన్ గ్రంథమును అధ్యయనం చేస్తున్నప్పుడు మొదలవుతుంది. మీరు అలా చేసినప్పుడు, మీ ప్రాథమిక తరగతిలోని పిల్లల గురించి పరిశుద్ధాత్మ నుండి వచ్చే ఆత్మీయ మనోభావాలను, అంతర్దృష్టులను పొందడానికి సిద్ధంగా ఉండండి. ప్రార్థనాపూర్వకంగా ఉండండి మరియు యేసు క్రీస్తు యొక్క సువార్తను నేర్చుకోవడానికి వారికి సహాయపడేందుకు ఉపాయాలతో ఆత్మ మిమ్మల్ని ప్రేరేపించగలడు.

మీరు బోధించడానికి సిద్ధపడుతున్నప్పుడు, ఈ సారాంశములోని బోధనా ఉపాయాలను అన్వేషించడం ద్వారా మీరు అదనపు ప్రేరేపణను పొందవచ్చు. రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు లోని ప్రతీ సారాంశములో “పిల్లలకు బోధించడానికి ఉపాయములు” అనే శీర్షికగల విభాగము కలదు. ఈ ఉపాయాలను మీ ప్రేరేపణను వెలిగించే సూచనలుగా భావించండి. మీ ప్రాథమిక తరగతిలోని పిల్లలు మీకు తెలుసు—మరియు తరగతిలో మీరు వారితో మాట్లాడినప్పుడు వారి గురించి మీరు ఇంకా బాగా తెలుసుకుంటారు. దేవుడు కూడా వారిని ఎరిగియున్నారు మరియు వారికి బోధించడానికి, దీవించడానికి ఉత్తమమైన మార్గాలతో ఆయన మిమ్మల్ని ప్రేరేపిస్తారు.

రండి, నన్ను అనుసరించండి లోని కొన్ని ప్రోత్సాహ కార్యక్రమాలను మీ తరగతిలోని పిల్లలు ఇదివరకే వారి కుటుంబాలతో చేసియుండవచ్చు. ఫరవాలేదు. మళ్ళీ చేయడం మంచిది. వారు ఇంటివద్ద నేర్చుకున్నదానిని ఒకరితో ఒకరు పంచుకోమని పిల్లలను ఆహ్వానించడాన్ని పరిగణించండి—అయినప్పటికీ, వారు ఇంటి వద్ద నేర్చుకోకపోయినా కూడా పిల్లలు పాల్గొనడానికి మార్గాలను మీరు ప్రణాళిక చేయాలి. రకరకాల ప్రోత్సాహ కార్యక్రమాల ద్వారా మళ్ళీ మళ్ళీ ఈ సత్యాలు బోధించబడినప్పుడు పిల్లలు సువార్త సత్యాలను మరింత ప్రభావవంతంగా నేర్చుకుంటారు. ఒక అభ్యాస కార్యక్రమము పిల్లల కొరకు ప్రభావవంతంగా ఉన్నట్లు మీరు కనుగొన్నప్పుడు, ప్రత్యేకించి మీరు చిన్నపిల్లలకు బోధిస్తున్నట్లయితే దానిని పునరావృతం చేయడం గురించి ఆలోచించండి. ఇంతకుముందు పాఠం నుండి కూడా మీరు ఒక ప్రోత్సాహ కార్యక్రమాన్ని పునర్వీక్షించవచ్చు.

ఐదు ఆదివారాలు ఉన్న నెలల్లో, ఐదవ ఆదివారం ప్రణాళిక చేయబడిన రండి, నన్ను అనుసరించండి సారాంశాన్ని అనుబంధం బి: ప్రాథమిక కొరకు—దేవుని నిబంధన బాటపై జీవితకాలము నిలిచేందుకు పిల్లలను సిద్ధపరచుటలో ఉన్న ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అభ్యాస కార్యకలాపాలతో భర్తీ చేయమని ప్రాథమిక బోధకులు ప్రోత్సహించబడ్డారు.

యౌవనులు మరియు పెద్దల ఆదివారపు బడి తరగతులు

యేసు క్రీస్తును అనుసరించడానికి మనం ప్రయత్నిస్తున్నప్పుడు ఒకరికొకరం సహకరించుకోవడం మరియు ప్రోత్సహించుకోవడమే ఆదివారపు బడి తరగతులలో మనం సమకూడడానికి గల ఒక ముఖ్య కారణం. దీనిని చేయడానికి ఒక సులువైన మార్గము, “రండి, నన్ను అనుసరించండి తో మోర్మన్ గ్రంథమును మీరు చదివినప్పుడు, పరిశుద్ధాత్మ ఈ వారం మీకు ఏమి బోధించాడు?” వంటి ప్రశ్నను అడగడం. ఈ ప్రశ్నకు జవాబులు యేసు క్రీస్తు మరియు ఆయన సువార్తలో విశ్వాసాన్ని పెంపొందించే అర్థవంతమైన చర్చలకు దారితీయగలవు.

అప్పుడు మీరు రండి, నన్ను అనుసరించండి లోని అధ్యయన సూచనలపై ఆధారపడి చర్చను ఆహ్వానించవచ్చు. ఉదాహరణకు, ఆల్మా 36 ను పరిశోధించి, పశ్చాత్తాపములో రక్షకుని పాత్ర గురించి బోధించే పదాలను జాబితా చేయమని ఒక అధ్యయన ఉపాయము సూచించవచ్చు. వారు కనుగొన్న పదాలను పంచుకోమని, వాటి గురించి మాట్లాడమని మీరు తరగతి సభ్యులను అడగవచ్చు. లేదా ఒక తరగతిగా మీరు కలిసి జాబితా చేయడంలో కొంత సమయం గడపవచ్చు.

అహరోను యాజకత్వ సమూహములు మరియు యువతుల తరగతులు

ఆదివారాలు అహరోను యాజకత్వ సమూహములు మరియు యువతుల తరగతులు కలుసుకున్నప్పుడు, వారి ఉద్దేశ్యము ఆదివారపు బడి తరగతి కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. యేసు క్రీస్తు యొక్క సువార్తను నేర్చుకోవడానికి ఒకరికొకరు సహాయపడడానికి అదనంగా, ఈ సమూహాలు రక్షణ మరియు ఉన్నతస్థితి కార్యమును సాధించడం గురించి చర్చించడానికి కూడా కలుసుకుంటాయి (see General Handbook: Serving in The Church of Jesus Christ of Latter-day Saints, 1.2). వారు దీనిని తరగతి మరియు సమూహ అధ్యక్షత్వాల మార్గనిర్దేశకత్వం క్రింద చేస్తారు.

ఈ కారణం చేత, ప్రతీ సమూహము లేదా తరగతి సమావేశము వారి ప్రయత్నాల గురించి సమూహము లేదా తరగతి అధ్యక్షత్వము యొక్క సభ్యుడు చర్చను నడిపించడంతో ప్రారంభం కావాలి, ఉదాహరణకు, సువార్తను జీవించడం, అవసరంలో నున్న జనులకు పరిచర్య చేయడం, సువార్తను పంచుకోవడం లేదా దేవాలయము మరియు కుటుంబ చరిత్ర కార్యములో పాల్గొనడం వంటివి.

కలిసి సలహా సమావేశం జరిపిన తర్వాత, కలిసి సువార్తను నేర్చుకోవడానికి ఒక ఉపదేశకుడు తరగతిని లేదా సమూహాన్ని నడిపిస్తాడు. తరగతి లేదా సమూహములో పెద్దవారైన నాయకులు లేదా సభ్యులు బోధించడానికి నియమించబడగలరు. పెద్దవారైన నాయకులతో సంప్రదించి, తరగతి లేదా సమూహ అధ్యక్షత్వము ఈ నియామకాలను చేస్తారు.

బోధించడానికి నియమించబడిన వారు రండి, నన్ను అనుసరించండి యొక్క వారపు సారాంశంలోని అభ్యాస సూచనలను ఉపయోగిస్తూ సిద్ధపడాలి. ప్రతీ సారాంశంలో, ఈ చిహ్నము ప్రత్యేకించి యౌవనులకు తగిన ప్రోత్సాహ కార్యక్రమాన్ని సూచిస్తుంది. అయినప్పటికీ, సారాంశంలోని సూచనలలో దేనినైనా యౌవనుల కొరకు అభ్యాస కార్యకలాపముగా ఉపయోగించవచ్చు.

సమూహము మరియు తరగతి సమావేశాల విషయపట్టిక నమూనా కొరకు అనుబంధము డి చూడండి.

ముద్రించు